మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎమ్టీఎఫ్) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిర్వహించిన ఈ ఉత్సవాలకు ఆస్ట్రేలియాలోని తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిచాయి.
ఉత్సవాలకు వేదికైన రిక్వెస్ట్ హాల్ తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ముస్తాబైంది. బతుకమ్మ పాటలు, కోలాటం, నృత్యాలతో వేదిక హోరెత్తింది. ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. ఎమ్టీఎఫ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సాంప్రదాయాలను భావి తరాలకు అందించేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.