వైఎస్సార్‌సీపీ అహ్మద్‌ భాషా అరెస్ట్‌.. పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు! | YSRCP Ahmed Basha Arrest By AP People | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అహ్మద్‌ భాషా అరెస్ట్‌.. చిన్న చౌక్‌ పీఎస్‌ వద్ద భారీ బందోబస్తు!

Published Mon, Apr 7 2025 7:12 AM | Last Updated on Mon, Apr 7 2025 11:13 AM

YSRCP Ahmed Basha Arrest By AP People

సాక్షి, వైఎస్సార్‌: ఏపీలో కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా సోదరుడు వైఎస్సార్‌సీపీ నేత అహ్మద్ భాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆయనను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.

ఏపీలో పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ నేత అహ్మద్‌ భాషాను ముంబైలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం, ముంబై నుంచి బెంగళూరుకు విమానంలో తరలించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏపీకి తీసుకువచ్చారు. అయితే అహ్మద్‌ భాషాను ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు అనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నగర శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు.. కడప చిన్న చౌక్‌ పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా చిన్న చౌక్ పోలీస్ స్టేషన్‌లోనే ఆయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో కడప తాలూకా పోలీసు స్టేషన్‌లో స్థల వివాదం విషయంలో అహ్మద్‌ భాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement