Batukamma
-
ఉజ్జీవన్ బ్యాంకు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మ..!
దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన ప్రకృతి పండుగకు నివాళులర్పిస్తూ పెద్ద ఇండోర్ బతుకమ్మను ఏర్పాటు చేసింది ఉజ్జీవన్ బ్యాంక్. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో వున్న గలేరియా మాల్లో ఈ అతిపెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసింది. సుమారు 14 అడుగులు మేర ఎత్తు వరకు అద్భుతమైన బతుకమ్మను ఏర్పాటు చేశారు. రంగురంగుల పూల ప్రదర్శనతో ఈ ప్రాంతం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సామాజికి స్ఫూర్తిని మా బ్యాంకు గౌరవిస్తుందని సదరు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ బతుకమ్మ వద్ద ఉజ్జీవన్ సెల్ఫీ స్టేషన్లతో సహా ఇంటరాక్టివ్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశామని, అలాగే బ్యాంక్ బ్యాంకింగ్ ఉత్పత్తులు అండ్ సేవలను అన్వేషించడానికి కస్టమర్లకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. (చదవండి: నవరాత్రులు..ఇవాళ లలితా త్రిపుర సుందరిగా అలంకారం..!) -
పూల పండుగ..మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగ మూడో రోజుకి చేరుకుంది. బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో అంటూ ప్రారంభమయ్యే ఈ పండుగ ఆటపాటల సందడితో ఆనందభరితంగా ఉంటుంది. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకునే ఈ బతుకమ్మ పండుగలో మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మగా ఆరాధిస్తారు. ఈరోజు మూడో రోజు కాబట్టి తెలంగాణ ఆడబిడ్డలంతా ముద్దపప్పు బతకమ్మను జరుపుకుంటారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ ఆటలు ఆడిన మహిళలు, అటుకుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకుంటారుబతుకమ్మ పండుగలో మూడవ రోజు ‘విదియ’ కాబట్టి ఈ రోజున‘ముద్దపప్పు బతుకమ్మ’గా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం పూలతో బతుకమ్మను చేసి, అందంగా అలంకరిస్తారు. నైవేద్యంగా..ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారుచేసి గౌరమ్మకి నివేదిస్తారు. ఆపై ప్రసాదాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కొందరు పుట్నాల పిండి, బియ్యప్పిండి, బెల్లం, ఎండు కొబ్బరి, నువ్వులు, పాలతో ‘చలివిడి’ ముద్దలు చేస్తారు. ఇంకొందరు గారెలు చేస్తారు.(చదవండి: Dussehera 2024 : బతుకమ్మ బిడ్డ, బొడ్డెమ్మ పండుగ గురించి తెలుసా?) -
బతుకమ్మ పండుగ విశిష్టత..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వులనడుమ పుప్పొడిని, పసుపుముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి. ఆరాధనలో పూలకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. తెలంగాణలోనైతే, ఆ పూలనే పూజించడం ఒక విలక్షణ సంస్కృతిగా కనిపిస్తోంది. ప్రకృతిలో భాగమైన పూలు స్త్రీల ముత్తయిదు తనానికి ప్రతీక కావడం గొప్ప విశేషం. స్త్రీల ప్రాతినిధ్యమే ప్రధానమైనప్పటికీ సమాజంలో సమిష్టితత్వానికి దోహదపడే పండుగ ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వమానవాళికి భిన్నత్వంలోని అందాన్ని అందించి ఐక్యంగా ఉండాలనే అవసరాన్ని చాటి చెప్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే సమాజానికి మేలు కూర్చే విషయాలెన్నో బతుకమ్మ కూర్పులో, ఆటలో, పాటలో ఆత్మీయత పంచుకోవడంలో కనబడతాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ 9 రోజులు జరుపుకునే వేడుకగా ప్రసిద్ధి పొందింది. మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆనాడు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాడు గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండివంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. తొలిపూజ బతుకమ్మకు కాబట్టి పల్లె ప్రజలు ఎంగిలిపూల బతుకమ్మని అంటారు, స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని మాంగల్య గౌరి అని భావిస్తారు. బతుకమ్మ కథనాలు ఎట్లా ఉన్నా ముత్తయిదుతనమనేదే అంతర్లీనంగా కనిపిస్తోంది. సాంప్రదాయంగా పçసుపు గౌరమ్మను చేస్తుంటారు. తంగేడు పూలు పసుపుతనానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ గౌరమ్మను చేయడంలో గొప్ప ఆచారం కనబడుతుంది. అర్ధనారీశ్వరునికి సంకేతంగా బతుకమ్మను నిలుపుకొంటారు. శివపార్వతులు ప్రకృతి– పురుషులు. నిజంగా గౌరమ్మ అనగానే పూలతో ఒక గోపురంలా పేర్చడం ఒకటే కాదు, ఆ గోపురం నడుమ ఒక నొక్కు (గుమ్మడి) ని పెట్టి ఒక పసుపు ముద్దను రెండు గోపురాలుగా రూపొందేటట్లు పూలను పేరుస్తారు. అంటే గౌరమ్మే అర్ధనారీశ్వర స్వరూపం అన్నమాట. ఇందులో ప్రత్యేకంగా గౌరీ ఆరాధన కనిపిస్తుంది. కొందరు గౌరమ్మను తమలపాకుల్లో పెడతారు, మరికొందరు చిక్కుడు ఆకుల్లో పెట్టి పూజ చేస్తుంటారు. ‘చిక్కుడు ఆకుల్లో ఉయ్యాలా... సద్దులు కట్టి ఉయ్యాలో... అని పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. అందుకే స్త్రీల మనోభావాలను అనుసరించే బతుకమ్మను పేర్చడం జరుగుతోంది. అందులో స్త్రీల కళాతృష్ణ ఎంత గొప్పదో విదితమవుతుంది.ఎన్ని పూలతో బతుకమ్మను పేర్చినా ప్రతి వరుసకు తంగేటిపూలు ఉండడాన్ని విస్మరించరు. తంగేడు ముతై ్తదుతనం ఇవ్వడమేగాదు, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుందని నమ్మకం. అందుకే, ‘శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ’ అని జానపదం పాడుకుంటారు. సద్దుల బతుకమ్మనాడు ఆడపడుచులకు వొడిబియ్యం పోసి సాగనంపినట్లు బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుంది. అలాగే గుమ్మడి పూలు, గునుగుపూలలో జలచరాల్లోని అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలున్నాయి. పుప్పొడి, పసుపులో గాలిలోని కాలుష్యాన్ని కడిగేసే గుణాలున్నాయి. అన్నింటికీ మించి కులమతాల కతీతంగా, పేద, గొప్ప భేదం లేకుండా బతుకమ్మ ఆటల్లో పాల్గొనడంలో సామాజిక ప్రయోజనముంది. బృహత్ శివలింగానికీ బతుకమ్మకూ సంబంధం? తెలంగాణ సంస్కృతిలో ప్రధాన భాగమైన బతుకమ్మ పండుగను పరిశీలిస్తే, ఆ సంస్కృతి విశిష్టత, చారిత్రకత విశదమౌతుంది. విశ్వవిఖ్యాతి చెందిన తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహా శివలింగం వేములవాడకు చెందిందనడానికి ఆధారాలున్నాయి. ఈ దేవాలయాన్ని నిర్మించిన చోళరాజైన రాజరాజు, కరీంనగర్‌లోని వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని అంటే మహా శివలింగాన్ని తంజావూరు తరలించి, బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠింపజేశాడు. తెలంగాణ ప్రజలు దీనికి బాధపడినా, పార్వతీ అమ్మవారిని ఊరడించే ప్రయత్నంలో పూలతో మేరుపర్వతంలా పేర్చి, దానిపై పసుపుతో గౌరీదేవిని రూపొందించి, దసరా సందర్భంలో ఆటపాటలతో తిరిగి రమ్మని ప్రార్థిస్తున్నారని చారిత్రక పరిశోధకుల అభిప్రాయం. -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ అంబరాన్నంటాయి. స్థానిక సంబవాంగ్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 4వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజన్య, పద్మజ నాయుడు వ్యవహరించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా నిర్మించిన సింగపూర్ బతుకమ్మ సింగారాల బతుకమ్మ నిలిచింది. ఈ సందర్బంగా అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ,కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..బతుకమ్మ సంబురాలను విజయవంతం చేడయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. -
బతుకమ్మ, బోనాలతో వీఆర్ఏల నిరసన
సాక్షి, నెట్వర్క్: ప్రభుత్వం ప్రకటించిన విధంగా తమకు పేస్కేళ్లు, పదోన్నతులు, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్లతో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె కొత్తరూపం దాల్చింది. గురువారం తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాల ప్రదర్శనలతో నిరసనలు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో 25 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా కొత్త తరహా నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజయ్య, వంగూరు రాములు, దాదేమియా, వెంకటేష్ యాదవ్, శిరీషారెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి న్యాయమైన సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
నేడు, రేపు సద్దుల బతుకమ్మ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ఉత్సాహంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు ముగింపుదశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఏడు రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ వేడుకలను ముగించుకున్న తెలంగాణ ఆడపడుచులు వెన్నముద్దల బతుకమ్మ సంబరానికి సిద్దమవుతున్నారు. అయితే ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో సద్దుల బతుకమ్మను నిర్వహించుకుంటున్నారు. బతుకమ్మ ముగింపు ఉత్సవాల ముగింపు వేడుక అయిన సద్దుల బతుకమ్మ పండుగ కొన్ని ప్రాంతాలు నేడే నిర్వహిస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో రేపు (గురువారం) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో స్థానిక సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకునేందుకు ఆయా ప్రాంతాల వాసులు రడీ అవుతున్నారు. దుర్గాష్టమినాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడాల్సిందే అని తీర్మానించుకున్న వారు గురువారం సద్దుల బతుకమ్మను నిర్వహించుకోనున్నారు. ఇక హైదరాబాద్‌లో దుర్గాష్టమినాడే (నేడే) బతుకమ్మ ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఎంఎల్సీ కవిత కూడా ఈ మేరకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెపుతూ ట్వీట్ చేశారు. ఇక బతుకమ్మ పండుగలో 8వ రోజును 'వెన్నముద్దల బతుకమ్మ'గా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు, మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆట, పాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయనంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.#బతుకమ్మ #Bathukamma pic.twitter.com/WxYc9Oh36W — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 13, 2021 -
తీరొక్క పూల పండుగ.. బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్: ఆనందోత్సాహాల నడుమ రంగు రంగుల పూలతో మహిళలంతా కలిపి జరుపుకునే పండుగ బతుకమ్మ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లోని మహిళా ఉద్యోగులకు ఆదివారం ఆమె చీరెలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. బతుకమ్మ జరుపుకునేందుకు ప్రకృతి ప్రసాదించిన రకరకాల పూలను వాడుతారని చెప్పారు. నిమజ్జనం తర్వాత ఈ పూలలో ఉన్న ఔషధ గుణాల కారణంగా చెరువుల్లో, నదుల్లోని నీరు స్వచ్ఛంగా మారుతుందన్నారు. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో బతుకమ్మ జరుపుకోవాలని సూచించారు. బతుకమ్మ పండుగ సమయంలో గత రెండేళ్లు రాజ్‌భవన్‌లో మహిళా ఉద్యోగులకు గవర్నర్ చీరెలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరెల పంపిణీ, డీజైన్లను ప్రారంభించిన కేటీఆర్
-
ఈ ఏడాది జాగృతి బతుకమ్మ లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించడం లేదని సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటేలా.. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఆడబిడ్డలను కోరారు. కవిత ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తెలంగాణ జాగృతి నిర్వహించే బతుకమ్మను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు చేసిన దిగజారుడు ఆరోపణలు నన్ను బాధించాయి. తెలం గాణ జాగృతి ఉమ్మడి ఏపీలోగానీ, తెలంగాణ ఏర్పడ్డ తర్వాతగానీ ప్రభుత్వం నుంచి ఏ రకంగానూ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఈసారి ఎన్నికల సందర్భం అయినందున బతుకమ్మను రాజకీయాలకు ముడిపెట్టి నిరాధార ఆరోపణలు చేసేందుకు కొందరు కాచుకుని ఉన్నారని ప్రజలకు తెలుసు. అందుకే ఈ ఏడాది జాగృతి నుంచి బతుకమ్మ నిర్వహణ ఉండ దు. దిగజారుతున్న రాజకీయాలకు బతుకమ్మ ఒక అంశం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ వాదులకు, తెలంగాణ ఆడబిడ్డలకు, జాగృతి అభిమానులకు సవినయంగా మనవి చేస్తున్నాను. సహృదయంతో అర్థం చేసుకుని, సహకరించగలరని కోరుతున్నాను. ఇది ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కనుక జాగృతి విదేశీ శాఖలకు వర్తించదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని సమున్నతంగా నిలిపే క్రమంలో తెలంగాణ జాగృతి ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. కవితను కలిసిన ఎర్రోళ్ల.. జహీరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం ఆశిస్తున్న ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రస్తుత ఎన్నికలకు టీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రచార ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కవితను శుక్రవారం కలిసినట్లు తెలిసింది. టీఆర్ఎస్ అధిష్టానం ఎర్రోళ్లను జహీరాబాద్ అభ్యర్థిగా దాదాపుగా ఖరారు చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సిన 14 స్థానాలకు ఈ నెల 11న అభ్యర్థులను ప్రకటించనుందని తెలిసింది. జగిత్యాలలో గులాబీ జెండా: కవిత వచ్చే ఎన్నికల్లో జగిత్యాల జిల్లాపై గులాబీ జెండా ఎగరవేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో భాగస్వాములు అయ్యేందుకు టీఆర్ఎస్లో చేరిన వారితో సమన్వయం చేసుకోవాలని జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు సూచించారు. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలు శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కవిత వీరికి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. జగిత్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, మాజీ కౌన్సిలర్ మానాల కిషన్‌తోపాటు బీసీ, ఎంబీసీ నేతలు చదువుల కోటేశ్, మర్రిపెల్లి నారాయణ తదితరులు టీఆర్ఎస్లో చేరిన వారిలో ఉన్నారు. -
33 అడుగుల బతుకమ్మ
కూసుమంచి(పాలేరు): సద్దుల బతుకమ్మ సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో 33 అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆయన సతీమణి, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అతి పెద్ద బతుకమ్మను పేర్చారు. గతేడాది కూడా ఈ దంపతులు 15 అడుగుల బతుకమ్మను పేర్చి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కాగా, ఈ సంవత్సరం పేర్చిన బతుకమ్మ రాష్ట్రంలో పెద్దది కావచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. 7.25 క్వింటాళ్ల పూలు.. 72 మంది మనుషులు.. ఈ భారీ బతుకమ్మను పేర్చేందుకు గోపాలరావు దంపతులు 7.25 క్వింటాళ్ల పూల (గులాబీ, బంతి, టేకు, తంగేడు, గునుగు)తో పాటు మరో 10 కిలోల డెకరేషన్ పూలను వినియోగించారు. భారీ ట్రాక్టర్ ట్రాలీపై ఈ బతుకమ్మను 72 మంది 12 గంటలు శ్రమించి పేర్చారు. బతుకమ్మ కింది భాగం ఆరు అడుగుల వెడల్పుతో ప్రారంభం కాగా, చివరన అడుగున్నరతో ముగిసింది. ఈ బతుకమ్మ చివర దుర్గాదేవి, ఆంజనేయస్వామి ప్రతిమలను ఏర్పాటు చేశారు. తాము బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటామని, తెలంగాణలో బతుకమ్మ విశిష్టతను చాటిచెపుతూ తమ గ్రామానికి పేరు తీసుకొచ్చేలా ఈ భారీ బతుకమ్మను పేర్చామని గోపాలరావు దంపతులు ‘సాక్షి’కి తెలిపారు. -
బతుకమ్మను ‘కార్పొరేట్’గా మార్చారు..
హసన్‌పర్తి/వెంకటాపురం(కె): బతుకమ్మ ను కార్పొరేట్‌గా మార్చారని తెలంగాణ యునైటెడ్ ఫోరం (టఫ్) రాష్ట్ర అధ్యక్షు రాలు విమలక్క అన్నారు. వరంగల్ 57వ డివిజన్ ముచ్చర్లలో శుక్రవారం జరిగిన బతుకమ్మ సంబరా ల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. జయశంకర్ భూపాల పల్లి జిల్లా వెంకటాపురం (కె)లో విలే కరులతో మాట్లాడారు. ఊరూవాడా ఏకమై సం తోషంగా బతుకమ్మలు ఆడాలే తప్ప... గిన్నిస్‌బుక్ కోసం బతుకమ్మలు ఆడడ మేమిటని ప్రశ్నించారు. అభివృద్ధి పేరు చెబుతూ వందల కోట్లలను టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీలకు అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని విమలక్క డిమాండ్ చేశారు. -
రైతుల ఆగ్రహానికి గురవుతారు
చేర్యాల (సిద్దిపేట): అఖిలపక్షం నేతలు రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నా రు. గురువారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుల మేలు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ సమ న్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ, జేఏసీ చైర్మన్ కోదండరాం అఖిలపక్షం పేరుతో సత్యాగ్రహం చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు సమితుల్లో గ్రామంలోని ప్రతి రైతుకు భాగస్వామ్యం ఉంటుందని, ముఖ్యంగా పంటకు మద్దతు ధర నిర్ణయిం చడం, భూపరమైన సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న ఎకరాకు రూ.8 వేల పెట్టుబడి తదితర ఆంశాలపై సమన్వయ సమి తుల నిర్ణయం ఉంటుందని మంత్రి వివరిం చారు. గత పాలకులు ఎవరూ చేయని విధం గా రైతుల కోసం రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, 24 గంటల ఉచిత వ్యవసాయ విద్యుత్, మిషన్ కాకతీయ వంటి ఎన్నో రైతు సంక్షేమ కార్య క్రమాలు తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్, టీడీపీ, కోదండరాంలు పిల్లికి ఎలుక మీద ప్రేమలాగా రైతులపై కపట ప్రేమ ఉన్నట్లు నటించడం సరికాదన్నారు. ఏమి హాయిలే హలా.. ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): సద్దుల బతుకమ్మ పండుల వేళ మంత్రి హరీశ్‌రావు కుటుంబం గురువారం సిద్దిపేటలో సందడి చేసింది. హరీశ్‌రావు, ఆయన భార్య శ్రీనిత ఉదయం నుంచి పట్టణంలో తిరుగుతూ బతుకమ్మ వేడులను తిలకించారు. సాయంత్రం కోమటిచెరువు వద్ద జరిగిన నిమజ్జనోత్సవా నికి హాజరయ్యారు. మంత్రి దంపతులు బోటులో చెరువులో విహరించారు. -
పండగవేళ 28th September 2017
-
బతుకమ్మ వస్తోంది.. దారివ్వండి!
సాక్షి, హైదరాబాద్: అప్పర్ ట్యాంక్‌బండ్, ఎల్బీ స్టేడియంల్లో గురువారం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. సం దర్శకులు, ఆహుతుల కోసం ప్రత్యేక పార్కిం గ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ♦ సికింద్రాబాద్ వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను కర్బాలా మైదాన్, బైబిల్ హౌస్ నుంచి కవాడిగూడ, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. ♦ కట్టమైసమ్మ, కవాడిగూడ వైపు నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపు వచ్చే వాహనాలను డీబీఆర్ మిల్స్ నుంచి కవాడిగూడ వైపు పంపిస్తారు. ♦ ఇక్బాల్ మీనార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సచివాలయం పాత గేటు నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ వైపు మళ్లిస్తారు. ♦ ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం చౌరస్తా వైపు ట్రాఫిక్ అనుమతించరు. వీటిని నాంపల్లి/ రవీంద్ర భారతి వైపు పంపిస్తారు. ♦ ఎస్బీఐ జంక్షన్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం చౌరస్తా, బషీర్‌బాగ్ వైపు అనుమతించరు. వీటిని గన్‌ఫౌండ్రీ, చాపెల్‌రోడ్ మీదుగా పంపిస్తారు. ♦ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్‌నగర్ ‘వై’జంక్షన్ వైపు మళ్లిస్తారు. ♦ కింగ్‌కోఠి నుంచి భారతీయ విద్యాభవన్స్ మీదుగా బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను కింగ్‌కోఠి చౌరస్తా నుంచి తాజ్‌మహల్ హోటల్ వైపు పంపిస్తారు. ♦ ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు మళ్లిస్తారు. ♦ హిల్‌ఫోర్ట్ రోడ్ నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నాంపల్లి వైపు పంపిస్తారు. ♦ హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు మళ్లిస్తారు. ♦ పంజగుట్ట, రాజ్‌భవన్ వైపుల నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోకి వచ్చే వాహనాలను ఇందిరాగాంధీ సర్కిల్ వరకే అనుమతిస్తారు నల్లగుట్ట జంక్షన్–బుద్ధభవన్ మధ్య వాహనాలను అనుమతించరు. పార్కింగ్ ప్రాంతాలివే... ♦ మెహిదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు ఆయకార్ భవన్ వద్ద దిగాలి. ఈ వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలో పార్క్ చేసుకోవాలి. ♦ ముషీరాబాద్, అంబర్‌పేట, బేగంపేట వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారు బీజేఆర్ విగ్రహం చౌరస్తా వద్ద దిగాలి. ఈ వాహనా లకూ ఎన్టీఆర్ స్టేడియమే పార్కింగ్. ♦ జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, గోషా మహల్ వైపుల నుంచి బస్సుల్లో వచ్చే వారి ఏఆర్ పెట్రోల్‌పంప్ వద్ద దిగాలి. వాహనాలను ఎన్టీఆర్ స్టేడియంలోనే పార్కింగ్ చేసుకోవాలి. ♦ వీఐపీలు, ప్రత్యేక ఆహ్వానితులు బీజేఆర్ విగ్రహం వద్ద వాహనాలు దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్, మహబూ బియా కాలేజ్‌ల్లో పార్క్ చేసుకోవాలి. ♦ మంత్రులు స్టేడియం డి గేట్ వద్ద వాహనం దిగాలి. వాహనాలను ఆలియా కాలేజ్‌లో పార్క్ చేసుకోవాలి. ♦ మీడియా ప్రతినిధులు సైతం డి గేట్ వద్దే వాహనం దిగాలి. వాహనాలను సచి వాలయంలో పార్కింగ్ చేసుకోవాలి. -
బతుకమ్మ నేపథ్యంతో తెలంగాణ శకటం
నమూనాపై రక్షణశాఖ కమిటీ సంతృప్తి సాక్షి, న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ఢిల్లీలో ప్రదర్శించే శకటాలకు సంబంధించి రక్షణ శాఖ ఉత్సవ విభాగ కమిటీ శుక్రవారం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ శకటం నమూనాను పరిశీలించింది. డీఆర్డీఓ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీ అధికారులు శకటం నమూనాను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారని సమావేశానికి హాజరైన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.భాస్కర్ తెలిపారు. బతుకమ్మ ఇతివృత్తంగా రూపొందించిన త్రీడీ శకటం నమూనాను సంగీతంతో పాటు కమిటీ ముందుంచినట్లు ఆయన చెప్పారు. కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించిన కమిటీ, మొత్తం మీద సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. శకటం నమూనాను రూపొందించిన ప్రముఖ కళాకారుడు రమణారెడ్డి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శకటాల ఎంపికలో కీలకమైన కమిటీ ఆరో సమావేశం వచ్చే నెల ఆరున జరుగుతుందని భాస్కర్ చెప్పారు. -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
అమెరికాలో ఆడిండ్లు ఉయ్యాలో...
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవడం లేదు. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ నగరాలకు చెందిన కొంతమంది వృత్తి, చదువురీత్యా అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం పియోరీయోటౌన్లో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. అయితే సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆయా జిల్లాలకు చెందిన తెలంగాణ మహిళలు శనివారం సంబురాలు జరుపుకున్నారు. విదేశాల్లోబతుకమ్మను ఆడి తెలంగాణ సంస్కృతిని అక్కడి ప్రజలకు తెలియజేశారు. – దేవరుప్పుల.. -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
-
గంగమ్మ ఒడికి గౌర మ్మా..
సద్దుల బతుకమ్మ నేడు పలుప్రాంతాల్లో సంబరాలు వర్షం ఎఫెక్ట్ ‘నిద్రపో గౌరమ్మ... నిద్రపోవమ్మా... నిద్రకు నూరేండ్లు.... నీకు వెయ్యేండ్లు... నినుగన్న తల్లికి నిండు నూరేళ్లు... వెళ్లి రావమ్మా... మళ్లీ రావమ్మా’ అంటూ బతుకమ్మ అంటూ మహిళలు వీడ్కోలు పలికారు. కరీంనగర్: జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలు, ఆనందోత్సాహాలతో పూజించి గౌరమ్మను గంగమ్మ ఒడికి సాగనంపారు. అయితే ఈసారి బతుకమ్మ పండుగపై పండితులు ఒక స్పష్టమైన తేదీని ప్రకటించకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆదివారం కూడా జిల్లాలో పలుచోట్ల సంబరాలు జరుగనున్నాయి. మరోవైపు బతుకమ్మ పండుగకు వర్షం అడ్డంకిగా మారింది. రాత్రివరకు వాన కురియడంతో మహిళలు ఆడేందుకు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని 41, 42వ డివిజన్లలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు. 41వ డివిజన్ కార్పొరేటర్ చల్లా స్వరూపరాణì పేర్చిన 10 అడుగుల బతుకమ్మ ఆకట్టుకుంది. హుస్నాబాద్‌లో మహిళలు వానలోనే బతుకమ్మ ఆడారు. బతుకమ్మలపై విద్యుత్ స్తంభంపడడంతో పరుగులు పెట్టారు. కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. మూడుగంటలపాటు వర్షం పడడంతో వానలోనే బతుకమ్మ ఆడారు. వర్షం ఎఫెక్ట్‌తో కొందరు బతుకమ్మ ఆట ఆడకుండానే నిమజ్జనం చేశారు. చొప్పదండిలో సద్దుల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక కుడి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గోదావరిఖనిలోని కోదండరామాలయం, కాశీవిశ్వేశ్వరాలయం, రాజరాజేశ్వరాలయం, పవర్‌హౌస్‌లోని దుర్గామాత ఆలయాల వద్ద బతుకమ్మను భక్తిశ్రద్ధలతో ఆడి పాటలు పాడారు. కోలాటాలతో సందడి చేశారు. రాజీవ్‌నగర్‌లో దేశంకోసం అమరులైన వీరజవాన్లకు బతుకమ్మ ఆటలతోపాటు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. అనంతరం గోదావరిలో నిమజ్జనం చేశారు. ౖయెటింక్లయిన్‌కాలనీలో వర్షం కురుస్తున్నా మహిళలు బతుకమ్మ ఆడేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో మహిళలు, యువతులు, చిన్నారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ సద్దుల ప్రాంగణానికి చేరుకుని ఆడారు. అనంతరం స్థానిక వాగులో నిమజ్జనం చేశారు. మంత్రి ఈటల రాజేందర్ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. జగిత్యాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో జెడ్పీచైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జాయింట్ కలెక్టర్ శ్రీదేవసేన, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక దంపతులు పాల్గొన్నారు. కరీంనగర్ మండలం సీతారాంపూర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మంథనిలో గౌరమ్మను కొలిచి బతుకమ్మ ఆటాపాటలతో అలరించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బతుకమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ప్రారంభించారు. మహిళలు చెరువులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. వేములవాడలో మూడురోజుల క్రితమే సద్దుల వేడుకలు నిర్వహించగా.. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం జరుపుకున్నారు. సిరిసిల్ల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, జగిత్యాల ప్రాంతాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. -
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
రాయికల్ : అబుదాబిలోని ఇండియన్ సోషల్ సెంటర్లో శనివారం బతుకమ్మసంబరాలు అంబరాన్నంటాయి. అబుదాబీ, షార్జా, దుబాయ్, తదితర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది మహిళలు బతుకమ్మలను తీసుకువచ్చి గౌరీపూజ నిర్వహించారు. అనంతరం బతుకమ్మ పాటలు, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. నిర్వాహకులు ఉత్తమ బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పావని, అర్చన, రోజా, పద్మజ, లక్ష్మీ, లత, నాయకులు రాజ శ్రీనివాస్, పృథ్వీ, వంశీ, గంగారెడ్డి, గోపాల్ పాల్గొన్నారు. -
బతుకమ్మ సంబరాల్లో ఎంపీ మల్లారెడ్డి ఫుల్ జోష్
-
స్వరాష్ట్రంలో సంప్రదాయాలకు బ్రహ్మరథం
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పండుగలపై చిన్నచూపు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి హన్మకొండ : సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగను పాలకులు చిన్నచూపు చూశారని శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. స్వరాష్ట్రం తెలంగాణలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి సీఎం కె.చంద్రశేఖర్‌రావు మహిళలకు కానుకగా ఇచ్చారన్నారు. వేడుకల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయించి మహిళలు సంతోషంగా పండుగ జరుపుకునేందుకు ఏర్పాటు చేస్తున్నారన్నారు. గురువారం హన్మకొండలోని వడ్డేపల్లి, కలెక్టరేట్, హనుమాన్ నగర్లో స్థానిక మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో కలిసి డిప్యూ టీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి బతుకమ్మ ఆడారు. అంతకుముందు వడ్డేపల్లిలోని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ స్వగృహం వద్ద వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మంత్రి ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సతీమణి దాస్యం రేవతితో కలిసి రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చారు. ఈసందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడు తూ పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, కార్పొరేటర్లు మిడిదొడ్డి స్వప్న, నల్ల స్వరూపారాణి, కేశబోయిన అరుణ, మాధవీరెడ్డి, సోబియా సబాహత్, చింతల యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు ఎల్లావుల లలితా యాదవ్, కొమురవెల్లి శ్రీనివాస్, శ్రీధర్, కె.లలిత, ఎడవెల్లి విజయ, పద్మ, తదితరులు పాల్గొన్నారు. -
నే పాడితే..
ఆడియో సీడీలదే జోరాయే ! అప్పుడు పాడేవారికి క్రేజీ ఇప్పుడు సీడీలపై మోజు కరీంనగర్ కల్చరల్ : అక్కా జెల్లెండ్లను ఉయ్యాలో ఒక్కూరి కిచ్చిరి ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బొగ్గు బాయిల బతుకమ్మ ఉయ్యాలో వదినే సీతమ్మ ఉయ్యాలో.. చీర ఇయ్యవమ్మ ఉయ్యాలో రామ రామ రామ... ఉయ్యాలో.. రామనే సీరామ.. ఉయ్యాలో అయ్యయ్యో ఓ రామ.. ఉయ్యాలో అయ్యనే సీరామ...ఉయ్యాలో అని పాడుకుంటూ మహిళలంతా సామూహికంగా బతుకమ్మ ఆడుతుంతే ఆహూతుల మదులు ఆనందపరవశంలో తేలియాడుతుంటాయి. బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడడం పల్లెల్లోని నిష్కల్మష వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది. బతుకమ్మ సంబరాలలో పాట వచ్చిన ఊరు పెద్దమ్మదే పెత్తనం. ఆమె పాట పాడుతుంటే మిగతా వారు కోరస్ ఇస్తూ బతుకమ్మ ఆడేవారు. అయితే ఇదంతా గతం. నేడు ఆ పాటలు పాడే పెద్దమ్మలు కనిపించడం లేదు. వారి స్థానంలోకి ఆడియో సీడీలు వచ్చాయి. బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి లయబద్ధంగా చప్పట్లు కొడుతుంటే స్పీకర్లలో పాటలు వినిపిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ నేపథ్యంలో అప్పటి పెద్దమ్మల మనసులోని మాటలు తెలుసుకుందాం... నా పాట లేనిదే ఆడేవారు కాదు మాది గంగాధర. మాది సంప్రదాయ బ్రహ్మణ కుటుంబం. మేము ఆరుగురం అక్కచెల్లెల్లం. నేనే పెద్దదాన్ని. ఇంటి పక్కనే గుడి, ఆ పక్కనే వాగు ఉంది. బతుకమ్మ పండుగ మొదలు చివరి రోజు వరకు గుడి వద్దనే ఆడుకునేవాళ్లం. ప్రతీరోజు నేనే పాట పాడేదాన్ని. చిన్నప్పటి నుంచి పూజల్లో మంగళహారతుల పాటలు పాడడంతో సహజంగా నా గొంతు బాగుండేది. దీంతో అందరూ నన్నే పాట పాడాలని గోల చేసేవారు. ఇప్పుడు పాటలు పాడే వారు కరువయ్యారు. ఎక్కడ విన్న మైక్‌ల పాటలే వినిపిస్తున్నాయి. – కలకుంట్ల గంగానాయకి ఆ పాటలు ఎక్కడున్నాయి స్త్రీలను గౌరవించి అభిమానించాలని సూచించే పండుగ బతుకమ్మ. చిన్ననాడు అందరం కలిసి ఆడుకునేవాళ్లం. చుట్టాలు, అక్కాచెల్లెల్లు అందరం ఒకే దగ్గర ఉండేవాళ్లం. మా తల్లి గారి ఇల్లు మానకొండూర్. మేము ఆరుగురం అక్క చెల్లెళ్లం, ముగ్గురు అన్నలు. నేనే పెద్దదాన్ని. ఊర్లో నేనే పాట పాడేదాన్ని. అందరు నా పాట అంటే ఇష్టపడేవాళ్లు. పాట పాడందే విడిచిపెట్టేవాళ్లు కాదు. ఇప్పుడు పాడేవాళ్లు కరువయ్యారు. ఆడేవాళ్లు తక్కువైండ్రు. ముస్తాబైనంత సేపు కూడా ఆడుతలేరు. అప్పటి సంబరాలు లేవు. – తుమ్ రామమ్మ ఇప్పటికీ పాడుతా మా అమ్మగారి ఊరు పర్లపల్లి. పెద్ద కుటుంబం. ఐదుగురం అక్కాచెల్లెళ్లం, ముగ్గురు అన్నలు. అందరం కలిసి పొలాలు, గుట్టలు పట్టుకుని పూల కోసం తిరిగేటోళ్లం. బతుకమ్మ పండుగొస్తే నా పాటనే వినిపించేది. ఇప్పటికీ బతుకమ్మ పాట పడుతాను. అప్పటి పాత పాటలు ఇప్పటి వారికి నచ్చవు. క్యాసెట్లు వేస్తుండ్రు. తీరొక్క పూలతో బతుకును దేవతగా చేసి కొలిచే పండుగా బతుకమ్మ. అప్పటిలా అందరం ఒక్క చోట కలుసుడే లేదు. – చిట్టుమల్ల స్వర్ణలత, గృహిణి నా గొంతు బాగుంటుంది బతుకమ్మ మహిళలకు సంబంధించిన పెద్ద పండుగ. పల్లెల్లో చాలా ఘనంగా చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ. అందరిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. నాటి పల్లెపాటలు ఇప్పుడు కరువైనయి. చిన్నప్పడు నేను పాడేదాన్ని. ఇప్పుడు పాడుదామన్న పట్టించుకునే వారు లేరు. మైక్‌లు పెట్టి సీడీలు వేస్తుండ్రు. – సౌగాని రాజేశ్వరి, గృహిణి వారం రోజులు సందడి వారం రోజులు వాడ..వాడంతా పోటీపడి బతుకమ్మలు పేర్చేవాళ్లం. ముగ్గురు అక్కలు, ఒక తమ్మడు. అందరం కలిసి బతుకమ్మ పూలు తెచ్చేవాళ్లం. బతుకమ్మ పాటలు నేనే ఎక్కువగా పాడేదాన్ని. అందరం కలిసి ఆడేవాళ్లం. ఇప్పుడు ఎవరు పాడడం లేదు. కనీసం ఆ పాటలు కూడా వచ్చిన వాళు లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత పండుగ ప్రాధాన్యత పెరిగినా.. అంతటా సీడీల పాటలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డాక్టర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ఆ సరదాలు గుర్తుచేసుకోవడంతోనే పండుగ గడిచిపోతుంది. – డాక్టర్ ఎల్.శేష శైలజ -
బతుకమ్మ ఆడి..దుర్గమ్మను కొలిచి
-
సద్దుల బతుకమ్మపై సర్వత్రా సందేహాలు
-
ఈరీలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు
-
‘మాంగళ్య’ కారు విజేత పద్మజ
హన్మకొండ : బతుకమ్మ, దసరా పర్వదినాలను పురస్కరించుకొని హన్మకొండలోని మాంగళ్య షాపింగ్ మాల్లో వస్త్రాల కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను వినియోగదారులకు అందించనున్నారు. ఈనెల 1 నుంచి 13 వరకు ఏడు లక్కీ డ్రాలను తీయనున్నారు. ఇందులోభాగంగా తొలి డ్రాను శనివారం తీశారు. ప్రతి రూ.500 కొనుగోలుపై ఒక ఉచిత గిఫ్ట్ కూపన్‌ను ఇస్తున్నారు. ఈనెల 1న కొన్న వస్త్రాలపై ఇచ్చిన గిఫ్ట్ కూపన్లలో నుంచి డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతి ఆల్టో కారును వరంగల్‌కు చెందిన జి.పద్మజ(కూపన్ నంబర్ ఏ-837), రెండో బహుమతి కిలో వెండిని హన్మకొండకు చెందిన ప్రశాంత్, (కూపన్ నంబర్ ఈ-131) మూడో బహుమతి బైక్‌ను హన్మకొండకు చెందిన అమోఘ(కూపన్ నంబర్ ఏ-462) గెల్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, మాంగళ్య షాపింగ్ మాల్ నిర్వాహకులు పీఎన్.మూర్తి, కాసం మల్లికార్జున్, నమశ్శివాయ, కేదారి, శివ, నాని, వరుణ్, అరుణ్, సిబ్బంది సందీప్, అనిల్ పాల్గొన్నారు. -
8న బతుకమ్మ మహా ప్రదర్శన
హన్మకొండఅర్బ¯ŒS : బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో ఈనెల 8వ తేదీన బతుకమ్మ మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు కలెకక్టర్ వాకాటి కరుణ అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ నిర్వహణలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. నగరంలో ఎంపిక చేసిన 19 కేంద్రాల్లో మహిళలు బతుకమ్మ ఆడుకుంటారన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బతుకమ్మ సంబురాల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బతుకమ్మ ఆడుకునే స్థలాలను చదును చేయడంతోపాటు చెట్లు, ముళ్ల పొదలను తొలగించినట్లు చెప్పారు. జేసీ ప్రశాంత్జీవ¯ŒSపాటిల్, డీఆర్వో శోభ, డీడీ జగ¯ŒS, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘పూల’ సందడి
మార్కెట్ రంగులమయం కుప్పలుగా బతుకమ్మపూలు తంగెడు, గునక పూలకు డిమాండ్ కరీంనగర్ బిజినెస్ : లె లంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..బంగారు బతుకును ఇవ్వాలని కోరుతూ చేసేది బతుకమ్మ.. బతుకమ్మ ఆరంభంతో మార్కెట్ అంతా రంగులమయమైంది. పూలవ్యాపారులతో సందడిగా మారింది. గ్రామాల్లో రంగురంగుల పూలు సేకరించి నగరంలోని మార్కెట్లో చాలా మంది విక్రయిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు మార్కెట్ పూలతో సందడిగా మారనుంది. మార్కెట్ రంగులమయం బతుకమ్మ పండుగ మెుదలుకావడంతో మార్కెట్ మొత్తం రంగు రంగుల పూలతో నిండుగా కనిపిస్తుంది. తంగెడు, గునుకపూలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామర, పట్టుకుచ్చుల పూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బతుకమ్మ పేర్చేందకు కావాల్సిన గుమ్మడి ఆకులు, గౌరమ్మను చే సేందకు గుమ్మడి పూలు అందుబాటులో ఉన్నాయి. పల్లెల నుంచి.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు నగరానికి వచ్చి మార్కెట్లో పూలు విక్రయిస్తున్నారు. అల్గునూర్, శ్రీరాములపల్లి, సైదాపూర్, చల్లూరు, కోహెడ, మానకొండూర్, కేశవపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామడుగు, గంగాధర మండలాల్లోని పలు గ్రామాలు, శనిగరం, కొత్తపల్లి నుంచి సైతం వ్యాపారులు వస్తున్నారు. గుట్టలు, చెలక ప్రాంతాల్లో సేకరించిన పూలను నగరానికి తరలించి అమ్ముకుంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొదటి, చివరి రోజు గిరాకీ బతుకమ్మ ప్రారంభం నుంచి తొలి రోజు, చివరి రోజు చాలా గిరాకీ ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మధ్యరోజుల్లో కొంచెం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. గిరాకీ ఉంటది బతుకమ్మ పండుగంటే అందరికి సంబుర మే. పొద్దుగాలనే పూలు కొసుకొని అమ్ముకుందామని ఇక్కడికి వచ్చినా. గిరాకీ బాగానే ఉంటది. తంగెడుపూలు, గునుక పూలు ఎక్కువగా అమ్ముడుపోతయి. మా ఊరు నుంచి బాగానే మంది వచ్చిండ్రు. యాడాదికోసారచ్చే పండుగ కాబట్టి పొద్దగాలటి నుంచి∙అందరు వచ్చి పూలు కొనుక్కపోతుండ్రు. మేం కూడా ఏటా వచ్చి పూలమ్ముకుంటాం. – రాజవ్వ, అల్గునూర్ రెండు రోజులు గిరాకీ బతుకమ్మ మొదలైన రోజు, చివరి రోజు రెండు రోజులు చాలా గిరాకీ ఉంటుంది. ఏటా వచ్చి పూలు అమ్ముతాము. ఉదయం నుంచే గిరాకీ ఉంటుంది. చాలా మంది పూలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వస్తున్నారు. పొద్దుపొడవక ముందు 4 గంటలకు గుట్ట ప్రాంతాలకు పోయి పూలు కోసుకుని వచ్చి..ఇక్కడ అమ్ముతాం. – కుమార్, సైదాపూర్ పూల ధరలు(సుమారుగా రూపాయలలో) తంగెడు కట్ట 10–15 గునుగు కట్ట 10–15 బంతిపూలు 50 గ్రాములు 20 చామంతి 50 గ్రాములు 20 గులాబీ 50గ్రాములు 20–30 చామంతి ఒకటి 5–10 పట్టుకుచ్చులు కట్ట 10–15 గుమ్మడిపూలు ఒకటి 5–10 -
‘పూల’ సందడి
మార్కెట్ రంగులమయం కుప్పలుగా బతుకమ్మపూలు తంగెడు, గునక పూలకు డిమాండ్ కరీంనగర్ బిజినెస్ : తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీక బతుకమ్మ..రంగురంగుల పూలతో చూడముచ్చటగొలిపేది బతుకమ్మ..బంగారు బతుకును ఇవ్వాలని కోరుతూ చేసేది బతుకమ్మ.. బతుకమ్మ ఆరంభంతో మార్కెట్ అంతా రంగులమయమైంది. పూలవ్యాపారులతో సందడిగా మారింది. గ్రామాల్లో రంగురంగుల పూలు సేకరించి నగరంలోని మార్కెట్లో చాలా మంది విక్రయిస్తున్నారు. ఈ తొమ్మిది రోజులు మార్కెట్ పూలతో సందడిగా మారనుంది. మార్కెట్ రంగులమయం బతుకమ్మ పండుగ మెుదలుకావడంతో మార్కెట్ మొత్తం రంగు రంగుల పూలతో నిండుగా కనిపిస్తుంది. తంగెడు, గునుకపూలు, బంతి, చామంతి, గులాబీలు, కట్లపూలు, మందార, తామర, పట్టుకుచ్చుల పూలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. బతుకమ్మ పేర్చేందకు కావాల్సిన గుమ్మడి ఆకులు, గౌరమ్మను చే సేందకు గుమ్మడి పూలు అందుబాటులో ఉన్నాయి. పల్లెల నుంచి.. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పలువురు వ్యాపారులు నగరానికి వచ్చి మార్కెట్లో పూలు విక్రయిస్తున్నారు. అల్గునూర్, శ్రీరాములపల్లి, సైదాపూర్, చల్లూరు, కోహెడ, మానకొండూర్, కేశవపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్, రామడుగు, గంగాధర మండలాల్లోని పలు గ్రామాలు, శనిగరం, కొత్తపల్లి నుంచి సైతం వ్యాపారులు వస్తున్నారు. గుట్టలు, చెలక ప్రాంతాల్లో సేకరించిన పూలను నగరానికి తరలించి అమ్ముకుంటామని వ్యాపారులు పేర్కొంటున్నారు. మొదటి, చివరి రోజు గిరాకీ బతుకమ్మ ప్రారంభం నుంచి తొలి రోజు, చివరి రోజు చాలా గిరాకీ ఉంటుందని వ్యాపారులు తెలిపారు. మధ్యరోజుల్లో కొంచెం తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు. గిరాకీ ఉంటది బతుకమ్మ పండుగంటే అందరికి సంబుర మే. పొద్దుగాలనే పూలు కొసుకొని అమ్ముకుందామని ఇక్కడికి వచ్చినా. గిరాకీ బాగానే ఉంటది. తంగెడుపూలు, గునుక పూలు ఎక్కువగా అమ్ముడుపోతయి. మా ఊరు నుంచి బాగానే మంది వచ్చిండ్రు. యాడాదికోసారచ్చే పండుగ కాబట్టి పొద్దగాలటి నుంచి∙అందరు వచ్చి పూలు కొనుక్కపోతుండ్రు. మేం కూడా ఏటా వచ్చి పూలమ్ముకుంటాం. – రాజవ్వ, అల్గునూర్ రెండు రోజులు గిరాకీ బతుకమ్మ మొదలైన రోజు, చివరి రోజు రెండు రోజులు చాలా గిరాకీ ఉంటుంది. ఏటా వచ్చి పూలు అమ్ముతాము. ఉదయం నుంచే గిరాకీ ఉంటుంది. చాలా మంది పూలు కొనుక్కోవడానికి మార్కెట్‌కు వస్తున్నారు. పొద్దుపొడవక ముందు 4 గంటలకు గుట్ట ప్రాంతాలకు పోయి పూలు కోసుకుని వచ్చి..ఇక్కడ అమ్ముతాం. – కుమార్, సైదాపూర్ పూల ధరలు(సుమారుగా రూపాయలలో) తంగెడు కట్ట 10–15 గునుగు కట్ట 10–15 బంతిపూలు 50 గ్రాములు 20 చామంతి 50 గ్రాములు 20 గులాబీ 50గ్రాములు 20–30 చామంతి ఒకటి 5–10 పట్టుకుచ్చులు కట్ట 10–15 గుమ్మడిపూలు ఒకటి 5–10 -
డల్లాస్‌లో ఘనంగా బొడ్డెమ్మ పండుగ
డల్లాస్ : డల్లాస్‌లో బొడ్డెమ్మ పండుగతో అప్పుడే బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్( టీపీఏడీ) ఆధ్వర్యంలో బంతుకమ్మ పండుగకు మందు నిర్వహించే బొడ్డెమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. డా. పెప్పర్ ఏరియన్ ఫ్రిస్కోలో అక్టోబర్ 8న బతుకమ్మ జరిపే సంబురాలకు ముందు టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని నార్త్ లేక్ రాంచ్ పార్క్‌లో బొడ్డెమ్మ పండుగను జరిపారు. బతుకమ్మ పాటలతో బొడ్డెమ్మ పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలు ఆ ప్రాంతాన్నంతా హోరెత్తించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. టీపీఏడీ కన్వీనర్ సుధాకర్ కలసాని, సెక్రటరీ కరన్ పోరెడ్డి, కో కన్వీనర్ సుమన బసాని, మాజీ కన్వీనర్ మాధవి సుంకి రెడ్డి, రమణ లష్కర్(జాయింట్ సెక్రటరీ), ఛైర్ ఆఫ్ బోర్డ్ ట్రస్టీ రామ్ అన్నాడి, టీపీఏడీ సలహాదారులు ఇందు పంచేరుపుల, సంతోష్ కోరె, అజయ్ రెడ్డి చైర్మన్, రఘువీర్ బండారు వైస్ ఛైర్మన్, టీపీఏడీ వ్యవస్థాపక కమిటీ సభ్యులు రావు కల్వల, జానకి మందాడి, ఉపేందర్ తెలుగు, మహేందర్ కామిరెడ్డి, రాజ్ గోందీ, బోర్డు ట్రస్టీలు పవన్ గంగాధర, గంగదేవర, అశోక్ కొండాల, ప్రవీణ్ బిల్ల, మనోహర్ కాసగాని, మాధవి సుంకి రెడ్డి, రాజేందర్ తొడిగాల, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, సురేందర్ చింతల, శ్రీనివాస్ వేముల, శ్రీని గంగాధర, సత్య పేర్కాని, రవికాంత్ మామిడి, శరత్ ఎర్రం, రూప కన్నవాగరి, రోజ ఆడెపు, సతీష్ జనుంపల్లి, వేణు భాగ్యనగర్, విక్రం జనగాం, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకలపల్లి, రవి శంకర్ పటేల్, అఖిల్ చిదిరాల, సునిల్ కుమార్ ఆకుల, లక్ష్మీ పోరెడ్డి, కల్యాణి తడిమేటి, మధుమతి వ్యాసరాజు, కారుణ్య దామెర్ల, క్రాంతి తేజ పండ, పల్లవి తోటకూర, రత్నా వుప్పాల, రోహిత్ నరిమేటి, శంకర్ పరిమళ్, వసుధారెడ్డి, అనూష వనం, కవిత ఆరుట్ల, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగెల్లలు కార్యక్రమం విజయవంతలో తమ వంతు కృషి చేశారు. బతుకమ్మ పండగకు కోసం టీపీఏడీ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను అజయ్ రెడ్డి ఏలేటి వివరించారు. బతుకమ్మ పండగ వేడుకల్లో పాల్గొనే దాదాపు 10 వేల మంది కోసం కమిటీ సభ్యులు, వాలంటీర్లతో కలిసి స్టేడియాన్ని ముస్తాబు చేయనున్నట్టు అజయ్ పేర్కొన్నారు. -
ఓవర్‌డోస్ పర్యవసానం
అక్షర తూణీరం చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంతమేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం. మహారాజు పరమ నిష్ఠాగరిష్టుడు. సత్యసంధుడు. మన ముఖ్యమంత్రి కేసీఆర్‌లాగా ఒక పద్ధతి గల మనిషి. ఒక రోజు రాజు తన ఎర్రవెల్లి తోట నుంచి కోటకి గుర్రం మీద వస్తున్నాడు. వాగు దాటే వేళ రాయి మీద గిట్ట జారింది. గుర్రం పడిపోయింది. రాజు పక్కనే ఉన్న ఊబిలో పడ్డాడు. ఎంత ప్రయత్నించినా లేవలేకపోయాడు. రాజు ఒక్కసారి ఆకాశం వైపు తిరిగి, ‘ఓ ముక్కోటి దేవత లారా! నేను ఆకస్మికంగా ఊబిలో పడ్డాను. లేవలేక పోతున్నాను. నేనే కనక ధర్మపరుడినైతే, నేనే కనక మిమ్ముల నమ్మి కొలుస్తున్నట్టైతే- నన్నీ ఊబిలోంచి బయట పడెయ్యండి!’ అంటూ ప్రార్థించాడు. మరు క్షణం పురాణ ఫక్కీలో ఆకాశంలో మెరుపులు మెరిశాయి. చెట్లు పూనకం వచ్చినట్టు ఊగాయి. రాజు ఒక్కసారిగా లేచి, రివ్వున ఎగిరి దూరంగా మరో ఊబిలో పడ్డాడు. ఈ దృశ్యాన్ని చూసిన గుర్రం విచిత్రంగా సకిలించింది. రాజుకి రోషం వచ్చింది. ‘‘సాయం కోరితే చేయుట ఇట్లేనా’’ అని ఆకాశాన్ని సూటిగా ప్రశ్నించాడు. వెంటనే మెటాలిక్ వాయిస్‌లో జవాబు వచ్చింది- ‘‘మారాజా! చిన్న గుంటలోంచి లేవడానికి ముక్కోటి దేవతలను సాయమడిగావ్. అందరూ తలో చెయ్యి వేశారు. దాంతో నువ్ పోయి ఎక్కడో పడ్డావ్.’’ తన ప్రార్థన ఓవర్‌డోస్ అయిందని రాజు గ్రహించాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. క్రిందటి సంవత్సరం చివర్లో మన సొంత ఎస్టేట్‌లో చండీయాగం చేశాం. అలా ఇలా కాదు. ఇలాతలం దద్దరిల్లే విధంగా. ఎన్ని యజ్ఞకుండాలు, ఎందరు రుత్త్విక్కులు, ఎన్ని సమర్పణలు, ఎందరు వీఐపీలు, ఎంతటి కవరేజి?! స్తోత్రాలు, ఆహుతులు చేరవలసిన వారికి చేరాయి. ఫైళ్లు గబగబా కదిలాయి. తెలంగాణలో వచ్చే రుతువులో వర్షం బాగా పడేట్టు చూడండని అమ్మవారు ఆదేశిం చింది. కేసీఆర్ సోమయాజిగా నడిపిన చండీయాగం పూజలు గుర్తొచ్చినప్పుడల్లా దిక్పాలకులకి వాన మాట హెచ్చరించడంతో ఈ స్థితి దాపురించిందని ఒక పెద్దాయన విశ్లేషిస్తున్నాడు. మన నేత భక్తి ఓవర్‌డోస్ అయిందని ప్రాజ్ఞులు తేల్చారు. ఏమిటి దీనికి విరుగు డని సవినయంగా వారిని అడిగాను. ఏంలేదు, ఈసారి రుత్త్విక్కులని సగానికి తగ్గించడం, దానాలూ దక్షిణలూ కూడా కుదించుకోవడం మంచిదన్నారు. భక్తిశ్రద్ధల విషయంలో కూడా నాలుగు డిగ్రీలు రాజీపడితే ఇంతింత కుంభవృష్టి పడే ప్రమాదం ఉండదన్నారు. ఈలోగా విశ్వనగరాన్ని క్షుణ్ణంగా రిపేరు చేసుకుంటే, ఇహ తర్వాత రెచ్చిపోవచ్చు. మన నగరాన్ని భూతల స్వర్గం కాశ్మీరంలా చేసుకోవడం తేలిక అనిపిస్తుంది. ఇప్పటికే చాలా ప్రధాన వీధులు నీళ్లతో కళకళలాడు తున్నాయి. రూట్లు నిర్ధారించి బోట్లు వేసేస్తే కొంత మేర కాశ్మీర కళ వస్తుంది. ఇక మెరక వీధుల మీద కార్పొ రేషను, కేటీఆర్ దృష్టి పెడితే ఏడాదిన్నరలో ఇక్కడ కుంకుమ పూదోటలు ఘుమఘుమలాడడం ఖాయం. అప్పుడు గత పాలకులపై బురద జల్లకుండా కుంకుమ పూలని ఆస్వాదించవచ్చు. ఇదిగో ఇప్పుడు బతుకమ్మల మీదకు మళ్లుకుం టున్నారు. నాకు భయంగా ఉందని ఒక ఆధ్యాత్మికవేత్త కంగారు పడ్డాడు. ‘‘ఈసారి బతుకమ్మ పూజకి బడ్జెట్ పెంచారు. అటు భక్తిభావం పెరిగింది. ఇక ఆవిడ కూడా ఒకటిన్నర రెట్లు కరుణిస్తే ... అమ్మో చాలా డేంజరండీ!’’ అన్నాడు. ఈ భక్తి విప్లవాన్ని ఎవరైనా ఆపి పుణ్యం కట్టుకుంటే బాగుండు. శ్రీరమణ, (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
డెన్వర్‌లో 'టీడీఎఫ్' బతుకమ్మ సంబరాలు
తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలను అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజిల్స్‌లలో బతుకమ్మ సంబరాను నిర్వహించారు. తాజాగా డెన్వర్‌లో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నారు. శనివారం డెన్వర్‌లోని కెసిల్ఉడ్ గ్రాంజ్ వేదికగా బతుకమ్మ, దసరా సంబరాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు అమెరికాలోని తెలుగువారు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు. -
సింగపూర్ లో బతుకమ్మ వేడుకలు
సింగపూర్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్ లో బంగారు బతుకమ్మవేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు వందల మంది తెలుగు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిచాయి. బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో వేదిక హోరెత్తింది. ఉత్తమ బతుకమ్మలకు, బతుకమ్మ సందర్భంగా ఏటా నిర్వహించే క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బతుకమ్మ వేడుకలు ఎన్నారైల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని సొసైటీ అద్యక్షుడు బండ మాధవ రెడ్డి తెలిపారు. -
మెల్బోర్న్లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎమ్‌టీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు ఆస్ట్రేలియాలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిచాయి. ఉత్సవాలకు వేదికైన రిక్వెస్ట్ హాల్ తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ముస్తాబైంది. బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో వేదిక హోరెత్తింది. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్‌టీఎఫ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సాంప్రదాయాలను భావి తరాలకు అందించేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మెల్బోర్న్లో బతుకమ్మ ఉత్సవాలు
బతుకమ్మ సంబరాలను ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. విదేశాల్లో ఉన్నా మూలలను మరచిపోని తెలుగువారు అక్కడ కూడా బతుకమ్శ పండుగను జరుపుకోనున్నారు. ఆస్ట్రేలియాలో 'మెల్బోర్న్ తెలంగాణ ఫోరం' తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం సంయుక్తంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ చీఫ్ విప్ గొంగడి సునీత ముఖ్య అతిధిగా హాజరవుతుండగా, కల్చరల్ గెస్ట్‌గా మిట్టపల్లి సురేందర్ పాల్గొననున్నారు. 'రిక్వెస్ట్ వైఎంసీఏ హాల్' వేదికగా ఈ ఉత్సవాలు సాయంత్రం 4 గంటల నుండి ప్రారంభం కానున్నాయని 'ఎమ్‌టీఎఫ్' ప్రతినిధులు తెలిపారు. ఉత్సవాలతో పాటు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
న్యూయార్క్‌లో బతుకమ్మ సంబరాలు
అమెరికాలోని న్యూయార్క్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్న స్వామిగౌడ్‌ను టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు ఏనుగు లక్ష్మన్ సాదరంగా ఆహ్వానించారు. 'ఆశామయి హిందూ టెంపుల్ అండ్ కన్వెన్షన్ సెంటర్'లో నిర్వహించే ఈ బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. -
కవిత అలా అనడం సరికాదు: శారద
-
కవిత అలా అనడం సరికాదు: శారద
హైదరాబాద్ : బతుకమ్మ వేడుకలకు కేసిఆర్ ప్రభుత్వం పది కోట్లు విడుదల చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపట్టింది. గత ఏడాది ప్రభుత్వ నిధులన్నీ కేసిఆర్ కూతురు కవిత పాల్గొన్న బతుకమ్మ కార్యక్రమాలకే ఖర్చు చేశారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు, ఆశా వర్కర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే...మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాత్రం బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలనడం సరికాదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ కవిత హడావుడి చేయడం వారిని అవమానించడమే అవుతుందని శారద విమర్శించారు. దత్తత తీసుకోవడానికి ఆ కుటుంబాలు అనాధలు కావని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ ఆమె చేశారు. -
ఘనంగా బతుకమ్మ సంబరాలు!
హైదరాబాద్: తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ అంతా బతుకమ్మ పాటలతో మారుమ్రోగుతోంది. ఎల్బి స్టేడియం నుంచి బతుకమ్మల ఊరేగింపు ఈ సాయంత్రం ప్రారంభమైంది. ఎంపి కవిత ఊరేగింపును ప్రారంభించారు. పది వేల బతుకమ్మలు ట్యాంక్‌బండ్ వద్దకు బయలుదేరాయి. ట్యాంక్‌బండ్ జనసంద్రమైంది. మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ట్యాంక్‌బండ్ పరిసరాలలో బతుకమ్మల పాటలే వినవస్తున్నాయి.బతుకమ్మ సంబరాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆటపాటలతో సంబరాలు ఘనగా కొనసాగుతున్నాయి. దాండియా, కోలాటాలు, పాటలతో ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దంపతులు ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. ఈ దంపతులు ఆనందంగా బతుకమ్మ ఆడారు. ** -
ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండగ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల వరకు ఎల్బీ స్టేడియం, బషీర్ బాగ్, అంబేద్కర్ విగ్రహాల వైపుకు వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ జితేందర్ మీడియాకు తెలిపారు. -
'సాక్షి' ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
-
బంగారు మనసివ్వు ఉయ్యాలో..
-
ఛాయూచిత్రమైన బతుకవ్ము
తెలంగాణలో తొలిసారి విరబూసిన పూల పండుగ... రాష్ట్ర వ్యాప్తంగా పరిమళాలు వెదజల్లుతోంది. వైవిధ్యమైన రూపాల్లో కొలువుదీరుతున్న బతుకమ్మ... కెమెరాలను ఆపకుండా పనిచేయిస్తోంది. నగరానికి చెందిన పలువురు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు బతుకమ్మల అరుదైన చిత్రాలను ఒడిసి పట్టుకోవడానికి పోటీపడతున్నారు. ‘‘బతుకమ్మలను రూపొందించడంలో, అద్భుతంగా డిజైన్ చేసి తమ ఆటపాటలనే అలంకారంగా మార్చే ఈ పండుగ సంబురం ఒక ఫొటోగ్రాఫర్ కు చేతినిండా పనికల్పిస్తుంది’’అంటున్నారు హైదరాబాద్ వీకెండ్ ఫొటో షూట్స్ క్లబ్‌కు చెందిన చంద్రశేఖర్ సింగ్. అప్రయత్నంగా తన కెమెరా బంధించిన అపురూపమైన బతుకమ్మల కలెక్షన్స్‌తో ఆయన మంగళవారం నుంచి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ప్రారంభిస్తున్నారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో రాత్రి 6.30గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారాయన. -
ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో..
-
వస్త్రవిభ
మహిళలకు చీరకట్టే అసలైన అందాన్నిస్తుంద ంటున్నారు నటి జయసుధ. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో వస్త్రవిభ పేరిట శనివారం ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. సోమవారం వరకు సాగే ఈ ఎక్స్‌పోలో దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 80 మంది మాస్టర్‌వీవర్స్ ఉత్పత్తులు కొలువుదీరాయి. పట్టు, కాటన్, సిల్క్, డిజైనరీ డ్రెస్ మెటీరియల్స్, యాక్ససరీస్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే బోటిక్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడానన్నారు జయసుధ. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటపాటల్లో ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని రకాల చీరలను ఇష్టపడతానన్న ఈ సహజనటి.. మనసుకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొనేస్తానంటున్నారు. త్వరలో నగరంలో ఓ బోటిక్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దసరా కానుకగా రానున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో మంచి పాత్ర పోషించానని తెలిపారు. తను నటిస్తున్న మరిన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయని చెప్పుకొచ్చారు జయసుధ. -
ఆటకు సిద్ధం
బిజీ సిటీలైఫ్‌లో బతుకమ్మను పేర్చే తీరిక ఎవరికుంది. ఓపిక కూడదీసుకుని బతుకమ్మను తీర్చిదిద్దాలన్నా.. పెరిగిన ధరలతో ఆకాశంలో ఉన్న పూలను మధ్యతరగతి మగువలు అందుకోలేకపోతున్నారు. వీరి కోసమే.. వచ్చాయి రెడీమేడ్ బతుకమ్మలు. గంటలకు గంటలు కూర్చొని బతుకమ్మను తయారు చేసే పనిలేకుండా.. తీరొక్క రీతిగా ముస్తాబైన ఆర్టిఫిషియల్ బతుకమ్మలు అంగట్లో దొరుకుతున్నాయి. పూల పండుగ బతుకమ్మను మధ్యతరగతి కుటుంబీకులు జోష్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్న పూల ధరలు.. మిడిల్‌క్లాస్‌కు బతుకమ్మ సంబురాల్ని భారంగా మారుస్తున్నాయి. చటాక్ పూలకు రూ.70 వరకూ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వర్గానికి వరమే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ. దీనికి గంపలకొద్దీ పూలు అక్కర్లేదు. ఇంట్లో వృథాగా ఉన్న కార్డ్బోర్డ్, చవకగా దొరికే థర్మాకోల్, పేపర్ పూలు, వెజిటబుల్ కలర్స్‌తో తయారైన కాగితం పూలతో ఈ బతుకమ్మ తయారు చేయొచ్చు. డిజైనర్ బతుకమ్మలు ఈ మధ్య నగరవాసులు ప్రతీదానికి డిజైనర్ సెలెక్షన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మల విషయంలో కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ మెథడ్‌తో అలాంటి డిజైనర్ బతుకమ్మల తయారీ వెరీ ఈజీ. ఖర్చు కేవలం 60 రూపాయలే. రోజుకో రకం తయారు చేసుకోవచ్చు. లేదంటే ఒకే బతుకమ్మను తొమ్మిది రోజులూ పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున సిటీలోని ప్రధాన కూడళ్లలో నిలువెత్తు రెడీమేడ్ బతుకమ్మలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. షాిపింగ్ మాల్స్ దగ్గర్నుంచి ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కడైనా.. ఈ రెడీమేడ్ బతుకమ్మలను అలంకరించుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ పండుగ సందర్భంగా ఈ రెడీమేడ్ బతుకమ్మలను తయారుచేసే వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రకృతికి నో ఫికర్ ఈ రెడీమేడ్ బతుకమ్మలతో పర్యావరణానికి ఎలాంటి చేటు ఉండదంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అరుణ్‌జ్యోతి ఎస్ లోఖండే. థర్మకోల్, కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదంటున్నారామె. తొమ్మిది రోజుల పండుగ అయిపోయాక ఈ రెడీమేడ్ బతుకమ్మను ఇంట్లోనే అలంకరించుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ప్రకృతిని కాపాడినవారం అవుతామంటున్నారు అరుణ్‌జ్యోతి. డబ్బుకి డబ్బు ఆదా.. ‘పూల కాస్ట్ ఎక్కువైపోయింది. మూడు వందలు పెడితేకాని పావుకిలో పూలు రావట్లేదు. ఆ పూలతో బుజ్జి బతుకమ్మే తయారవుతోంది. పదిమందిలో ఆడేటప్పుడు కాస్త ఆకర్షణగా ఉండాలంటే కనీసం రూ.1,500 ఖర్చు చేయాల్సిందే. తొమ్మిది రోజులూ అంత డబ్బంటే మాటలుకాదు. అందుకే ఈ రెడీమేడ్ బతుకమ్మలను కొనుక్కుంటున్నాం. డబ్బుకి డబ్బు ఆదా.. శ్రమా అదా.. పండుగ చేసుకున్న భాగ్యమూ దక్కుతోంది’ అని చెప్పింది ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సరిత. జ్ఞాపకంగా.. ‘రేట్ లెక్కచేయకుండా పూలు కొని బతుకమ్మను పేర్చినా అందరూ వచ్చి ఆడేసరికి ఆ పూలు వాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ ఎంత లేటయినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండుగ అయిపోయినా ఓ జ్ఞాపకంగా షోకేస్‌లో దాచుకోవచ్చు’ అని వివరించింది అన్నానగర్ నివాసి మహేశ్వరి. -
బతుకమ్మ సంబరాల్లో కేసీఆర్ సతీమణి
హైదరాబాద్ : టీజీవో భవన్లో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి బతుకమ్మ సంబరాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, హరీష్‌రావు సతీమణి శ్రీనీత పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో కలిసి వీరంతా బతుకమ్మ ఆడారు. కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో మంత్రి కేటీఆర్ కుమారుడు కూడా సందడి చేశారు. -
కువైట్‌లోనూ.. బతుకమ్మ సంబరాలు!
-
పని చేయటం మానేసి పండుగలా?
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ పని చేయటం మానేసి పండుగలు చేస్తోందని బీజేపీ నేత నాగం జనార్థన్ రెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రైతులు దసరా చేసుకునే పరిస్థితిలో లేరని ఆయన శనివారమిక్కడ అన్నారు. విద్యుత్ సమస్యలతో రైతాంగం సతమతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన సాగటం లేదని, నాలుగు నెలల్లో ఒక్క రూపాయి కరెంట్ అయినా కొన్నారా అని నాగం ప్రశ్నించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చడానికే ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. -
ఉద్యోగులకు రేపే జీతాలు
సాక్షి, హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఈనెల 26వ తేదీనే వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పెన్షనర్లకు కూడా 26వ తేదీనే పింఛను చెల్లించనుంది. దసరా, బతుకమ్మ పండుగలుండటంతో 28వ తేదీలోగా జీతాలు, పించన్లు చెల్లించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆర్థిక శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ తేదీ కంటే రెండ్రోజుల ముందే వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వి.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులందరికీ వేతనాలు అందేలా చూడాలని తెలంగాణ ఖజానా శాఖ సంచాలకులను ఆదేశించారు. -
బతుకమ్మ.. ముందు తరాలు గర్వించేలా..!
-
వికారాబాద్‌లో జిల్లాస్థాయి ‘బతుకమ్మ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ పండుగను జిల్లాలో విజయవంతంగా జరపాలని జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాస్థాయిలో ఈ ఉత్సవాలను వికారాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 24 నుంచి అక్టోబర్2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి ఉత్సవాలకు కలెక్టర్ అధ్యక్షులుగా, డీఆర్డీఏ పీడీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. మండల స్థాయిలో మండల పరిషత్ ప్రెసిడెంట్ అధ్యక్షులుగా, ఎంపీడీఓ కన్వీనర్‌గా, గ్రామస్థాయిలో సర్పంచ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈనెల 24నుంచి ప్రతిరోజు కలెక్టరేట్లో ఒక్కో శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ హరినారాయణన్, డీఆర్వో సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. -
పద్మాక్షమ్మా.. క్షమించు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ ప్రజల పెద్ద పండుగ బతుకమ్మ. సద్దుల బతుకమ్మకు వరంగల్ జిల్లా ప్రసిద్ధి. జిల్లా కేంద్రంలోని పద్మాక్షి గుట్ట వద్ద అధిక సంఖ్యలో మహిళలు చేరి సద్దుల బతుకమ్మ ఆడతారు. తెలంగాణలోనే సద్దుల బతుకమ్మకు ప్రసిద్ధిగాంచిన పద్మాక్షి గుట్టకు ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. నగరంలో పెరిగిన భూముల ధరలతో భూ ఆక్రమణదారులు ఇప్పుడు పద్మాక్షి గుట్టకు ఎసరు పెట్టారు. గుట్టకు సమీపంలోని పట్టా భూములను ఆసరాగా చేసుకుని గుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారు. నేరుగా ఇళ్లు, ఇతర నిర్మాణాలను చేపట్టకుండా... ఆలయాలు కట్టి, దేవుళ్లను ప్రతిష్టిం చి కబ్జాలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన పలువురు నేతలు కొద్ది కొద్దిగా గుట్టను కబ్జా చేస్తున్నారు. ఇన్నాళ్లు చూసీ చూడనట్లు వ్యవహరించిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు కూడా చోద్యం చూస్తుండడంతో కబ్జాలో వీరి పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హన్మకొండ చౌరస్తాకు కూత వేటు దూరంలో పద్మాక్షి గుట్ట ఉంది. 898 సర్వే నంబర్లో గుట్టతోపాటు దీనికి సమీపంలోని 78.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో 83 మందికి 80, 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఇలా ప్రభుత్వం కేటాయించిన భూముల కంటే భారీగా ప్రభుత్వ భూమి ఇప్పటికే కబ్జాకు గురైంది. పలువురు పేరొందిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల అనుబంధ సంస్థల నాయకులు ఇష్టారాజ్యంగా గుట్టకు సమీపంలోని స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. వాటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు తాజాగా జరుగుతున్న ఆక్రమణలను కూడా పట్టించుకోవడం లేదు. పవిత్ర దేవాలయం ముసుగులో చారిత్రక పద్మాక్షి గుట్టను కొల్లగొట్టేందుకు ఆక్రమణ దారులు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
సాగర తీరం..పూల హారం
కవాడిగూడ,ఖైరతాబాద్, న్యూస్‌లైన్: గునుగుపూలు, తంగెళ్లు, ముద్దబంతులు, చామంతులు, గడ్డిపూలతో సాగరతీరం పూలహారంగా మారింది. ఉయ్యాల పాటలు, బతుకమ్మ ఆటలతో హుస్సేన్‌సాగర్ తీరమంతా మార్మోగింది. తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ పేరుతో శనివారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన ఈ ఉత్సవాల్లో మహిళలు, యువతులు పెద్దసంఖ్యలో పాల్గొని సందడిచేశారు. సాయంత్రం 7 గంటలకు స్థానిక వివేకానంద విగ్రహం నుంచి డప్పుచప్పుళ్లు, కళాకారుల ప్రదర్శనల మధ్య ప్రారంభమైన ర్యాలీలో వందలాది మంది మహిళలు అందంగా తయారు చేసిన తమ బతుకమ్మలను చేతపట్టుకొని ముందుకు కదిలారు. కూకట్పల్లి వివేక్నగర్కు చెందిన గడీల వసంతవెంకట్రావు (రజిత) తీసుకొచ్చిన సుమారు 8 అడుగుల భారీ బతుకమ్మ విశేషంగా ఆకట్టుకోగా..ఈసీఐఎల్ నుంచి వచ్చిన మహిళలు సుమారు 4 అడుగుల గౌరమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీ రాజరాజేశ్వరీ ఒగ్గుడోలు కళాకారులు, ఇతర డప్పు కళాబృందాలు, మహిళా కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగురంగుల పూలతో ఎంతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మలను తమ కెమెరాల్లో బంధించుకునేందుకు విదేశీయులతోపాటు ఇటు యువతులు,యువకులు పోటీపడ్డారు. అనంతరం ‘పోయిరా బతుకమ్మ’ అంటూ సాగరంలోకి సాగనంపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో..: ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..బంగారు గౌరమ్మ ఉయ్యాలో’ అంటూ భాగ్యనగర మహిళలు భక్తిపారవశ్యంలో సంబరపడిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. నెక్లెస్‌రోడ్‌లోని సాగర తీరమంతటా బతుకమ్మలను పేర్చిన వందలాదిమంది మహిళలు ఆడిపాడారు. అదనపు జాయింట్ కలెక్టర్ రేఖారాణి, ఆర్డీవో బి.నవ్య బతుకమ్మలను నెత్తిన పెట్టుకొని, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు ఏజేసీ రేఖారాణి బహుమతులు అందజేశారు. ఆకట్టుకున్న డప్పువాయిద్యాలు, నృత్యాలు: బతుకమ్మ సంబరాల్లో భాగంగా పీపుల్స్‌ప్లాజా రోటరీ చౌరస్తాలో విద్యుత్తుకాంతుల మధ్య ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల డప్పువాయిద్యాలతో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. సంప్రదాయ దుస్తులతో మహిళలు బొడ్డెమ్మలు, కూచిపూడి నృత్యాలు సందర్శకులను కట్టిపడేశాయి. మం త్రులు దానం నాగేందర్, ముఖేశ్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్‌లు సతీమణులతో సంబరాల్లో పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లక్ష్మీదేవి, ఖైరతాబాద్ కార్పొరేటర్ ఎస్.కె.షరీఫ్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం 4 నుంచి ఈ కింద తెలిపిన ప్రాం తాల్లో అవి అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని అనురాగ్ శర్మ కోరారు. సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు. వీటిని సెయిలింగ్ క్లబ్, చిల్డ్రన్స్ పార్క్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్/తెలుగుతల్లి ఫ్లైఓవర్/అంబేద్కర్ స్టాట్యూ మీదుగా మళ్లిస్తారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ స్టాట్యూ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను చిల్డ్రన్స్ పార్క్ వరకు ట్యాంక్‌బండ్‌పై కుడివైపు మాత్రమే అనుమతిస్తారు. ఖెరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గలోని వచ్చే వాహనాలను నెక్లెస్ రోటరీ నుంచి ఐ-మాక్స్, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్, పీపుల్స్ ప్లాజా వైపు పంపిస్తారు. నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వైపు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోకి వెళ్లే వాహనాలను ఐ-మాక్స్, సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్ మీదుగా ఖైరతాబాద్ వైపు పంపిస్తారు. సైఫాబాద్ ట్రాఫిక్ ఠాణా, మింట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా పంపిస్తారు.