అమెరికాలో ఆడిండ్లు ఉయ్యాలో...
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోవడం లేదు. వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, హైదరాబాద్ నగరాలకు చెందిన కొంతమంది వృత్తి, చదువురీత్యా అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రం పియోరీయోటౌన్‌లో కొన్నేళ్లుగా నివాసముంటున్నారు. అయితే సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆయా జిల్లాలకు చెందిన తెలంగాణ మహిళలు శనివారం సంబురాలు జరుపుకున్నారు. విదేశాల్లోబతుకమ్మను ఆడి తెలంగాణ సంస్కృతిని అక్కడి ప్రజలకు తెలియజేశారు. – దేవరుప్పుల..