తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ అంబరాన్నంటాయి. స్థానిక సంబవాంగ్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 4వేల మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ ఏడాది బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజన్య, పద్మజ నాయుడు వ్యవహరించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా టీసీఎస్‌ఎస్ ప్రత్యేకంగా నిర్మించిన సింగపూర్ బతుకమ్మ సింగారాల బతుకమ్మ నిలిచింది.
ఈ సందర్బంగా అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ,కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర‍్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..బతుకమ్మ సంబురాలను విజయవంతం చేడయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment