కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటైన మాంగళ్య షాపింగ్ మాల్‌ను సినీ తార సమంత ఆదివారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ తక్కువ కాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా నిల్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తమకు 11వ షోరూమ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని సంస్థ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ వివరించారు.
25000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా 1942లో ప్రారంభమైన కాసం గ్రూప్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ భాగమని, ప్రస్తుతం గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment