amjad basha
-
వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు దుర్మార్గం: అంజాద్ బాషా
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చంద్రబాబు సర్కార్‌లో కనిపిస్తోందని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.‘‘నిధులు లేవంటూ వైఎస్ జగన్‌పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. ఎమ్మెల్యేలు, ముత్తవలీలు, స్థానికసంస్థలు.. ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయి. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేశారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు నాలుగు పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది.. మరి కమిటీని ఎలా రద్దు చేస్తారు..?’’ అంటూ ప్రశ్నించారు.‘‘కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా..?. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్లను ఉపసంహరించుకోవాలి.. కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి..?..2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాకా చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు.. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది.. దాన్ని ముస్లింలంతా అంతా వ్యతిరేకిస్తున్నారువైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటులో వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి.. అందుకే వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్సీపీ తరపున పోరాడతాం’’ అని అంజాద్ బాషా స్పష్టం చేశారు. -
చంద్రబాబుపై అంజాద్ బాషా ఫైర్
-
సోషల్ మీడియా యాక్టివిస్టులకు YSRCP అండ
-
సోషల్‌మీడియా కార్యకర్తల కుటుంబాలకు వైఎస్సార్సీపీ నేతల భరోసా
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో సోషియల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ నాయకులు భరోసా ఇచ్చారు. సోషియల్ మీడియా కో కన్వీనర్ నిషాంత్, దుర్గా ప్రసాద్‌తో పాటు పలు కుటుంబాలను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు ఆదివారం(నవంబర్17) పరామర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ‘ గత కొన్ని రోజులుగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నోటీసుల పేరుతో పోలీసులు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు అర్థరాత్రి సమయాల్లో ఇళ్లకు వస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తారా? వారికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాం’అని తెలిపారు. -
పెట్రోల్ దాడి పై YSRCP అంజాద్ బాషా రియాక్షన్
-
దళితులంటే ఎందుకంత ద్వేషం.. బాబు, పవన్ క్షమాపణ చెప్పాలి.. అంజాద్ బాషా ఫైర్
-
షర్మిల వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం అంజాద్ భాష కౌంటర్
-
షర్మిల ఆత్మ పరిశీలన చేసుకోవాలి
కడప కార్పొరేషన్: పీసీపీ అధ్యక్షురాలు షర్మిల ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్‌బాషా హితవు పలికారు. గతంలో జగనన్న చెల్లిగా ఈ జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారని, ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలిగా వస్తే కనీస స్పందన కూడా లేదన్నారు. రాజన్న రాజ్యం స్థాపిస్తానని తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె అక్కడి ప్రజలను, నాయకులను నట్టేట ముంచి ఎన్నికల్లో పోటీచేయకుండా అస్త్ర సన్యాసం చేసిందన్నారు. ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలో శనివారం అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజులుగా షర్మిల వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తున్నారని, ఈ సందర్భంగా ఆమె సీఎం వైఎస్ జగన్‌ని, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్‌పై అభాండాలు దారుణం.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ను రెండుసార్లు ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొస్తే ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి షర్మిల మర్చిపోయారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌పై సంబంధంలేని కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టిన విషయాన్ని ఆమె మర్చిపోవచ్చేమోగానీ ప్రజలు మర్చిపోలేదన్నారు. షర్మిల పరిస్థితి చూస్తే తమకే బాధేస్తోందని, జనాలు లేక చాలాచోట్ల మాట్లాడకుండానే ఆమె వెళ్లిన పరిస్థితి ఉందన్నారు. మీ స్వార్థ రాజకీయాల కోసం బాబు మాయలో పడి వైఎస్ జగన్‌పై అభాండాలు దారుణమన్నారు. ఇష్టానుసారంగా సీఎం జగన్, అవినాష్‌రెడ్డిపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు హర్షించలేదన్న సత్యాన్ని ఆమె గ్రహించాలన్నారు. కోర్టులో ఉన్న కేసుకు సంబంధించి అవినాష్‌రెడ్డిని హంతకుడని మాట్లాడటం అనైతికమని.. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని అంజద్‌బాషా చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలతో వేదికను పంచుకుంటూ బాబు స్క్రిప్టును చదవడం దారుణమన్నారు. షర్మిల, సునీత గతంలో ఏం మాట్లాడారో, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో అందరికీ తెలుసన్నారు. -
టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్
-
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
బీజేపీతో పొత్తు ?..యాంకర్ ప్రశ్నకు డిప్యూటీ సీఎం సూపర్ రిప్లై
-
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్‌ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్‌బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్‌బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్‌దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్‌రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
బనగానపల్లెలో జనసునామీ
సాక్షి, నంద్యాల: బనగానపల్లె నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వారు సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండతో తాము సమాజంలో ఎదిగిన తీరును, తలెత్తుకొని తిరగగలుగుతున్న వైనాన్ని తెలుపుతూ బుధవారం భారీగా సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, యువత, వృద్ధులు అధిక సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పట్టణంలోని రోడ్లన్నీ కిక్కిరిశాయి. స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధ్యక్షతన బనగానపల్లె పట్టణంలో జరిగిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంతగా ప్రజలు పోటెత్తారు. జై జగన్.., మళ్లీ జగనే కావాలి అంటూ ప్రజలు చేసిన నినాదాలతో సభాప్రాంగణం హోరెత్తింది. అభివృద్ధి పథంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు: ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చేయి పట్టుకొని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యం అందిస్తూనే, అనేక పథకాలతో, కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకు అన్ని పదవుల్లో అధిక శాతం ఈ వర్గాలకే ఇస్తూ సీఎం జగన్ అందిస్తున్న చేయూత మరెవరికీ సాధ్యం కాదని తెలిపారు. సీఎం జగన్ వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారం దక్కిందని, ఈ వర్గాలే ప్రభుత్వానికి వెన్నెముక అని అన్నారు. మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా అడుగుతున్న సీఎం దేశంలో జగన్ మాత్రమేనన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏనాడూ మైనార్టీలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ శాఖను ఇతర వర్గాలకు కేటాయించిన ఘనుడు చంద్రబాబేనన్నారు. చంద్రబాబు దళితులను అవమానించారు: ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి దళిత, బలహీన వర్గాలను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకొని చూసుకొంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్పారు. దళితుడిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి గౌరవించారన్నారు. అన్ని పథకాలు, పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లను, ఆస్పత్రులను సీఎం జగన్ కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలకు పైగా లబ్ధి చేకూర్చారని గుర్తు చేశారు. చంద్రబాబు దళితులను తీవ్రంగా అవమానించారని, స్నానం చేయరని, శుభ్రంగా ఉండరని, వారికి రాజకీయాలెందుకంటూ టీడీపీ నేతలు నీచంగా మాట్లాడినా చంద్రబాబు ఖండించలేదని తెలిపారు. సొంత సామాజిక వర్గమే ఎప్పటికీ అధికారం చెలాయించాలనుకునే వ్యక్తి చంద్రబాబు మాత్రమేనన్నారు. ధన, కుల, అవినీతి దాహమే బాబు అజెండా అని మండిపడ్డారు. వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ బాబు అని చెప్పారు. అవినీతికి తలుపులు బార్లా తెరిచిన ఘనత ఒక్క చంద్రబాబుదేనని అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను నమ్ముకుంటే.. సీఎం వైఎస్ జగన్ ప్రజలను మాత్రమే నమ్ముకున్నారన్నారు. దళితులకు పెద్దపీట వేసిన సీఎం జగన్: ఎంపీ డాక్టర్ గురుమూర్తి రాజ్యాధికారంలో భాగస్వాములైనప్పుడే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని నమ్మి, ఆచరణలో పెట్టిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు నామినేషన్ కింద ఇచ్చే పనుల్లోనూ దళితులకు పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పదవీకాలంలో 34 వేల ఉద్యోగాలే ఇచ్చారని, ఈ నాలుగున్నరేళ్లలో సీఎం వైఎస్ జగన్ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం జగన్ నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు
-
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయ పట్టం
సాక్షి, నంద్యాల: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా సముచితస్థానం ఇచ్చి, సామాజిక న్యాయం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఈ వర్గాలకే ఆయన కేటాయించారని చెప్పారు. అలాగే, మంత్రివర్గంలో దాదాపు 70 శాతం పదవులు బడుగు, బలహీన వర్గాలకే కేటాయించి రాజకీయంగా ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసిన ఘనత జగన్‌దేనన్నారు. దేశంలోనే మైనార్టీల పక్షపాత ప్రభుత్వం జగనన్నదేనన్నారు. సామాజిక సాధికార యాత్రలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో అంజాద్ బాషా మాట్లాడారు. నా పాలన చూడండి, నా పథకాలు చూసి ఓటు వేయండి అని అడిగే ధైర్యం 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు లేదన్నారు. పేదలకు, పెత్తందార్లకు జరిగే మహా సంగ్రామంలో ప్రజలంతా పేదల ప్రభుత్వమైన వైఎస్సార్సీపీ వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే కల్పించలేదని అంజాద్ బాషా గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం.. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పాలించిన పార్టీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశాయని.. కానీ, మొట్టమొదటిసారి వీరందరికీ సంపూర్ణ రాజ్యాధికారం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కొనియాడారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానిస్తే అదే వర్గానికి చెందిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి సమున్నత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. నా అక్క, చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అంటూ ఎస్సీలను తన కుటుంబ సభ్యులుగా వైఎస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతీ పేదవారు ఆర్థికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి రాష్ట్రంలో ఉన్నప్పుడు వరుణ దేవుడు ఇటువైపు తొంగిచూసేందుకు కూడా భయపడ్డాడని, వారంతా హైదరాబాద్‌కు వెళ్లగానే మళ్లీ వర్షాలు పడుతున్నాయన్నారు. బీసీల విలువ జగన్ పెంచుతున్నారు.. ఇక సామాజిక సాధికార యాత్రలో పాల్గొంటున్న బీసీ ప్రజాప్రతినిధులను టీడీపీ నాయకులు సున్నాతో పోలుస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో బీసీలంతా సున్నాగానే ఉండిపోయారని.. కానీ, వైఎస్ జగన్ సీఎం అయ్యాక సున్నా ముందు ఒకటి అనే సంఖ్య పెట్టి బీసీల విలువ పెంచుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు బీసీలను నీచంగా చూస్తున్నారని.. గొర్రెలు, బర్రెలు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీరు అవమానిస్తే సీఎం జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటున్నారన్నారు. మీ తోకలు కట్ చేస్తానని నాయీ బ్రాహ్మణులను చంద్రబాబు అవమానిస్తే అదే వర్గానికి చెందిన వారిని పాలకమండళ్ల సభ్యునిగా చేసి సీఎం జగన్ గౌరవించారన్నారు. ఒళ్లు ఎలా ఉందని మత్స్యకారులను చంద్రబాబు బెదిరిస్తే అదేవర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభ్యకు పంపి గౌరవించిన ఘనత జగన్‌కు దక్కుతుందని అనిల్ చెప్పారు. మంచికి చెడుకు మధ్య జరిగే యుద్ధంలో మనమంతా మంచి కోసం పోరాడుతున్న జగన్ వైపు నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఏకమై జగన్‌ను సీఎం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14కి 14 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఇచ్చి వైఎస్సార్సీపీకి అండగా నిలబడ్డారని.. 2024 ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌తో పాటు బంపర్ మెజార్టీలు ఇవ్వాలని అనిల్ అభ్యర్థించారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. నవరత్నాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సీఎం జగన్ న్యాయం చేస్తున్నారన్నారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజలంతా మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. జోరు వానలోనూ ప్రభం‘జనం’.. ఇక మంగళవారం నంద్యాల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయ్యింది. కనుచూపు మేర ఎటుచూసినా ప్రజలే కనిపించారు. ఇసుకేస్తే రాలనంత జనం సభకు తరలివచ్చారు. జై జగన్.. జైజై జగన్.. జోహార్ వైఎస్సార్ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే తామంతా నిలుస్తామని నినదించారు. మరోవైపు.. అట్టహాసంగా ప్రారంభమైన సభకు వరుణ దేవుడు స్వాగతం పలికాడు. నాయకులంతా సభా ప్రాంగణానికి ర్యాలీగా బయలుదేరే సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. అంతటి వర్షంలోనూ కార్యకర్తలు, ప్రజలు నాయకుల కోసం నిరీక్షించారు. సభకు మహిళలు, యువకులు, వృద్ధులు పోటెత్తారు. వర్షంవల్ల సభ ఆలస్యమైనా ఓపికతో వారంతా ఎదురుచూశారు. తొలుత యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. -
బడుగు వర్గాల జీవన ప్రమాణాలు పెంచారు..
సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని, అందుకే ఈ వర్గాలకు అన్ని పథకాలు, పదవుల్లో పెద్ద పీట వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ఒక వరమని అన్నారు. శనివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల సీఎం జగన్ పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచారని తెలిపారు. తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని, మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంతోపాటు ఓ మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చారని కొనియాడారు. టీడీపీ హయాంలో మైనార్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీల సత్తా చాటుదాం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల సామాజిక సాధికారతకు కృషి చేసి, ప్రజల్లో చైతన్యం తెచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్‌కు మద్దతిచ్చి బీసీల సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి కులానికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్ పదవులు కట్టబెట్టి గుర్తింపు తెచ్చారన్నారు. రాజ్యసభలో నలుగురు బీసీలకు సభ్యత్వం కల్పించారన్నారు. జగనన్న చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. చంద్రబాబు అండ్ కో అనేక కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీలందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులను మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘కులగణన’ సాహసోపేత నిర్ణయం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం సాహసోపేత నిర్ణయమన్నారు. కులగణన పూర్తయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రస్తుతం కల్పించిన ప్రాధాన్యం రెట్టింపు అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. బీసీలకు స్వర్ణయుగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగడానికి సీఎం వైఎస్ జగన్ అవిరళ కృషి చేస్తున్నారని శ్రీసత్యసాయి జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు.మంత్రి వర్గం, నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ప్రతి ఇంటికీ పెద్ద కుమారుడిలా పింఛన్, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలతో పాటు ఇంటి స్థలం ఉచితంగా ఇచ్చారని, ఇంటి నిర్మాణానికి కూడా తోడ్పడుతున్నారని వివరించారు. జగన్ పాలన బీసీలకు స్వర్ణ యుగమని అన్నారు. మరోసారి జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ ఉందన్నారు. -
బడుగులకు రాజ్యాధికారం సాకారమైంది
సాక్షి, నరసరావుపేట: భారత దేశ చరిత్రలో నినాదాలుగానే మిగిలిపోయిన సామాజిక సాధికారత, బడుగులకు రాజ్యాధికారాన్ని సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. ఇది బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అందించిన ఫలమని అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లా మాచర్లలోని పార్క్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ఎలా మేలు చేసిందో వివరించారు. 70 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంక్‌గా చూసిన సీఎంలను గతంలో చూశామని, సీఎం వైఎస్ జగన్ మాత్రమే ఈ వర్గాలకు సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలు కల్పించి వృద్ధిలోకి తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఒక్క మైనార్టీకి మంత్రిగా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తనను డిప్యూటీ సీఎంగా చేశారని, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఓ మైనార్టీ మహిళను మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా చేసిన ఘనత జగనన్నదేనని తెలిపారు. నాలుగున్నరేళ్లలో మైనార్టీలకు రూ.23,176 కోట్ల లబ్ధి కలిగించారని చెప్పారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎంకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసి జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేయాలన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, వెన్నెముక వంటి బ్యాక్‌బోన్ క్లాస్ అని సీఎం వైఎస్ జగన్ బీసీలను అక్కున చేర్చుకొని, అన్నింటా పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవులతో పాటు పూర్తి అధికారాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్, నామినేటెడ్ పదవుల్లో చరిత్రలో మరే సీఎం చేయని విధంగా అధిక శాతం పదవులు ఇచ్చారన్నారు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపడం విశేషమన్నారు. నందిగం సురేష్ వంటి పేదింటి వ్యక్తిని పార్లమెంట్‌కు పంపిన ఘనత జగనన్నదేనని అన్నారు. బీసీలకు జడ్జి పోస్టులు వద్దని లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పేదింటి పిల్లలను అంతర్జాతీయ స్థాయి ఇంగ్లిష్ మీడియం చదువులు చదివిస్తున్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అన్నారు. రాజధాని ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారికి గూడు కల్పించాలని జగనన్న కలలు కన్నారన్నారు. వీటన్నింటినీ ఓర్వలేని చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాటిని అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా ద్వితీయ శ్రేణి మనుషులుగా బతుకుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను నా వాళ్లు అంటూ ఆప్యాయంగా పిలిచి, వారి ఉన్నతికి పాటు పడుతున్న సీఎం వైఎస్ జగన్ అని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఎస్టీలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదన్నారు. జగన్ డిప్యూటీ సీఎం ఇవ్వడంతోపాటు, ట్రైబల్ కమిషన్ ఏర్పాటు చేశారని, ఎస్టీలకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చారన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా రాష్ట్రంలో ఏకంగా 3.26 లక్షల ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం గిరిజనులకు అందజేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కేంద్రంలోని ప్రభుత్వాలు కుల గణన చేస్తామని కాకమ్మ కథలు చెప్పాయని, సీఎం జగన్ దాన్ని ఆచరణలో పెడుతున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. సీఎం జగన్ పల్నాడుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, వరికపూడిసెలకు అనుమతులు సాధించారని, రూ.3 వేల కోట్లతో హైలు అభివృద్ధి చేయించారని, కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తన్నారని తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే పల్నాడు రూపురేఖలే మారుస్తామని చెప్పారు. వెల్లివిరిసిన సామాజిక చైతన్యం ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో సామాజిక చైతన్యం వెల్లివిరిసింది. సాయంత్రం 5 గంటలకు రెంటచింతల నుంచి వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకష్ణదేవరాయలు, నందిగం సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. యాత్రకు వేలాది ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మాచర్ల శివారు నుంచి పాదయాత్రగా పట్టణంలోని పార్క్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. మాచర్ల నేతలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం భారీ జన సందోహం మధ్య సభ ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, ఇతర వర్గాల పేదలకు చేస్తున్న మేలును నేతలు వివరిస్తున్నప్పుడు ప్రజలు పెద్దపెట్టున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ‘మా నమ్మకం నువ్వే జగన్.., జగన్ రావాలి– జగనే కావాలి’ ‘వై నాట్ 175 ’ అంటూ నినదించారు. నేడు సత్యసాయి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సామాజిక సాధికార యాత్ర సాక్షి, అమరావతి: గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ యాత్ర ఏడో రోజు శనివారం సత్యసాయి జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా గుంటూరు తూర్పు, విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గాల్లో జరుగుతుంది. -
బాబుకి అంజాద్ బాషా కౌంటర్...
-
బాబు బెయిల్ పై అంజాద్ బాషా కామెంట్స్..
-
బడుగుల ఆత్మగౌరవం సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: బడుగుల పట్ల నాడు చంద్రబాబు వివక్ష చూపగా, నేడు సీఎం జగన్ అదే బడుగుల ఆత్మగౌరవాన్ని పెంచారని డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్ బాషా చెప్పారు. బీసీలు తమ పేటెంట్ అని చెప్పుకునే చంద్రబాబు వారికి చేసింది శూన్యమని అన్నారు. వైఎస్సార్సీపీ చేపట్టిన సామా జిక సాధికార యాత్రలో భాగంగా శనివారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో జరగిన బహిరంగ సభ లో అంజాద్ బాషా ప్రసంగించారు. చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఎన్నికల్లో వాడుకొని, ఆ తర్వాత అవమానించిన వ్యక్తి అని ఆయన చెప్పారు. ఎస్సీలలో పుట్టాలని ఎవరనుకుంటారంటూ హేళన చేశారని, బీసీలను తోక కత్తిరిస్తానని హెచ్చరించిన ఘనత కూడా బాబుదేనన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు అన్ని రంగాల్లో, అన్ని పద వుల్లో అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని, దేశంలోనే సామాజిక విప్లవాన్ని తీసుకువచ్చిన ఏకైక సీఎం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లంతా ఆత్మగౌరవంతో బతకాలంటే జగన్‌ను మళ్లీ సీఎంని చేసుకోవాలన్నారు. బీసీల బలం, ధైర్యం వైఎస్ జగనే : మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వెనుకబడిన వర్గాల బలం, ధైర్యం సీఎం వైఎస్ జగనే అని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల పేటెంట్ హక్కు వైఎస్ జగనే అని తెలిపారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఎంతో మందిని ఆయన రాజకీయంగా ఉన్నత స్థితికి తెచ్చారన్నారు. 2019కి ముందు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు పదవులు ఉన్నాయి?, ఇప్పుడు ఎంతమందికి ఉన్నాయో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు అండగా ఉన్నంతవరకు వైఎస్ జగన్‌ను ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. జగనన్న సామాజిక న్యాయానికి రోల్ మోడల్ : ఎంపీ మస్తాన్‌రావు దేశంలో సామాజిక న్యాయానికి రోల్ మోడల్ సీఎం వైఎస్ జగన్ అని రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు అన్నారు. 8 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు బీసీలు ఉండటమనేది సీఎం జగన్‌తోనే సాధ్యమైందన్నారు. బీసీ గణన కోసం రాజ్యసభలో ప్రైవేటు బిల్లు వేయాలని తమకు సూచించి, అందుకోసం రాష్ట్రంలో ఒక కమిటీ వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రూ.లక్ష కోట్ల ప్రత్యేక బడ్జెట్ కోసం పార్లమెంటులో పోరాడాలని సూచించారన్నారు. సీఎం వైఎస్ జగన్ అండతోనే మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కోసం పార్లమెంటులో పోరాడామని చెప్పారు. కుట్రలు చేసే వారికి గుణపాఠం చెప్పాలి : ఎంపీ గురుమూర్తి పేదలకు మేలు జరగకుండా కుట్రలు, కుతంత్రాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు. పేదలైన దళిత, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం వైఎస్ జగన్ సంపన్నులుగా చేస్తున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. సామాజిక సాధికారతకు నిజమైన అర్థం చెప్పారన్నారు. చిన్న పిల్లలు తినే తిండి మొదలుకొని వారి చదువు, వేసుకునే దుస్తులు, పుస్తకాలు, ట్యాబ్‌ల వంటివన్నీ ముఖ్యమంత్రే వ్యక్తిగతంగా పరిశీలించడం గతంలో ఎన్నడూ లేదన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న స్వేచ్ఛ, గౌరవం మరే పార్టీ లో ఉండదని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇంటి వద్దకే పాలన అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ అన్నారు. లంచాలు లేకుండా సంక్షేమం అందిస్తున్నారని చెప్పారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ లకు 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన చరిత్ర కూడా వైఎస్ జగనన్నదేనన్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి చెప్పారు. మంచి చేసిన వైఎస్ జగన్‌కి అందరూ అండగా నిలవాలని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు మునుపెన్నడూ ఈ స్థాయిలో పదవులు దక్కలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మేయర్ సురేష్‌బాబు అన్నారు. జిల్లాలో 372 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లకు పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని చెప్పారు. ఈ సమావేశంలో సాధికార యాత్ర రాయలసీమ ఇన్చార్జి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక న్యాయం అనేది గతంలో మాటలకే పరిమితమైంది
-
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్‌కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్‌కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్‌ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్‌ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషా వార్నింగ్
-
రాయలసీమ ద్రోహి చంద్రబాబు