‘మాంగళ్య’ కారు విజేత పద్మజ
‘మాంగళ్య’ కారు విజేత పద్మజ
Published Sun, Oct 2 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
హన్మకొండ : బతుకమ్మ, దసరా పర్వదినాలను పురస్కరించుకొని హన్మకొండలోని మాంగళ్య షాపింగ్ మాల్‌లో వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నారు. ఈనెల 1 నుంచి 13 వరకు ఏడు లక్కీ డ్రాలను తీయనున్నారు. ఇందులోభాగంగా తొలి డ్రాను శనివారం తీశారు. ప్రతి రూ.500 కొనుగోలుపై ఒక ఉచిత గిఫ్ట్ కూపన్‌ను ఇస్తున్నారు. ఈనెల 1న కొన్న వస్త్రాలపై ఇచ్చిన గిఫ్ట్ కూపన్లలో నుంచి డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి ఆల్టో కారును వరంగల్‌కు చెందిన జి.పద్మజ(కూపన్ నంబర్ ఏ-837), రెండో బహుమతి కిలో వెండిని హన్మకొండకు చెందిన ప్రశాంత్, (కూపన్ నంబర్ ఈ-131) మూడో బహుమతి బైక్‌ను హన్మకొండకు చెందిన అమోఘ(కూపన్ నంబర్ ఏ-462) గెల్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వాహకులు పీఎన్.మూర్తి, కాసం మల్లికార్జున్, నమశ్శివాయ, కేదారి, శివ, నాని, వరుణ్, అరుణ్, సిబ్బంది సందీప్, అనిల్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement