కవిత అలా అనడం సరికాదు: శారద
హైదరాబాద్ : బతుకమ్మ వేడుకలకు కేసిఆర్ ప్రభుత్వం పది కోట్లు విడుదల చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తప్పుపట్టింది. గత ఏడాది ప్రభుత్వ నిధులన్నీ కేసిఆర్ కూతురు కవిత పాల్గొన్న బతుకమ్మ కార్యక్రమాలకే ఖర్చు చేశారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు.
ఓ వైపు రాష్ట్రంలో రైతులు, ఆశా వర్కర్లు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే...మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత మాత్రం బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలనడం సరికాదన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ కవిత హడావుడి చేయడం వారిని అవమానించడమే అవుతుందని శారద విమర్శించారు. దత్తత తీసుకోవడానికి ఆ కుటుంబాలు అనాధలు కావని... వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ ఆమె చేశారు.