చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ లే హైదరాబాద్ లో సెటిలర్లని, మిగిలిన వారంతా తెలంగాణ బిడ్డలేనని టీఆర్ ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ లే హైదరాబాద్ లో సెటిలర్లని, మిగిలిన వారంతా తెలంగాణ బిడ్డలేనని టీఆర్ ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. అసలు 'సెటిలర్' అన్న పదాన్ని సృష్టించిందే టీడీపీ అన్నారు. తమ పార్టీలో సీమాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల వారుకూడా సభ్యత్వం పొందేందుకు తహతహలాడుతున్నారని తెలిపారు. అయితే టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తామెందుకు అడ్డుకుంటామని, తమ దృష్టంతా అభివృద్ధిపైనే ఉందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.