BJP MLA Behind Rahul Defamation Suit Changed Name in 1988 - Sakshi
Sakshi News home page

Rahul Gandhi Case: ఆ ఎమ్మెల్యే ఇంటిపేరు మోదీ కాదు, భూత్‌వాలా

Published Sun, Mar 26 2023 4:53 AM | Last Updated on Sun, Mar 26 2023 1:06 PM

Surname was Bhootwala, but caste Modi - Sakshi

అహ్మదాబాద్‌: పరువు నష్టం కేసుతో రాహుల్‌గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడేందుకు కారణమై గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ‘దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకుంటుందో’ అన్న వ్యాఖ్యలతో మోదీ ఇంటి పేరు ఉన్నవారందరినీ రాహుల్‌ అవమానించారంటూ ఆయన కేసు పెట్టారు. ఇంతా చేస్తే పూర్ణేశ్‌ ఇంటి పేరు మోదీ కాదు, భూత్‌వాలా! వాదనల సందర్భంగా ఈ విషయాన్ని రాహుల్‌ లాయర్‌ కూడా కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి కౌంటర్‌గా తమ కులం పేరు మోదీ ఘాంచీ అని పూర్ణేశ్‌ చెప్పారు.

‘‘మేం గుజరాత్‌లో నూనె తయారీ వ్యాపారంలో ఉన్నాం. మా సామాజిక వర్గానికి చెందిన వారు దేశంలో పలు ఇంటి పేర్లతో 13 కోట్ల మంది దాకా ఉన్నారు. వారిని రాజస్థాన్‌లో ఘాంచీ, గుజరాత్‌లో మోదీ అని పిలుస్తారు. మేం చేసే పనిని బట్టి లప్సీవాలా, దాల్‌వాలా, చోంఖ్‌వాలా, ఖాదీవాలా ... ఇలా మా ఇంటిపేరు వస్తుంది. మా పూర్వీకులు సూరత్‌లో భూత్‌ సేరిలో నివాసముండటంతో భూత్‌వాలా అని ఇంటి పేరు వచ్చింది. 1988లో దాన్ని మోదీగా మార్చుకున్నా’’ అన్నారు!
(చదవండి: Defamation case: పోరాడుతూనే ఉంటా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement