Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Facts revealed in Sakshi investigation into the collusion of key leaders with Ursa1
ఊరూపేరు లేని 'ఉర్సా'

సాక్షి, అమరావతి : రూ.10,000 కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీ అంటే దాని స్థాయి ఎంత గొప్పగా ఉండాలి..? నిత్యం వేలాది మంది ఉద్యోగుల కోలాహలంతో పాటు పెద్ద ఎత్తున వ్యాపార లావాదేవీలు ఉండాలి కదా..? కానీ రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు. అంతెందుకు..? అసలది ఆఫీసే కాదు! వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం 99 పైసలకే అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత.. నాకింత! దోపిడీకి పరాకాష్ట. ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత! ఊరు పేరు లేని ‘ఉర్సా క్లస్టర్స్‌’కు విశాఖలో దాదాపు రూ.3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కారు అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కేవలం రెండు నెలల వయసు, కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్, వెబ్‌సైట్‌ కూడా లేని ఓ ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటన అనంతరం రూ.వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయడం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి.రెండు నెలలు తిరగక ముందే.. టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో..! సొంత కార్యాలయం.. కనీసం ఫోన్‌ నెంబరు కూడా లేని ఓ అనామక కంపెనీ ఏర్పాటై రెండు నెలలు తిరగక ముందే తెలుగు రాష్ట్రాల్లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామనడం.. ఆ ప్రతిపాదనకు ముచ్చట పడి చంద్రబాబు సర్కారు విశాఖలో కారు చౌకగా అత్యంత ఖరీదైన భూములు కేటాయించేయడం, ఇందుకోసం టీసీఎస్‌ని తెరపైకి తెచ్చి ఆ ముసుగులో ఎకరం 99 పైసలకే అంటూ ప్రత్యేకంగా పాలసీ తెస్తుండటంపై రాష్ట్ర ఐఏఎస్‌ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యనేతలు తమ కుట్ర అమలులో భాగంగా తొలుత టీసీఎస్‌కు ఎకరా 99 పైసలకే కేటాయించి, అదే ధరకు ఉర్సా కస్టర్స్‌కు విలువైన భూములు ధారాదత్తం చేసేలా పావులు కదిపారు. ‘ఉర్సా క్లస్టర్స్‌’ పేరుతో విశాఖలో డేటా సెంటర్, ఐటా క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించడమే తడవుగా చౌకగా భూములు కేటాయించాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రతిపాదించడం.. ఆ వెంటనే క్యాబినెట్‌లో భూ కేటాయింపులు చేయడంపై అనుమానాలు బలపడుతున్నాయి. కనీసం ఓ ఆఫీసు, ఫోన్‌ నెంబర్‌ కూడా లేని కంపెనీ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఆమోదించిందో అర్థం కావడం లేదని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. భూ కేటాయింపులకు పచ్చజెండా.. ఉర్సా క్లస్టర్స్‌ రూ.5,728 కోట్లతో విశాఖలో డేటా సెంటర్, ఐటాక్యాంపస్‌ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇందుకోసం విశాఖ మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 3లో ఐటా క్యాంపస్‌కు 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో డేటా సెంటర్‌కు 56.36 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు చేసుకున్న ఉర్సా కంపెనీ గురించి ‘సాక్షి’ పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.రెండు నెలల క్రితం పుట్టిన ఉర్సాకుమారుడేమో సాధారణ ఉద్యోగి తండ్రేమో కంపెనీకి డైరెక్టరట.. ఇంకో డైరెక్టర్‌ కథ ఇదీ.. తెలుగు రాష్ట్రాల్లో రూ.10 వేల కోట్లు పెట్టుబడులు పెడుతుందని చెబుతున్న ఉర్సా క్లస్టర్స్‌ మార్చి నెల కరెంటు బిల్లు ఇది. హైదరాబాద్‌లో కార్యాలయమే లేదు..! కేరాఫ్‌ అడ్రస్‌ ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌రూ.10,000 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థ కార్యాలయం ఎంత పెద్దగా ఉంటుందో..? వందలాది మంది ఉద్యోగులతో కోలాహలంగా ఉంటుందని ఊహించుకుంటే పప్పులో కాలేసినట్లే. టీడీపీ కూటమి సర్కారు భూ కేటాయింపులు చేయడానికి కేవలం రెండు నెలల ముందు అంటే 2025 ఫిబ్రవరి 12న ఉర్సా క్లస్టర్స్‌ హైదరాబాద్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన పెందుర్తి విజయ్‌కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న సతీష్‌ అబ్బూరి డైరెక్టర్లుగా ఈ కంపెనీ ఏర్పాటైంది. ప్లాట్‌ నెంబర్‌ 705, ఏక్తా బాసిల్‌ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్, తెలంగాణ– 500084 చిరునామాతో దీన్ని నెలకొల్పారు. అయితే ఆ చిరునామాకు వెళ్లి పరిశీలించగా... అది పూర్తిగా నివాస ప్రాంతమని తేలింది. పెందుర్తి విజయ్‌కుమార్‌కు అత్యంత దగ్గరి బంధువైన పెందుర్తి పద్మావతికి చెందిన త్రీ బెడ్‌ రూమ్‌ నివాస ఫ్లాట్‌ను ఉర్సా ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. అది పూర్తిగా రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌. ఒక్కో అంతస్తుకు నాలుగు ఫ్లాట్ల చొప్పున మొత్తం 28 ఫ్లాట్‌లున్నాయి. ఉర్సా కార్యాలయంగా పేర్కొన్న ఒక ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటోందని, అసలు అక్కడ ఐటీకి సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగడం లేదని స్థానికులు వెల్లడించారు. ఇక రూ.వేల కోట్ల పెట్టుబడులు పెడతామంటున్న ఉర్సా క్లస్టర్స్‌ వాణిజ్య విద్యుత్‌ కాకుండా గృహ విద్యుత్తు కనెక్షన్‌ను వినియోగి స్తోంది. ఆర్వోసీలో నమోదుకు సమర్పించిన ఫ్లాట్‌ నెంబర్‌ 705 విద్యుత్‌ బిల్లే దీనికి నిదర్శనం. ఉర్సా క్లస్టర్‌ కంపెనీకి కనీసం ఓ ఫోన్‌ నెంబరు గానీ వెబ్‌సైట్‌గానీ లేకపోవడం గమనార్హం. పెందుర్తి విజయకుమార్‌ తన వ్యక్తిగత ఈ మెయిల్‌ను ఆర్వోసీకి అందించారు. అమెరికాలోనూ అంతే.. లోకేశ్‌ పర్యటనకు నెల ముందు...!ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాతృసంస్థగా చెబుతున్న అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్‌ ఎల్‌ఎల్‌సీ పరిస్థితి కూడా ఇంతే. అది లిమిటెడ్‌ లయబులిటీ కంపెనీ. ఏడు నెలల క్రితం.. అంటే 2024 సెపె్టంబర్‌ 27న ఉర్సా క్లస్టర్స్‌ అమెరికాలో ఏర్పాటైంది. అమెరికాలోని డెలావర్‌లో 611, సౌత్‌ డ్యూపాంట్, హైవే సూట్, 102 డోవెర్, డీఈ 19901 చిరునామాతో ఈ కంపెనీ నమోదైంది. పెందుర్తి విజయ్‌కుమార్‌ తనయుడు కౌశిక్‌ దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అమెరికా పర్యటనకు సరిగ్గా నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటు కావడం గమనార్హం. ఇక ఈ కంపెనీ ఇప్పటి వరకు చెల్లించిన పన్ను కేవలం 300 అమెరికన్‌ డాలర్లు మాత్రమే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.25,000. అమెరికా చిరునామాతో ఉన్న ఇల్లు కూడా పూర్తిగా నివాసప్రాంతం. కేవలం 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక చిన్న కుటుంబం నివాసం ఉండటానికి అనువుగా ఉన్న ఇంటిని ఆఫీసు కార్యాలయంగా పేర్కొన్నారు. ఇక అక్కడ కూడా ఉర్సా క్లస్టర్స్‌ బోర్డు లేదు.. ఉద్యోగులు లేరు. కనీసం ఫోన్‌ నెంబర్లు లేవు. కౌశిక్‌ పెందుర్తి ప్రస్తుతం టాలస్‌ పే అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆయన లింక్డిన్‌ ఖాతా ద్వారా తెలుస్తోంది. అంటే ఆయన అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగి. మరో డైరెక్టర్‌ సతీష్‌ అబ్బూరి ఎలిసియం అనలిటిక్స్‌కు వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అలాంటి ఉర్సా కంపెనీ తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెడతామనడం, అడిగిందే తడవుగా రూ.వేల కోట్ల విలువైన భూమినికారుచౌకగా కట్టబెడుతుండటంపై పెద్ద ఎత్తున అనుమానాలు ముసురుకుంటున్నాయి.‘ఐఎంజీ భారత్‌’ను మించిన స్కామ్‌..ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 2004లో తన బినామీ బిల్లీరావు చేత ‘ఐఎంజీ భారత్‌’ అనే డొల్ల కంపెనీని పెట్టించి.. అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి.. హడావిడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి సేల్‌డీడ్‌ కూడా చేసేశారు.. అంతేకాదు శంషాబాద్‌ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్లపాటు లీజుకిచ్చేసి వాటి నిర్వహణ చార్జీలను మాత్రం ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.. ఇపుడు ‘ఉర్సా క్లస్టర్స్‌’ కంపెనీని హడావిడిగా ఏర్పాటు చేసి విలువైన భూములు కేటాయించడం చూస్తుంటే ఐఎంజీ స్కామ్‌ గుర్తుకొస్తోందని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు.

US Defence Chief Shared Yemen War Plans With Family Too Details Here2
‘యెమెన్‌ లీక్ ఎపిసోడ్‌’లో బిగ్‌ ట్విస్ట్‌

యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్‌ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్‌: సమాచారం లీక్‌ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్‌’ గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్‌ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్‌ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్‌ దాడుల షెడ్యూల్‌ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్‌ న్యూస్‌ ప్రొడ్యూసర్‌ అయిన జెన్నిఫర్‌.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్‌ స్ట్రీట్‌ జనరల్‌ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్‌.. అటు వైట్‌హౌజ్‌ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్‌’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్‌(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్‌ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్‌ చేశారని ‘అట్లాంటిక్‌ మ్యాగజైన్‌’ ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ జెఫ్రీ గోల్డ్‌బర్గ్‌ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్‌ యాప్‌ గ్రూప్‌చాట్‌లో ఈ జర్నలిస్టును యాడ్‌ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్‌ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్‌ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్‌ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్, సీఐఏ డైరెక్టర్‌ జాన్‌ రాట్‌క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్‌ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్‌ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్‌ నెంబర్‌ తన వద్ద లేదని అన్నారు. ఫోన్‌లో లేని నెంబర్‌ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్‌ మస్క్‌ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్జ్‌ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్‌ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్‌ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు.

This Is How BJP Reacts to Raj Uddhav Thackerays reunion buzz3
వదినమ్మకు చెప్పారా? అసలు ఒప్పుకుంటుందా?

మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ఓ పరిణామం.. దేశవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. రెండు దశాబ్దాలుగా రాజకీయ విరోధులుగా ఉన్న సోదరులు ఉద్దవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రేలు కలిసి పోనున్నారనేది ఆ వార్త సారాంశం. అయితే ఈ కలయిక ప్రచారాన్ని బీజేపీ ఇప్పుడు ఎద్దేవా చేస్తోంది.ముంబై: యూబీటీ సేన-ఎంఎన్‌ఎస్‌ పొత్తు అవకాశాలపై ఓ హిందీ న్యూస్ ఛానెల్‌ పాడ్‌కాస్ట్‌లో మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్‌ నారాయణ్‌ రాణే(Nitesh Narayan Rane) ఈ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఎంఎన్‌ఎస్‌తో థాక్రే శివసేన చేతులు కలపబోతోందా?. ఈ విషయంలో తన భార్య రష్మీ థాక్రే(Rashmi Thackeray) అనుమతి తీసుకున్నారో లేదో?. ఈ విషయాన్ని ఉద్దవ్‌ థాక్రేను మీరే(న్యూస్‌ యాంకర్‌ను ఉద్దేశించి..) అడగాలి. ఇలాంటి నిర్ణయాల్లో ఆమె భాగస్వామ్యమే ఎక్కువ అనే విషయం ఆయన మరిచిపోవొద్దు’’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.శివసేన నుంచి రాజ్‌ థాక్రే(Raj thackeray) నిష్క్రమణకు రష్మీనే కారణమన్న రాణే.. ఆ సమయంలో సోదరుల మధ్య ఎలాంటి విబేధాలు లేవనే విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర ప్రజలు మయూతీ కూటమికి అఖండ విజయం కట్టబెట్టారని.. కాబట్టి ఎంఎన్‌ఎస్‌, యూబీటీ శివసేన పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా.. ఇక్కడి రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపించబోదని నితీశ్‌ రాణే అన్నారు.ఈ క్రమంలో ఏక్‌నాథ్‌ షిండే-రాజ్‌ థాక్రే విందు సమావేశంపైనా రాణేకు ప్రశ్న ఎదురైంది. షిండేకు బాల్‌ థాక్రే కుటుంబానికి దశాబ్దాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. పైగా రాజ్‌ థాక్రేను బాల్‌ థాక్రేకు అంశగా షిండే భావిస్తుంటారు. అంతేగానీ వాళ్ల భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నది కాదు అని రాణే అన్నారు. మహారాష్ట్ర ప్రజలు, మరాఠీ భాష ప్రయోజనాల కోసం ఉద్ధవ్‌ థాక్రేతో కలిసి పని చేసేందుకు సిధ్ధమని ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఇందుకు ఉద్ధవ్‌ థాక్రే కూడా సానుకూలంగా స్పందించడంతో ఇరువురు ఏకం కానున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అయితే దీనిపై తాజాగా యూబీటీ సేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) మాట్లాడుతూ.. రాజకీయ పొత్తుకు సంబంధించి ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, కేవలం వీరి మధ్య భావోద్వేగ చర్చలు మాత్రమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: నా బద్ధ శత్రువుకి కూడా ఈరోజు రాకూడదు

Rare star tortoises die in Srikurmam4
కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం

గార: సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కూర్మ (తాబేలు) రూపంలో వెలసిన అరుదైన దేవాలయం.. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యస్థలిగా ఈ దివ్యక్షేత్రం భాసిల్లుతోంది. మనరాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా శ్రీకూర్మనాథుడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తుంటారు. ఇక్కడి తాబేళ్లను శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. ఆదికూర్మ క్షేత్రం కావడంతో.. తాబేళ్ల పార్కును కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ పుణ్యక్షేత్రంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. పార్కు నిర్వహణను కూటమి ప్రభుత్వం గాలికొదిలేయడంతో ఎన్నడూ లేని విధంగా శ్రీకూర్మంలో వరుసగా తాబేళ్లు మరణిస్తున్నాయి. పర్యవేక్షణ లోపమే ఇందుకు ప్రధాన కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృత్యువాత పడ్డ కూర్మాలకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉన్నా.. అవేమీ చేయకుండా వాటిని ఆలయ ఈవో కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తుండటం గమనార్హం.గత ప్రభుత్వ హయాంలో ప్రతి తాబేలుకి నంబర్‌..వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తాబేళ్ల పార్కులో ప్రతి తాబేలుకి నంబర్‌ కేటాయించేవారు. వాటి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నమోదు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. సాక్షాత్తూ దేవదేవుడు శ్రీకూర్మనాథుడిగా వెలసిన శ్రీకూర్మంలోనే వరుసగా అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడుతున్నారు.

Minister Ravneet Singh Bittu Allegations On pro-Khalistan elements5
నన్ను చంపేందుకు కుట్రలు.. కేంద్రమంత్రి సంచలన ఆరోపణలు

ఛండీగఢ్‌: తన హత్యకు ఖలిస్థానీలు కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టూ సంచలన ఆరోపణలు చేశారు. రాడికల్ ప్రచారకుడు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌ నడిపిస్తున్న ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే తన హత్యకు ప్లాన్‌ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.తాజాగా, రైల్వేశాఖ సహాయ మంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టు మాట్లాడుతూ.. పంజాబ్‌లోని రాజకీయ నాయకులకు ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. పలువురు నేతల హత్యకు వారు ప్లాన్‌ చేస్తున్నారు. ఖలిస్తానీల ప్లాన్‌ గురించి సోషల్‌ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్‌ షాట్ల ద్వారా ఈ విషయం నాకు తెలిసింది. ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌ నడిపిస్తున్న ‘వారిస్‌ పంజాబ్‌ దే’ సంస్థతో సంబంధమున్న ఖలిస్థానీ మద్దతుదారులే ఇందులో ఉన్నారు. నాతో పాటుగా మరికొంతమంది రాజకీయ నాయకుల ప్రాణాలకు కూడా ఖలిస్థానీయుల నుంచి ముప్పు పొంచి ఉంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపై కూడా వారిస్‌ పంజాబ్‌ దే నాయకులు కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృత్‌పాల్‌ నిర్బంధం మరో ఏడాది పొడిగించడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. అందుకే ఈ గ్రూపుతో సంబంధం ఉన్న ఖలిస్తానీ శక్తులను పంజాబ్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.అయతే, గతంలో దిబ్రుగఢ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ సహచరులను పంజాబ్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇది ప్రధాన కుట్రదారుడిగా అమృత్‌పాల్ పాత్రపై అనుమానాలను మరింత బలపరుస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కార్యకర్తలుగా మారువేషంలో ఉన్న నేరస్థుల పట్ల పంజాబ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.

BJP MP Nishikant Dubey Ex Poll Body Chief SY Quraishi6
ఈసీ కాదు.. ముస్లిం కమిషనర్‌.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఢిల్లీ: ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో, ఎంపీల వ్యాఖ్యల దుమారం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఇంతకుముందు, సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అంటూ నిశికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యల వేడి తగ్గకముందే.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాజాగా మాజీ చీఫ్ ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ‌పై బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో దూబే మాట్లాడుతూ..‘ఖురేషీ సీఈసీగా ఉన్నప్పుడు జార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాలో బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఓటర్‌ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు.. ముస్లిం కమిషనర్‌. చరిత్ర ప్రకారం క్రీ.శ 712 సంవత్సరంలో దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని, అప్పటిదాకా ఈ భూభాగం అంతా హిందువులు, గిరిజనులు, జైనులు, బౌద్ధులదే. అంతేకాదు, దేశాన్ని ఐక్యంగా ఉంచండి. చరిత్రను చదవండి. అప్పట్లో దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను సృష్టించారు. ఇకపై విభజన ఉండదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే,ర నిశికాంత్‌ దూబే జార్ఖండ్‌లోని గోడ్డా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు సుప్రీంకోర్టును టార్గెట్‌ చేసిన దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టే చట్టాలు చేస్తే ఇక పార్లమెంటు భవనాన్ని మూసుకోవాల్సిందే అన్నారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు చొరబడుతున్నాయని, చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని విమర్శించారు. జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందన్నారు. ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదని, పార్లమెంటుకు మాత్రం కాదని తెలిపారు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.Muslim Commissioner: BJP's Nishikant Dubey now targets former poll panel chiefNishikant Dubey criticises former poll panel chief over Waqf ActAccuses SY Quraishi of legitimising #BangladeshiInfiltratorsBJP distanced itself from Dubey's remarks on judiciary pic.twitter.com/Q1zhgZBL4X— The Contrarian 🇮🇳 (@Contrarian_View) April 20, 2025

Story on IAS Smita Sabharwal Now In Controversy7
Smita Sabharwal: స్మిత సబర్వాల్‌ ధిక్కార స్వరం!

సాక్షి, హైదరాబాద్‌: కంచె గచ్చిబౌలి భూముల వ‍్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ధిక్కార స్వరాన్ని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ మరింత పదునుపెట్టారు!. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐతో రూపొందించిన ఓ ఫేక్‌ ఫోటోను ‘హాయ్‌ హైదరాబాద్‌’ అనే హాండిల్‌ గత మార్చి 31న సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేయగా, ఈ పోస్టును స్విత సబర్వాల్‌ షేర్‌ చేశారు.హెచ్‌సీయూలో ఉన్న మష్రూమ్‌ రాక్‌, దాని ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు, వాటి ముందు నెమలి, రెండు జింకలతో ‘గిబీ‍్ల ఆర్ట్‌’ తరహాలో ఏఐతో రూపొందించిన ఆ చిత్రానికి ‘సేవ్‌ హెచ్‌సీయూ..సేవ్‌ హైదరాబాద్‌ బయోడైవర్సిటీ’ వంటి నినాదాలను జోడించి ‘హాయ్‌ హైదరాబాద్‌’ పోస్టు చేయగా, బాధ్యతయుతమైన పదవిలో ఉండి స్మిత సబర్వాల్‌ పోస్టు చేయడం ప్రభుత్వానికి రుచించలేదు. ఈ వ‍్యవహారంలో గచ్చిబౌలి పోలీసులు ఆమె నుంచి వివరణ కోరుతూ ఈ నెల 12న నోటిసులు జారీ చేయగా, ఆమె తగ్గేదే లే అంటూ తన సోషల్‌ మీడియా యాక్టివిజాన్ని కొనసాగిస్తున్నారు. ‘చట్టానికి కట్టుబడి ఉండే పౌరురాలిగా గచ్చిబౌలి పోలీసులకు సంపూర్ణ సహకారం అందించాను. భారతీయ నాగరిక సురక్ష సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌) చట‍్టం కింద ఇచి‍్చన నోటిసులకు నా స్టేట్మెంట్‌ను ఈ రోజు ఇచ్చారు.ఆ పోస్టును 2వేల మంది షేర్‌ చేశారు. వారందరిపై ఇదే తరహాలో చర్యలకు ఉపక్రమించారా? అని స్పష్టత సైతం కోరిన. ఒక వేళ చర్యలు తీసుకోకుంటే, కొందరిని లక్ష్యంగా చేసుకోడం ఆందోళనకలిగించే అంశం. చట్టం ముందు సమానత్వం, తటస్థట వంటి సూత్రాల విషయంలో రాజీపడినట్టు అర్థం అవుతుంది.’ అని ఆమె శనివారం ‘ఎక్స్‌’ వేదికగా కొత్త పోస్టు పెట‍్టడంతో మరింత వేడి రాజుకుంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ‍్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలకు సంబంధించిన వార్తను సైతం కొన్ని రోజుల ముందు షేర్‌ చేశారు.‘ప్రభుత్వం ధ్వంసం చేసిన 100 ఎకరాల్లో పచ్చదనాన్ని పునరుద్ధరించడానికి ప్రణాళికతో రండి. లేకుంటే అధికారులు జైలుకు వెళ్లక తప్పదు’ అని సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వాఖ్యాలు ఆ వార్తలో ఉండడం గమనార్హం. ఈ వ్యవహారంలో తనకు పోలీసులు నోటిసులు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా కొందరు చేసిన పోస్టులను సైతం ఆమె షేర్‌ చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డిని అసభ్య పదజాలంతో ఓ వృద్ధుడు దూషిస్తున్న వీడియో పోస్టు చేసినందుకు గాను ఇటీవల అరెస్టై విడుదలైన ‘యూట్యూబ్‌’ మహిళా జర్నలిసు‍్ట రేవతి సైతం స్మిత సబర్వాల్‌కు మద్దతుగా ‘ఎక్స్‌’లో ఓ పోస్టు పెట్టగా, దానిని సైతం ఆమె షేర్‌ చేశారు. ఈ మొత్తానికి ఈ వ్యవహారంలో స్మిత సబర్వాల్‌ పంతం వీడకుండా తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తుండడం గమనార్హం. ఆమెకు బీఆర్‌ఎస్‌ మద్ధతుదారులు మద్దతు తెలుపుతుండగా, కాంగ్రెస్‌ మద్దతుదారులు తీవ్రంగా ట్రోల్‌ చేస్తున్నారు.వివాదాలు కొత్త కాదు... స్మితా సబర్వాల్‌ ఇటీవల కాలంలో సోషల్‌ మీడియా యాక్టివిజంతో తరుచూ వార్తల్లో ఉంటున్నారు. బిల్కీస్‌ బాను సామూహిక అత్యాచారం కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆమె చేసిన పోస్టులు వైరల్‌ అయ్యాయి. బీజేపీ మద్ధతుదారులు ఆమెకు వ్యతిరకంగా అప్పట్లో తీవ్రంగా ట్రోల్‌ చేశారు. ఇక నకిలీ వికలాంగ సర్టిఫికేట్‌తో పూజా ఖేద్కర్‌ అని యువతి ఐఏఎస్‌ కావడం ఇటీవల తీవ్ర వివాదస్పదమైంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారుల నియామకాల్లో వికలాంగుల కోటాను వ్యతిరేకిస్తూ ఆమె పెట్టిన పోస్టులను చాలా మంది తప్పుబట్టారు. ఐఏఎస్‌లు కఠోర శ్రమ చేయాల్సి ఉంటుందని, వికలాంగులతో సాధ్యం కాదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేయగా, వికలాంగ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఆమెకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేయగా, ఆమె వ‍్యక్తిగత స్థాయిలో చేసిన వ్యాఖ్యాలకు చర్యలు తీసుకోలేమని కోర్టు కొటి‍్టవేసింది.ఓడిన వారి కోసమేనా ఏడ్పు..? : సీఎం సీపీఆర్వో ప్రశ్నస్మిత సబర్వాల్‌ వ్యవహారంపై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యప్రజాసంబంధాల అధికారి(సీపీఆర్వో) బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. స్మిత సబర్వాల్‌ పేరును ప్రస్తావించకుండా ఆమె వైఖరీని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు. ‘ఆ ఐఏఎస్‌ అధికారి ‘దృష్టికోణం’లో మార్పు ఎందుకు వచ్చినట్టు? అధికార మార్పిడి జరిగితే అభిప్రాయాలు మారోచ్చా? అప్పుడు(బీఆర్‌ఎస్‌ హయాంలో) ముఖ్యమంత్రి కార్యాలయంలో నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా అడవులను నరికించి, వన్యప్రాణులను తరమింది వీరే.ఇప్పుడు తప్పుబట్టడంలో మర్మం ఏందో ?. అసలు ఏడుపు వన్యప్రాణుల కోసమా? అధికారం కోల్పోయిన(బీఆర్‌ఎస్‌) వారి కోసమా?’ అని బోరెడ్డి ఆయోధ్య రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో స్మిత సబర్వాల్‌ జరిగిన మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 25లక్షల చెట్టను నరికివేశారని, పర్యావరణ అనుమతులు లేకుండా మిషన్‌ భగీరథ పనులు చేపట్టారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలను ఈ సందర్భంగా షేర్‌ చేస్తూ ఆమె ద్వంద వైఖరీని ప్రశ్నించారు. ఆమె వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.-మహమ్మద్‌ ఫసియుద్దీన్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌, సాక్షి

End Of Salaried Middle Class Says Market Expert8
ప్రమాదంలో మిడిల్ క్లాస్ ఉద్యోగాలు!

బాగా చదువుకుని ఉద్యోగం చేయాలి, జీవితం సెటిల్ అవ్వాలని చాలామంది చిన్నప్పటి నుంచే చెబుతూ ఉంటారు. ఆ మాటలనే వింటూ.. డిగ్రీలు పూర్తి చేసుకుని ఏదో ఒక కంపెనీలో చేరి.. నెలనెలా జీతాలు తీసుకుంటూ కాలం గడుపుతున్న ఉద్యోగులు కోకొల్లలు. ఇలాంటి ఉద్యోగులంతా.. ప్రమాదంలో ఉన్నారని, అలాంటి ఉద్యోగాలు కనుమరుగవుతాయని.. పోర్ట్‌ఫోలియో - మేనేజ్‌మెంట్ సర్వీస్ కంపెనీ మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, మార్కెట్ ఎనలిస్ట్ 'సౌరభ్ ముఖర్జియా' అన్నారు.'బియాండ్ ది పేచెక్: ఇండియాస్ ఎంటర్‌ప్రెన్యూర్ రీబర్త్' అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. భారతదేశం కొత్త ఆర్థిక దశలోకి ప్రవేశించింది. జీతాలపైన జీవించే మధ్యతరగతి వర్గం కనుమరుగవుతుంది అన్నారు. మంచి చదువులు చదివి, కష్టపడి పనిచేసేవారికి జీతాలిచ్చే కంపెనీలు తగ్గిపోతాయి.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్‌ పూర్‌ డాడ్‌ రచయితఇప్పుడు దాదాపు చాలా కంపెనీలలో ఆటోమిషన్, ఏఐ ద్వారానే పనులు పూర్తిచేస్తున్నారు. దిగ్గజ టెక్ కంపెనీ గూగులే సైతం తన కోడింగ్‌లో మూడోవంతును ఇప్పటికే 'ఏఐ'కు అప్పగించింది. రాబోయే రోజుల్లో ఇండియన్ ఐటీ, మీడియా, ఫైనాన్సింగ్ రంగాలు కూడా ఇదే విధానం పాటిస్తాయి. కాబట్టి ఉద్యోగాలు చాలావరకు కనుమరుగవుతాయని ముఖర్జియా పేర్కొన్నారు.టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందడం కూడా.. ఉద్యోగాలు కోల్పోవడానికి ప్రధాన కారణం అవుతోంది. కాబట్టి జీతం మీదనే బతకాలనే విధానం మార్చుకోవాలి. మనది డబ్బు మీద ఆధారపడిన సమాజం. సక్సెస్ అంటే డబ్బు అనే చాలామంది చెబుతారు. ఇది మారాలి. తల్లిదండ్రులు కూడా.. తమ పిల్లలను ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యం అన్నట్టు పెంచకూడదని సౌరభ్ ముఖర్జియా స్పష్టం చేశారు.

Indian star players Virat Kohli and Rohit Sharma have flourished9
IPL 2025: ఇటు రోహిత్‌.. అటు కోహ్లి

భారత స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ విజృంభించారు. భారీ షాట్లతో అలరిస్తూ ఆదివారం అభిమానులకు డబుల్‌ ధమాకా అందించారు. పంజాబ్‌ కింగ్స్‌తో పోరులో కోహ్లి క్లాసిక్‌ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా... చెన్నైతో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఊర మాస్‌ షాట్లతో చెలరేగిపోయాడు. ఫలితంగా పంజాబ్‌పై బెంగళూరు బదులు తీర్చుకోగా... చెన్నైపై ముంబై ఇండియన్స్‌ భారీ విజయం నమోదు చేసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఓ మాదిరి ప్రదర్శనతో సరిపెట్టుకున్న రోహిత్‌... తనను ‘హిట్‌మ్యాన్‌’ ఎందుకు అంటారో వాంఖడేలో నిరూపించాడు. విరాట్‌ దూకుడుతో బెంగళూరు పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లగా... రోహిత్‌ మెరుపులతో ముంబై నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా తొలి ఓవర్‌లోనే క్రీజులో అడుగుపెట్టిన ఈ ఇద్దరూ చివరి వరకు అజేయంగా నిలిచి తమ జట్లను గెలిపించడం కొసమెరుపు.ముంబై: సిక్స్‌... ఫోర్‌... ముంబై ఇన్నింగ్స్‌ మొత్తం ఇదే తీరు! బంతి పడటమే ఆలస్యం బౌండరీ వెళ్లెందుకు ఓసారి, సిక్స్‌ అయ్యేందుకు మరోసారి బంతి అదేపనిగా ముచ్చట పడిందనిపించింది. ‘హిట్‌మ్యాన్‌’ రోహిత్‌ శర్మ, టి20 స్పెషలిస్ట్‌ సూర్యకుమార్‌ల ఆట మ్యాచ్‌లో హైలైట్స్‌ను చూపించలేదు. హైలైట్సే మ్యాచ్‌గా మార్చేసింది. దీంతో ముంబై 177 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. చెన్నైపై 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ముందుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. జడేజా (35 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 15.4 ఓవర్లలో 1 వికెట్‌ మాత్రమే కోల్పోయి 177 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ (45 బంతుల్లో 76 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్య (30 బంతుల్లో 68 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) హోరెత్తించారు. దంచేసిన జడేజా, దూబే ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌ (20 బంతుల్లో 19; 1 ఫోర్‌)కు ఓపెనింగ్‌లో అవకాశమిస్తున్న ధోనిని నిరుత్సాహపరిచాడు. పవర్‌ప్లేలో 20 బంతులాడి కూడా ఒకే ఒక్క బౌండరీ బాదాడు. రచిన్‌ రవీంద్ర (5) విఫలమవగా, 17 ఏళ్ల ‘లోకల్‌ బాయ్‌’ ఆయుశ్‌ మాత్రే (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. తర్వాత వచ్చిన జడేజా, దూబే భారీషాట్లు బాదడంతో చెన్నై పుంజుకుంది. ఇద్దరు నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. సిక్స్‌లు బాదిన దూబే 30 బంతుల్లో, జడేజా 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధోని (4)ని బుమ్రా ఎంతో సేపు నిలువనీయలేదు. బాదుడే... బాదుడు రోహిత్‌ శర్మకు జతగా ఓపెనింగ్‌ చేసిన రికెల్టన్‌ తొలి ఓవర్లోనే బౌండరీలతో తమ ఉద్దేశం చాటగా, రెండో ఓవర్‌ నుంచి రోహిత్‌ విరుచుకుపడటంతో చెన్నై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు బాదాడు. జేమీ ఓవర్టన్‌ ఓవర్‌న్నర (9 బంతులు) వేసిన ఐదో ఓవర్లో రికెల్టన్, రోహిత్‌ చెరో సిక్స్‌ కొట్టడంతో 18 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో 62 పరుగులు చేసిన ముంబై తర్వాతి ఓవర్లోనే రికెల్టన్‌ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. సూర్యకుమార్‌ రావడం... రోహిత్‌తో కలిసి ధనాధన్‌ షోను డబుల్‌ చేసింది. ఇద్దరు బౌండరీలు, సిక్సర్లు కొట్టేందుకు పోటీపడటంతో స్టేడియం హోరెత్తింది. ముందుగా ‘హిట్‌మ్యాన్‌’ 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... సూర్య 26 బంతుల్లో అర్ధసెంచరీ అధిగమించాడు. ఇద్దరు బంతిని అదేపనిగా బౌండరీలైన్‌ను దాటిస్తూనే ఉండటంతో లక్ష్యం ముంబై వైపు నడిచివచ్చింది.స్కోరు వివరాలు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: షేక్‌ రషీద్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) సాంట్నర్‌ 19; రచిన్‌ (సి) రికెల్టన్‌ (బి) అశ్వని 5; ఆయుశ్‌ (సి) సాంట్నర్‌ (బి) దీపక్‌ చహర్‌ 32; జడేజా (నాటౌట్‌) 53; దూబే (సి) జాక్స్‌ (బి) బుమ్రా 50; ధోని (సి) తిలక్‌ (బి) బుమ్రా 4; జేమీ ఓవర్టన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–16, 2–57, 3–63, 4–142, 5–156. బౌలింగ్‌: చహర్‌ 4–0–32–1, బౌల్ట్‌ 4–0–43–0, అశ్వని 2–0–42 –1, సాంట్నర్‌ 3–0–14–1, బుమ్రా 4–0–25–2, విల్‌ జాక్స్‌ 1–0–4–0, హార్దిక్‌ 2–0–13–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) ఆయుశ్‌ (బి) జడేజా 24; రోహిత్‌ (నాటౌట్‌) 76; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (15.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 177. వికెట్ల పతనం: 1–63. బౌలింగ్‌: ఖలీల్‌ 2–0–24–0, ఓవర్టన్‌ 2–0– 29–0, అశ్విన్‌ 4–0–25–0, జడేజా 3–0–28–1, నూర్‌ 3–0–36–0, పతిరణ 1.4–0–34–0. ముల్లాన్‌పూర్‌: ముందు బౌలర్లు, తర్వాత బ్యాటర్లు రాణించడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు తమ సొంతగడ్డపై పొగొట్టుకున్న ఫలితాన్ని పంజాబ్‌కు వెళ్లి రాబట్టుకుంది. ఐపీఎల్‌ 18వ సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. జోష్‌ ఇన్‌గ్లిస్‌ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), శశాంక్‌ సింగ్‌ (33 బంతుల్లో 31; 1 ఫోర్‌) మెరుగ్గా ఆడారు. కృనాల్, సుయశ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కోహ్లి (54 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరిపించాడు. కోహ్లి ఆఖరిదాకా... పెద్ద లక్ష్యం కాకపోయినా... బెంగళూరు జట్టు తమ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (1) వికెట్‌ను తొలి ఓవర్లోనే కోల్పోయింది. పంజాబ్‌కు దక్కింది ఈ ఆరంభ సంబరమే! అటు తర్వాత కథంతా కింగ్‌ కోహ్లి, పడిక్కల్‌ నడిపించారు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ పడిక్కల్‌ భారీ సిక్సర్లతో విరుచుకుపడగా... కోహ్లి క్లాసిక్స్‌ షాట్‌లతో ముల్లాన్‌పూర్‌ ప్రేక్షకుల్ని గెలిచాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 103 పరుగులు జోడించారు. పడిక్కల్‌ అవుటైనా... ఆఖరిదాకా క్రీజులో నిలబడిన కోహ్లి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 22; ప్రభ్‌సిమ్రాన్‌ (సి) డేవిడ్‌ (బి) కృనాల్‌ 33; అయ్యర్‌ (సి) కృనాల్‌ (బి) షెఫర్డ్‌ 6; ఇన్‌గ్లిస్‌ (బి) సుయశ్‌ 29; నేహల్‌ (రనౌట్‌) 5; శశాంక్‌ (నాటౌట్‌) 31; స్టొయినిస్‌ (బి) సుయశ్‌ 1; యాన్సెన్‌ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–42, 2–62, 3–68, 4–76, 5–112, 6–114. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–26–0, యశ్‌ దయాళ్‌ 2–0–22–0, హాజల్‌వుడ్‌ 4–0–39–0, కృనాల్‌ పాండ్యా 4–0–25–2, షెఫర్డ్‌ 2–0–18–1, సుయశ్‌ 4–0–26–2. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (సి) ఇన్‌గ్లిస్‌ (బి) అర్ష్ దీప్ 1; కోహ్లి (నాటౌట్‌) 73; పడిక్కల్‌ (సి) నేహల్‌ (బి) హర్‌ప్రీత్‌ 61; పాటీదార్‌ (సి) యాన్సెన్‌ (బి) చహల్‌ 12; జితేశ్‌ శర్మ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.5 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–6, 2–109, 3–143. బౌలింగ్‌: అర్ష్ దీప్ 3–0–26–1, జేవియర్‌ 3–0–28–1, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4–0–27–1, యాన్సెన్‌ 3–0–20–0, చహల్‌ 4–0–36–1, స్టొయినిస్‌ 1–0–13–0, నేహల్‌ 0.5–0–9–0. ఐపీఎల్‌లో నేడుకోల్‌కతా X గుజరాత్‌ వేదిక: కోల్‌కతారాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Lawrence Bishnoi Target Other Bollywood Actor And His Wife10
నీ భార్య క్షమాపణ చెప్పాలి.. మరో హీరోకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ హెచ్చరిక

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌(Lawrence Bishnoi) నుంచి బాలీవుడ్‌కు చెందిన మరో హీరోకు హత్య బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు జరిపినట్లే నటుడు అభినవ్ శుక్లా( Abhinav Shukla)ఇంటిపై కూడా దాడులు జరుపుతామంటూ బెదిరింపులకు దిగారు. త్వరలో చంపేస్తామంటూ ఒక హెచ్చరికతో మెసేజ్‌ పంపారు. అయితే, ఈ మెసేజ్‌ను సోషల్‌మీడియా యూజర్‌ పంపినట్లు తెలుస్తోంది. తాను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కోసం పనిచేస్తున్నాని ఈ హెచ్చరికలు వారికి జారీ చేశాడు.కారణం ఇదే..నటుడు అభినవ్ శుక్లా సతీమణి రుబీనా వల్లే ఈ వార్నింగ్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ టీవీలో ప్రసారం అయ్యే 'బాటిల్‌గ్రౌండ్' షోలో ఆమె పాల్గొంది. అయితే, ఆ షో కొనసాగుతున్న మధ్యలో రాపర్ ఆసిమ్ రియాజ్‌తో ఆమెకు గొడవ అయింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపుల మెసేజ్‌ వచ్చింది. ఎపిసోడ్ ప్రసారం అయిన వెంటనే.. ఆమెతో పాటు అభినవ్‌ను ఆన్‌లైన్‌లో లక్ష్యంగా చేసుకుని భారీగా వార్నింగ్స్‌ వచ్చాయి. వారికి వచ్చిన మెసేజ్‌లను శుక్లా తన సోషల్‌మీడియా హ్యాండిల్‌లో వరుస స్క్రీన్‌షాట్‌లు, వీడియోలను పంచుకున్నారు, అందులో అంకుష్ గుప్తా అనే వ్యక్తి ఈ బెదిరింపు మెసేజ్‌ పంపినట్లు కనిపిస్తోంది.అభినవ్‌ శుక్లా దంపతులకు పంపిన ఆ మెసేజ్‌ ఇలా ఉంది. 'నేను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి వచ్చాను. మీ చిరునామా నాకు తెలుసు. నేను రావాలా..? సల్మాన్ ఖాన్‌పై కాల్పులు జరిపినట్లే, నేను మీ ఇంటికి వచ్చి AK-47తో మిమ్మల్ని కాల్చివేస్తాను. ఇది మీ చివరి హెచ్చరికగా భావించండి. ఆసిమ్‌కు వెంటనే క్షమాపణలు చెప్పండి. అలా జరగలేదంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. లారెన్స్ బిష్ణోయ్ ఆసిమ్‌కు అండగా నిలుస్తాడు. ఆసిమ్‌ మా గ్యాంగ్‌ మనిషి' అని ఉంది. వార్నింగ్‌ ఇచ్చిన వ్యక్తిది చండీగఢ్‌లా ఉందని అభినవ్ తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పుకొచ్చాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement