ponnala lakshiah
-
రెబల్స్ దారెటు.. దూతల వ్యూహం ఫలించేనా?
సాక్షి, హైదరాబాద్ : రేపటితో తెలంగాణ నామినేషన్ల గడవు ముగియనుండటంతో రెబల్స్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. వ్యూహ చతురతలో దిట్టగా పేరొందిన కర్ణాటక మంత్రి డి.కె.శివకుమార్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, ఆ రాష్ట్ర వైద్య మంత్రి మల్లాడి కృష్ణారావులుతో కూడిన కమిటీ ఆశావాహులను బుజ్జగిస్తోంది. టికెట్ దక్కని వారికి పార్టీ అధికారంలోని రాగానే సముచిత స్థానం కల్పిస్తామనే హామీతో నేతలను చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్దమైన వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేంధర్ రెడ్డితో కమిటీ భేటీ అయ్యింది. తాను ఇరవై ఏళ్లుగా పార్టీకి సేవచేస్తున్నానని వరంగల్ వెస్ట్ టికెట్ తనకే కేటాయించాలని ఆయన కమిటీ ముందు డిమాండ్ చేశారు. భవిష్యత్తుపై హామీ ఇస్తామని కమిటీ నచ్చచెప్పడంతో సాయంత్రంలోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన అన్నారు. జనగామ నుంచి బరిలోకి దిగిన పొన్నాలతో భేటీ అయిన కమిటీ అక్కడి పరిస్థితి గురించి ఆరా తీసింది. ఇక ఖమ్మంలో సీటు అశించిన ఆ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌తో కమిటీ భేటీ అయ్యింది. గతంలో కూడా పొత్తుల కారణంగా తనకు అన్యాయం జరిగిందని కమిటీ వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి వారు ఇంతకాలం చేసిన కృషిని అభినందిస్తూనే ఈసారి వెనక్కి తగ్గాలని దూతలు బుజ్జగిస్తున్నారు. పార్టీ తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయిన పార్టీకి కోసం చివరి వరకు పని చేస్తానని ఆయన కమిటీతో తెలిపారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి చెందిన పాల్వాయి గోవర్ధన్ కుమార్తె రజనీతో కూడా కమిటీ భేటీ అయ్యింది. మూడు దశాబ్దాల పాటు తన తండ్రి పార్టీకి చేసిన సేవల గురించి ఆమె కమిటీ ముందు తెలిపారు. ఈసారి టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందిన రజినీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. సోమవారంతో నామిషన్ల గడవు ముగియనుండటంతో పార్టీకి కీలకంగా మారిన స్థానాల్లో రెబల్స్‌ను పోటీ చేయకుండా చూసేందుకు మరింత మంది ఆశావాహులతో కమిటీ భేటీ కానుంది. రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌పై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని సోకాజ్ నోటీసును జారీ చేసినట్లు సమాచారం. ఆయన ఇబ్రహీంపట్నం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. -
కేసీఆర్‌పై పొన్నాల ఫైర్
జనగాం జిల్లా: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రంగా మండిపడ్డారు. జనగామలో విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మీడియా సమక్షంలో ప్రజల ముందు కేసీఆర్ చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచి కేసీఆర్ తన ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన అప్రజాస్వామికమని, అవినీతిమయ పాలన అని ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగ్గారెడ్డిని అరెస్ట్ చేయించారని, రేవంత్ రెడ్డిని కూడా అక్రమంగా ఐటీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నయీం కేసు, లారీలలో ఉన్న డబ్బు, కాగితాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మియాపూర్ భూకుంభకోణం, అయ్యప్ప సొసైటీ కుంభకోణం కేసుల సంగతి ఏమైందని సూటిగా అడిగారు. తెలంగాణ హక్కులను మోదీ దగ్గర తాకట్టు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో భారీగా చేరికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. -
తుమ్మలను పరామర్శించే తీరిక ఉంది కానీ....
మెదక్ : "సీఎం కేసీఆర్ అభద్రతకు గురవుతున్నాడు... అందుకే కరువు బారిన పడిన రైతులను పరామర్శించడం లేదు...అస్పత్రిలో ఉన్న తుమ్మలను పరామర్శించే తీరిక ఉంది.. కానీ, విద్యుత్, కరువు, వరదలతో ప్రజలు సతమతమవుతుంటే పట్టించుకోవడం లేదు... ఇతర పార్టీల నేతలను ఆకర్షించే పథకాలపైనే శ్రద్ధ చూపుతున్నా'డని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేసీఆర్ మాటకారి...మోసకారి, బుడుబుక్కల, పిట్టల దొరని ధ్వజమెత్తారు. రుణమాఫీపై కేసీఆర్ అయోమయంలో ఉండి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ వంద రోజుల పాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నాల డిమాండ్ చేశారు. సింగపూర్ వెళ్లడానికి సమయమున్న కేసీఆర్‌కు ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి సమయం లేద అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే సోనియాకు రుణపడి ఉంటానన్న కేసీఆర్... ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. -
గాంధీభవన్‌లో మళ్లీ రెచ్చిపోయిన కార్యకర్తలు
హైదరాబాద్ : గాంధీభవన్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో కార్యకర్తల మధ్య రసాభాస చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలే కారణమంటూ కార్యకర్తలు మరోసారి విరుచుకుపడ్డారు. దాంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అనుచరులకు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరినొకరు తోసుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. కాగా సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు వచ్చిన టీ-కాంగ్రెస్ నేతలకు నిన్న ఘోర పరాభవం ఎదురైంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పరాజయం పాలవడానికి టీపీసీసీ పెద్దలే కారణమంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీవల్లే పార్టీ సర్వనాశనమైంది. పాతికేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న మాలాంటి వాళ్ల నోట్లో మన్నుకొట్టారు. అయినా సిగ్గులేకుండా ఎందుకొచ్చారు? తక్షణమే రాజీనామా చేసి వెళ్లిపోండి’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహలను గాంధీభవన్‌లో నిలదీశారు. కార్యకర్తల ఆగ్రహానికి విస్తుపోయిన సదరు నేతలు చేసేదేమీ లేక తలదించుకుని వెళ్లిపోయారు.