తుమ్మలను పరామర్శించే తీరిక ఉంది కానీ....
మెదక్ : "సీఎం కేసీఆర్ అభద్రతకు గురవుతున్నాడు... అందుకే కరువు బారిన పడిన రైతులను పరామర్శించడం లేదు...అస్పత్రిలో ఉన్న తుమ్మలను పరామర్శించే తీరిక ఉంది.. కానీ, విద్యుత్, కరువు, వరదలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకోవడం లేదు... ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పథకాలపైనే శ్రద్ధ చూపుతున్నా'డని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేసీఆర్ మాటకారి...మోసకారి, బుడుబుక్కల, పిట్టల దొరని ధ్వజమెత్తారు.
రుణమాఫీపై కేసీఆర్ అయోమయంలో ఉండి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వంద రోజుల పాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సింగపూర్ వెళ్లడానికి సమయమున్న కేసీఆర్కు ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి సమయం లేద అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే సోనియాకు రుణపడి ఉంటానన్న కేసీఆర్... ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు.