Mangalya
-
నల్గొండలో సమంత సందడి, చీరకట్టుతో కనికట్టు చేసిన సామ్ (ఫొటోలు)
-
కడపలో మాంగళ్య షాపింగ్ మాల్
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరం ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఏర్పాటైన మాంగళ్య షాపింగ్ మాల్‌ను సినీ తార సమంత ఆదివారం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో మాంగళ్య షాపింగ్ మాల్ తక్కువ కాలంలోనే నాణ్యమైన, మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా నిల్చిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ఇది తమకు 11వ షోరూమ్ అని, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని సంస్థ వ్యవస్థాపకులు పీఎన్ మూర్తి, చైర్మన్ కాసం నమఃశివాయ వివరించారు. 25000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా 1942లో ప్రారంభమైన కాసం గ్రూప్‌లో మాంగళ్య షాపింగ్ మాల్ భాగమని, ప్రస్తుతం గణనీయంగా కార్యకలాపాలు విస్తరించిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మేయర్ సురేష్ బాబు, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, డిప్యూటీ మేయర్లు ముంతాజ్‌బేగం, నిత్యానందరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎం. రామలక్ష్మణ్‌రెడ్డి హాజరయ్యారు. -
‘మాంగళ్య’ కారు విజేత పద్మజ
హన్మకొండ : బతుకమ్మ, దసరా పర్వదినాలను పురస్కరించుకొని హన్మకొండలోని మాంగళ్య షాపింగ్ మాల్లో వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నారు. ఈనెల 1 నుంచి 13 వరకు ఏడు లక్కీ డ్రాలను తీయనున్నారు. ఇందులోభాగంగా తొలి డ్రాను శనివారం తీశారు. ప్రతి రూ.500 కొనుగోలుపై ఒక ఉచిత గిఫ్ట్ కూపన్‌ను ఇస్తున్నారు. ఈనెల 1న కొన్న వస్త్రాలపై ఇచ్చిన గిఫ్ట్ కూపన్లలో నుంచి డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి ఆల్టో కారును వరంగల్‌కు చెందిన జి.పద్మజ(కూపన్ నంబర్ ఏ-837), రెండో బహుమతి కిలో వెండిని హన్మకొండకు చెందిన ప్రశాంత్, (కూపన్ నంబర్ ఈ-131) మూడో బహుమతి బైక్‌ను హన్మకొండకు చెందిన అమోఘ(కూపన్ నంబర్ ఏ-462) గెల్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వాహకులు పీఎన్.మూర్తి, కాసం మల్లికార్జున్, నమశ్శివాయ, కేదారి, శివ, నాని, వరుణ్, అరుణ్, సిబ్బంది సందీప్, అనిల్ పాల్గొన్నారు. -
సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటి
బెంగళూరు : సహనటి ఇంటిలో చోరీ చేసిన బుల్లితెర నటిని రాజరాజేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేశారు. మాంగల్య, రంగోలి తదితర కన్నడ సీరియల్స్‌లో నటించిన సుజాత బసవరాజ్ అనే బుల్లితెర నటిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే సుజాత, కవన ...కన్నడ బుల్లితెర నటులే కాకుండా ఇద్దరూ మంచి స్నేహితులు. గత ఏడాది ఏప్రిల్‌లో కవనకు శస్త్ర చికిత్స జరిగింది. ఆ సమయంలో కవన ఇంటిలో రూ.1.75 లక్షల విలువైన బంగారు నగలు చోరీ అయ్యాయి. దీంతో కవనకు సుజాతపై అనుమానం వచ్చింది. రాజరాజేశ్వరీ నగర పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో సుజాతను పోలీసులు విచారించినా ఫలితం లేకపోయింది. దాంతో ఆమెపై నిఘా వేశారు. తమకు లభించిన ఆధారాల మేరకు చివరకు సుజాతను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయటంతో బంగారు నగలు చోరీ చేసినట్లు ఆమె అంగీకరించింది. కాగా గతంలో కూడా సుజాతపై రెండు కేసులు నమోదు అయ్యాయని నిందితురాలిని బుధవారం కోర్టు ఎదుట హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.