సాక్షి, నల్గొండ: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భీమా పక్రియ విజయవంతంగా కొనసాగుతోందని టీఆర్‌ఎస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 21 లక్షల మంది రైతులను కలిసి నామిని వివరాలు, సంతకాలు సేకరించామని చెప్పారు. జులై చివరి నాటికి భీమా పత్రాలను ఎల్‌ఐసీకి సమర్పించాలి.. కావునా రైతులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
ప్రతిపక్ష పార్టీలు అర్ధరహిత ఆరోపణలు మానుకొని రైతు భీమా పక్రియలో పాల్గొంటే రైతులకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణలతో కేంద్రం కూడా రైతుల జపం చేస్తోందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో రైతులు ఆందోళన బాట పట్టారని, తెలంగాణలో అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పిడుగుపాటుకు మరణించిన రైతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment