న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల తుది విడత పోలింగ్ మరికొద్ది గంటల్లో జరుగనుండగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీచేసింది. పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా రాహుల్.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న బీజేపీ ఫిర్యాదు మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిసెంబర్ 18, సాయంత్రం 5 గంటలలోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌కు ఈసీ సూచించింది.
గురువారం (డిసెంబర్ 14న) గుజరాత్ అసెంబ్లీ రెండో విడత పోలింగ్ జరుగనుండగా, మంగళవారం(డిసెంబర్ 12) సాయంత్రంతోనే ప్రచారానికి తెరపడిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం(డిసెంబర్ 13న) పలు టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన రాహుల్ గాంధీ.. వాటిలో గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమన్న బీజేపీ.. ఈసీకి ఫిర్యాదుచేసింది.
రాహుల్‌కు ఈసీ నోటీసులు..
రాహుల్ ఇంటర్వ్యూలపై ఈసీకి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు..
Comments
Please login to add a commentAdd a comment