
పరువు నష్టం కేసులో దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సిద్దమయ్యినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన మంగళవారం (ఏప్రిల్ 03, 2023న) సూరత్ సెషన్స్ కోర్టులో తన శిక్షను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తన పిటిషన్‌లో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.
అలాగే దీనిపై తీర్పు వెలువడేంత వరకు మధ్యంతర ఉత్తర్వులు విధించాలని సెషన్స్ కోర్టుని అభ్యర్థించనున్నారు. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి పరువు నష్టం కేసులో రాహుల్‌గాందీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలసింది. ఆ తదుపరి వెంటనే ఎంపీగా లోక్‌సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. ఆ వెను వెంటనే అధికారిక నివాసాన్ని సైతం ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఎదుర్కొనేందుకు రాహుల్ ప్రణాళికలు రచిస్తున్నట్టు వెల్లడైంది.
(చదవండి: కాఫీ షాప్ పార్కింగ్ ఆఫర్..రూ 60 కోసం పదేళ్లు పోరాడి గెలిచాడు)
Comments
Please login to add a commentAdd a comment