batukamma celebrations
-
ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను గణంగా నిర్వహించారు . డబ్లిన్ నగరంలో 30 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు మరియు నలభై మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరుపుటకు ప్రతి సంవత్సరం సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 900 మంది హాజరయ్యారు. ఈ వేడుకలో అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు మేజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రి రుచికరమైన వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు, దాతలు సిల్వెని శ్రీనివాస్, ప్రభోద్ మేకల, కోలన్ కమలాకర్ రెడ్డి, జగన్ మేకల, సాగర్ సిద్ధం, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి యాలుక, షరీష్ బెల్లంకొండ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్ అల్లే, వెంకట్ తిరుకోవలురు, సుమంత్ చావా, ప్రవీణ్లాల్, రామకృష్ణ కాటేపల్లి, రాజా రెడ్డి, బాచి రెడ్డి, నగేష్ పొల్లూరు, శశిధర్ మర్రి, శ్రీధర్ రాపర్తి, రవి కిరణ్ కుంచనపల్లి, బలరాం కొక్కుల, సునీల్ పాక, శంకర్ బెల్లంకొండ, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ కార్ఫె, శ్రీనివాస్ అల్లంపల్లి, పటేల్ శ్రీనివాస్, శ్రీనివాస్ వెచ్చ, దయాకర్ కొమురెల్లి, సంతోష్ పల్లె, శ్రీధర్ యమసాని, నరేందర్ గూడ, సంపత్ రాజ్, భాను సామ, భాను ప్రకాష్ నడుకుడ, భాను బొబ్బల, కృష్ణ మోహన్ రెడ్డి, గోపి కల్లూరి, అరవింద్ కరింగుల, ఓం ప్రకాష్, రామ బొల్లగొని, రాకేష్ ఆకుల, విజేయేందర్ సంతపూరు, మధు పోలం, మహేష్ అలిమెల్ల, కళ్యాణ్ కుసుమ, వినోద్ నీలం, శంకర్ కురుగుంట్ల, లింగమూర్తి, ప్రకాష్ గుండవేని, అరుణ్ కథేరీ, సంతోష్ పారేపల్లి, శ్రీధర్ మేడిశెట్టి, వెంకట్ మంచుకొండ, సాయినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొసనం, వెంకట్ రామిడి, సురేష్ వసుకుల, విద్యనాథ్ మాదారపు, ఉపేందర్ గార్లపాటి, అనిల్ దుగ్యాల, వీరకుమార్ తిక్క, ప్రకాష్ గందె, రవికాంత్ దూలం, త్రినేష్ అందుర్తి, భువనేశ్వర్ రెడ్డి, సంకీర్త్ రెడ్డి .(చదవండి: యూకేలో రీడింగ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనం) -
అంబరాన్నంటిన సింగపూర్ తెలుగు సమాజం బతుకమ్మ సంబరాలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను పేర్చి, జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి సందడి చేశారు. సింగపూర్ స్థానికులు కూడా ఈ వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. తెలుగువారంతా మమేకమై ఈ సంబరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో విజయవంతంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.అందంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రదానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని.. గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ పేర్కొన్నారు. కుంభకర్ణ, Mr.బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఆన్ లైన్ ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి , ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. -
TG: సచివాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు అద్దంపట్టేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లోసెక్రటేరియట్లోని ఉన్నతాధికారుల నుంచి అన్నిస్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. -
ముంబైలో ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు
సాక్షి,ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. నగరంతోపాటు వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, థాణే, భివండీ, సోలాపూర్లలో నివసించే తెలుగు ప్రజలు బుధవారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో దసరా వేడుకలకు స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను పూజించిన తెలంగాణ మహిళలు బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉల్లాసంగా గడిపారు. ఉత్సవాల నేపథ్యంలో ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. మరోవైపు శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా, గుజరాతీలు పూజా కార్యక్రమాలతో పాటు ‘గర్భా’, దాండియాల్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. సద్దుల బతుకమ్మతో ముగింపు...తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుళ్లకు పువ్వులతో పూజలు చేయడం సహజం కానీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో విడదీయలేని భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల, రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి వాటికే పూజలు నిర్వహించడం విశేషం. ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించిన మహిళలు చివరి రోజున భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుని బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. రద్దీగా దేవీ ఆలయాలు... దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్షి్మదేవి తదితర అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, మావూర్లోని రేణుకా మాత, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవి ఆలయాలతో పాటు అదే విధంగా ముంబైలోని మహాలక్షి్మ, ముంబాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి మందిరాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. కాగా శరన్నవరాత్రుల తొలిరోజునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం భద్రతా ఏర్పాట్లతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలను కల్పించడంలో ఆలయ కమిటీలు నిమగ్నమయ్యాయి. నాయిగావ్ పద్మశాలీ యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో...దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలీ యువక సంఘానికి చెందిన మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక తెలుగు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజించారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా అక్టోబరు 5నకోలాటం, దాండియా, అక్టోబరు 10నసద్దుల బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు తెలిపారు. ఈసంబరాల్లో ఉత్తమ బతుకమ్మను పేర్చిన, చూడచక్కని బతుకమ్మ అడిన మహిళలకు, బాల బాలికలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సంఘం మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులుఅడ్డగట్ల ఐశ్వర్య, గుజ్జరి జానవి, కస్తూరి సావిత్ర, మహేశ్వరం సాక్షి, సీత రేఖలతో పాటు స్థానిక మహిళలు, బాలికలుపెద్దఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో... పశి్చమ గోరెగావ్, హనుమాన్ నగర్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరూ తీరొక్క పూలను అందంగా పేర్చి బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘం కమిటీ అధ్యక్షుడు మల్లేష్ ప్రధాన కార్యదర్శి స్వామి లెంకలపల్లి, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటిపాక, నరసింహా బినమోని, కోశాధికారి గణేష్ మచ్చ, నరసింహ నాయక్, శ్రీనివాస్ రెడ్డి మన్నే. సహాయ కార్యదర్శులు బద్దం శంకర్, లక్ష్మణ్ ఎర్ర, మల్లేష్ సురి్వ, సలహాదారులు పరమేష్ నర్సిరెడ్డి, మన్నే జనార్దన్, మల్లేష్ గాదె, కృష్ణ కురుపాటి, శ్రీను కిష్టం, జాని స్వామి, వెంకటేష్ .వి, రాములు, నర్సింహ్మ ఎర్ర, శంకర్ బాబు, శంకర్ .డి, బిక్షం యాదయ్య, ఎ స్వామి, రంగనాధం,లింగయ్య జి, సుధాకర్ రెడ్డిలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో... దహిసర్ నవగాం, హనుమాన్ టేకిడి ప్రాంతంలోని శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు, ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ముంబై అంటాప్ హిల్ చర్చి సమీపంలోని మరియమ్మ మందిరంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ... బుధవారం నవీముంబైలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాదిరెడ్డి కొండారెడ్డిని తెలుగు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి. ఉపాధ్యక్షుడు బి. సుబ్రమణ్యం. కే. వరలక్ష్మి, వహీదా షేక్ ఘనంగా సన్మానించారు. చిరాగ్ నగర్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో... ఘాట్కోపర్,చిరాగ్నగర్లోని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మఆడుకున్నారు. శివాజీ నగర్, గీతాంజలి గార్డెన్లో...దహిసర్ ప్రాంతంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తెలుగువారు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. శివాజీ నగర్ ప్రాంతంలోని గీతాంజలి గార్డెన్లో బతుకమ్మ పండుగ సంబరాలు తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పానుగుళ్ల వసుమతి, తేజస్విని కుకడపు, కవిత నందిపాటి, దీపిక పానుగుళ్ల, శిరీష జాల, మమత చినాల, లావణ్య కుకడపు, రేణుక గోగు, రేణుక, బాల కందే తదితరులు పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో...తూర్పు డోంబివలి, పలావా ఫేజ్ 2లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరిగింది. మొట్టమొదటిసారి జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాకినాకాలో... సాకినాకాలోని పోచమ్మ గుడి వద్ద తెలుగు ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలుఘనంగా ‘ఎంగిలి పూల బతుకమ్మ’ సంబరాలు -
Dussehra 2024 : అద్భుత దసరా వేడుక చూడాలంటే, కోరిక నెరవేరాలంటే!
దసరా వచ్చిందంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఆగమేఘాల మీద సొంతూర్లకు చేరిపోతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుక చేసుకుంటారు. ఏమూలన ఉన్నా భారతీయులు అత్యంత ఉత్సాహంగా చేసుకునే ప్రముఖమైన పండుగ దసరా. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో జగన్మాతను ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దసరా ఉత్సవాలు అనగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బెజవాడ, వరంగల్‌తో పాటు కోల్‌కతా, మైసూరు, ఢిల్లీ, కులు ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవుల సందడి ఉండనే ఉంటుంది. అందుకే కోరిన కోర్కెలను నెరవేర్చే జగన్మాతను దర్శనంతో తరించే పుణ్యక్షేత్రాలను చూద్దాం.ఇంద్రకీలాద్రివిజయవాడలోని ఇంద్ర కీలాద్రిఫై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఉంటాయి. వివిధ రూపాల్లో అత్యంత మనోహరంగా అలంకరించే అమ్మవారిని దర్శించుకునేందుకు జనం క్యూ కడతారు. చివరి రోజు నిర్వహించే సంబరాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇంకా శ్రీశైలం, తిరుపతి లాంటి పుణ్య క్షేత్రాలు దసరా పదిరోజులూ ప్రత్యేక సందడి ఉంటుంది.బతుకమ్మతెలంగాణాలో పూల పండగు బతుకమ్మ సంబరాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు గౌరీమాతను ఆరాధిస్తారు. బతుకమ్మ ఆటపాటలతో ఊరూ వాడా మార్మోగిపోతాయి. గునుగు, తంగేడు, బంతి, గుమ్మడి ఇలా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అందంగా ముస్తాబైన ఆడబిడ్డలు ఆడిపాడతారు. రోజొక్క తీరు తొమ్మిదిరోజుల పాటు గౌరమ్మకుమొక్కి చివరి రోజు గంగలో నిమజ్జనం చేస్తారు.కోల్‌కతా దుర్గాపూజపశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో దుర్గా పూజ వేడుకలతో శరన్నవరాత్రులను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. . అమ్మవారు స్వయంగా ఇలకు దిగివస్తుందని ఇక్కడి వారి నమ్మకం. అందుకే పుట్టింటికి వచ్చి ఆడబిడ్డలా అపురూపంగా భావిస్తారు.సిలిగురి, జల్పైగురి, బీర్భూమ్ , బంకురా వంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు చూడాలంటే రెండు కళ్లూ చాలవు. మైసూర్ దసరా ఊరేగింపుకర్ణాటక రాష్ట్రంలో నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజుల పాటు నిర్వహిస్తారు. ముఖ్యంగా 500 ఏళ్ల చరిత్ర గల మైసూరు దసరా వేడుకలు చాలా ప్రత్యేకం. మైసూర్ ప్యాలెస్ నుంచి బన్నీ మంటపా వరకు నిర్వహించే ఈ ఊరేగింపు అద్భుతంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పర్యటకులు భారీ సంఖ్యలో తరలివస్తారు. దసరా వేడుకలు కేవలం అమ్మవారి పూజలు మాత్రమే కాదు, నవరాత్రుల్లో తొమ్మిదో రోజున ఈ రాచఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిపి ఊరేగింపుగా తీసుకువచ్చి, పూజలు చేస్తారు.అహ్మదాబాద్దుర్గాపూజతో పాటు రాముడు, రావణుడిపై సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని వైభవంగా దసరా నిర్వహిస్తారు. ప్రధానంగా లక్ష్మీ విలాస్ ప్యాలెస్ , నవ్లాఖీ మైదానంలో వేడుకులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాండియా నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలు ఘనంగా ఉంటాయి ముగింపు రోజు భారీ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం ఇక్కడి ప్రత్యేకత.ఢిల్లీ, వారణాసిదేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాంలీలా మైదాన్, ఎర్రకోట , సుభాష్ మైదాన్ వంటి ప్రదేశాల్లో దసరా వేడుకలు కన్నులపండువగా ఉంటాయి. రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీ, వారణాసి నగరాల్లో దుర్గాదేవిని ఆరాధిస్తారు. రాంలీలా మైదానంలో రావణుడి బొమ్మను దహనం చేస్తారు. వారణాసి నగరంలో చిన్నారులంతా పౌరాణిక పాత్రల వేషధారణలో అలరిస్తారు.వైష్ణో దేవి ఆలయ ఉత్సవాలుజమ్మూ కశ్మీర్ కత్రాలో ఉన్న వైష్ణో దేవి ఆలయంలో శరన్నవరాత్రులను చూసి తరించాల్సిందే. విద్యుద్దీప కాంతులతో సంబరాలు అంబరాన్నంటు తాయి. ఇక్కడ తొమ్మిదిరోజుల పాటు జగన్మాత ఆరాధనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అత్యంగ ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ కులు పట్టణంలో అట్టహాసంగా జరుగుతాయి దసరా వేడుకలు. అయితే ఇక్కడ వేడుస దసరా రోజు మొదలై ఏడు రోజుల పాటూ సాగుతుంది. రాజస్తాన్ : రాజస్థాన్‌లో రాజభవనంలో మొదలై, రాజకుటుంబ సభ్యులు జాతరగా మైదానానికి ఊరేగింపుగా తరలివస్తారు. రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి బొమ్మలు దహనం చేసి బాణసంచా పేల్చుతారు. బస్తర్ దసరా: ఛత్తీస్ గఢ్ లో నిర్వహించే దసరానే ఉత్సవాలనే బస్తర్ దసరాగా ప్రసిద్ధి చెందింది. బస్తర్‌లోని గిరిజన ప్రాంత రక్షణ దేవత దంతేశ్వరి దేవిని ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో రథాల ఉరేగింపు చూసి తీరాల్సిందే.దేవభూమి, రఘునాధుని రథయాత్రహిమాచల్ ప్రదేశ్‌లో కులు దసరా వేడుకల గురించి తెలుసుకోవాలి. ఈ సంవత్సరం,అంతర్జాతీయ కులు దసరా అక్టోబర్ 13 నుండి 19 వరకుజరుగుతుంది. 7 రోజుల పండుగలో రథయాత్ర ప్రత్యేకం. మహాకుంభ్ పేరుతో నిర్వహించే రఘునాథుని రథయాత్ర వేలాది మంది భక్తులు తరలివస్తారు స్థానిక జానపద నృత్యాలతో పాటు వివిధ దేశాల సంస్కృతిని కూడా ప్రదర్శించేలా కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే అంతర్జాతీయ నృత్యోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దాదాపు 365 స్థానిక దేవతలు, దేవతలు కులులో నివసిస్తున్నారని భూమిని దేవభూమి అని పిలుస్తారు. -
అట్లాంటా దద్దరిల్లేలా జీటీఏ బతుకమ్మ సంబరాలు!
అట్లాంటా దద్దరిల్లేలా, అమెరికా మారుమ్రోగేలా, తెలంగాణ గర్వపడేలా గ్లోబల్ తెలంగాణ అసోసీయేషన్(జీటీఏ) బతుకమ్మ సంబరాలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 5 వేలకు పైగా విచ్చేసిన అతిథులతో డెన్మార్క్ హైస్కూల్ కిటకిటలాడింది. తొలి అడుగులోనే బతుకమ్మ సంబరాల చరిత్రలో నూతన అధ్యాయం సృష్ఠిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసీషియేషన్ తమ ఉత్సాహాన్ని, నిర్వహణా సామర్థ్యాన్ని చాటుకున్నారు. జీటీఏ ప్రతిపాదన మేరకు బతుకమ్మ పండుగను గుర్తిస్తూ జార్జియా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ కెంపు ప్రతినిధుల అధికారిక ప్రకటన ఈ సంబరాల్లో విశిష్ఠ అంశంగా నిలిచింది. పలు స్వచ్ఛంద సేవా కార్య్రమాలలో అత్యద్భుత సహకారం అందిస్తున్న వీటీ సేవ సంస్థకు సహకరిస్తూ నిర్వహించనున్న పలు సేవా కార్యక్రమాలను ప్రకటించింది. విశిష్ఠ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన వి. ప్రకాష్ గారు జీటీఏ కార్య నిర్వహణా సామర్ధ్య పటిమను కొనియాడారు. స్టేట్ ఆఫ్ జార్జియా, సిటీ ఆఫ్ జాన్స్ క్రీక్ ప్రముఖులు విచ్చేయగా ఈ వేదికపై "Meditation" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముస్తాబయిన ఎత్తైన కళాత్మక బతుకమ్మలు అందరినీ అబ్బుర పరుచగా, పరికినీలు పట్టు పంచెలు, పట్టు చీరలు, పలుకరింపుల కోలాహలంతో బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన ఆత్మీయ అతిథులతో కన్నుల పండుగలా అలరించింది జీటీఏ బతుకమ్మ సంబరం. ఆకట్టుకునేలా విభిన్న విక్రయదారుల కోలాహలం, ఘుమఘుమలాడే విందు, సాంస్కృతిక వినోదం, అనురాగ పూరిత ఆతిథ్యం, పిల్లల కేరింతలు, నారీమణుల ఉత్తేజ భరిత బతుకమ్మ ఆటల వాతావరణంతో అందరినీ మంత్రముగ్ధుల్ని గావించింది. నిర్విరామంగా సుమారు 8 గంటలకు పైగా జీటీఏ బతుకమ్మ సంబరం సాగింది. బతుకమ్మ పాటలకు పరవశించి ఆడిపాడి, బతుకమ్మలను సగౌరవంగా నిమర్జనంగావించగా, యువత అందించిన అద్వితీయ సేవా సహకారాలకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేశారు. అత్యుత్సాహంగా బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ఆడపడుచులకి , గ్లోబల్ తెలంగాణ అసోసీయేషన్ కోర్ టీం సభ్యులకు, అతిథులకు, సహాయ సహకారకులకు, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఇతర సంస్థల కార్యవర్గ బృందానికి, స్పాన్సర్లకు హృదయ పూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంది జీటీఏ సంస్థ. రానున్న కాలంలో మరిన్ని అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియచేయడమే గాక అందుకుగాను అమెరికా తెలుగు ప్రజల ఆదరణాభిమానాలను మద్దతు ఉండాలని కోరింది జీటీఏ అట్లాంటా కార్యవర్గ బృందం. (చదవండి: లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!) -
Mega Family: మెగా ఫ్యామిలీ ఇంట దసరా సంబరాలు.. అనాథ చిన్నారులతో బతుకమ్మ ఆటలు (ఫోటోలు)
-
అబుదాబిలో బతుకమ్మ సంబరాలు!
అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. యూఏఈలోని వందలాది మంది తెలంగాణ మహిళలు చిన్నారులు తెలంగాణ నుంచి తీసుకువచ్చిన పువ్వులతో బతుకమ్మను తయారుచేసి అందులో గౌరీదేవిని ప్రతిష్టించి పూజలు చేశారు. బతుకమ్మను కోలాటాల మధ్య ఆడిటోరియం కు తీసుకువచ్చి బతుకమ్మ ఆటలాడారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ అశోక ను. కౌన్సిలర్ ఆర్ బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా శ్రీనివాస్ గోపాల్ వంశీ కమలాకర్ శ్రీనివాస్ సాగర్ గంగన్న సంతోష్ జగదీష్ శ్రీనివాస్ రెడ్డి పావని అర్చన పద్మజ లక్ష్మీ సుధా పాల్గొన్నారు. (చదవండి: జర్మనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు) -
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో ఘనంతో బతుకమ్మ, దసరా వేడుకలు
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25 వ తేదీన ఉత్తర చార్లెట్ లో ఉన్న జే ఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన దక్షిణ షార్లెట్‌లో లో గల కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కొరకు తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా అందముస్తాబు చేశారు. ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో చక్కగా ముస్తాబైన మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు,ఇతర వ్యాపార పరిచయ వేదికలు అక్కడివారిని ఆకర్షించాయి. అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ ఆట పాటలుతో, గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో విడిచిపెట్టారు, తరువాత ముత్తయిదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణా సంఘం వరుసా పదమూడో సంవత్సరం జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చార్లెట్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరు వులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆట పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగ తిస్తూ ముగిసే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. చదవండి: బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం -
బల్కంపేటలో బతుకమ్మ ఆడిన కవిత.. యాదాద్రిలో ఘనంగా వేడుకలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని తూర్పు రాజగోపురం ముందు తిరువీధిలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానిక మహిళలు పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ ఆడారు. కూచిపూడి కళాకారుల నృత్యాలు వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి. బల్కంపేట ఎల్లమ్మ వద్ద.. సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత ఆదివారం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం సతీమణి శోభ వెళ్లిపోగా.. కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సతీమణి స్వర్ణ, మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. అబుదాబిలో బతుకమ్మ సంబరాలు రాయికల్ (జగిత్యాల): అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణవాసులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు గౌరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత రాయబారి కార్యా లయ కౌన్సిల్ ఆర్.బాలాజీ హాజరయ్యారు. చదవండి: భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు -
Bathukamma 2022: తగ్గేదెలే! భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు
హైదరాబాద్: బతుకమ్మ అంటేనే పూల పండుగ. బతుకమ్మ పాటే ‘తీరొక్క పువ్వేసి చందమామో.. ’అంటూ మొదలవుతుంది. తంగేడు, గునుగు పూలతోపాటు రకరకాల పూలనూ బతుకమ్మను రూపొందించేందుకు వాడుతుంటారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులు, పట్టణాల విస్తరణ, వ్యవసాయ విస్తీర్ణం పెరగడంతో కొన్నాళ్లుగా బతుకమ్మకు వినియోగించే పూలు తగ్గిపోయాయి. మరోవైపు తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి బతుకమ్మ పండుగ మరింత విస్తృతమైంది. పెద్ద పెద్ద బతుకమ్మలను పేర్చి పూజించేవారు పెరిగారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో బతుకమ్మ పూల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలు కూడా దాటుతున్నారు. కొందరైతే విదేశాల నుంచీ రకరకాల పూలను తెప్పించి బతుకమ్మలను రూపొందిస్తున్నారు. కూకట్పల్లి, ఇతర ప్రాంతాల నుంచి.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లితోపాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ బతుకమ్మలను పేర్చి పండుగ జరుపుతుంటారు. కొందరు ఏకంగా పది, ఇరవై అడుగుల మేర బతుకమ్మలనూ రూపొందిస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల పూలను భారీగా తెప్పిస్తుంటారు. మొదట్లో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల నుంచి పూలు తీసుకువచ్చేవారు. ఆ జిల్లాల్లోనూ కొరత ఏర్పడటంతో మహారాష్ట్రలోని బీదర్, నాందేడ్ ప్రాంతాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ముందుగా పూలు తెప్పించుకుంటున్నారు. గత ఏడాది కూకట్‌పల్లిలో 15 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన లోటస్ బతుకమ్మ కోసం జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తోపాటు సింగపూర్, స్విట్జర్లాండ్ నుంచి కూడా కొత్త రకాల పూలను తెప్పించారు. కూకట్‌పల్లిలో ప్రత్యేకంగా.. కూకట్పల్లి ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలకుపైగా 10 అడుగుల కన్నా ఎత్తున బతుకమ్మలను పేర్చి పూజిస్తుంటాయి. కూకట్‌పల్లికి చెందిన గుండాల నర్సింగరావుకు ఐదుగురూ కుమారులే. ఆ కుమారులకూ తొలుత కొడుకులే పుట్టారు. ఈ క్రమంలో మొదటిసారిగా ఓ కుమారుడికి బిడ్డ పుట్టడంతో వేడుక చేసుకు న్నారు. మనవరాలిపై ప్రేమతో ఆమె వయసుకు అనుగుణంగా బతుకమ్మ ఎత్తును పెంచుకుంటూ వెళ్లారు. అలా 20 అడుగుల వరకు చేరాక ఏటా అంతపెద్ద బతుకమ్మను పేర్చడం, నిమజ్జనానికి తీసుకెళ్లడం కష్టమైంది. దీనితో ఏటా అదే ఎత్తుతో బతుకమ్మను పేర్చి పూజిస్తున్నారు. ఆయన ఐదుగురు కుమారులు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. భారీ బతుక మ్మలను పేర్చుతున్నారు. కూకట్‌పల్లికే చెందిన అబ్బినేని వజ్రమ్మ కుటుంబం 40 ఏళ్లుగా భారీ బతుకమ్మలను పేరుస్తోంది. తమ ఇంట్లో కష్టాలు తీర్చిన బతుకమ్మను పెద్దగా త యారు చేయాలన్న సెంటిమెంట్‌ను ఆమె వారసులు కొనసాగిస్తున్నారు. వీరితోపాటు మరికొంద రూ పెద్ద బతుకమ్మలను పేర్చుతుంటారు. పెద్ద బతుకమ్మను పేర్చి పూజిస్తాం కూకట్‌పల్లిలో అచ్చమైన పూలతో బతుకమ్మ ను పేర్చడం మా అత్త గుండాల చంద్రమ్మ నుంచి మాకు సంప్రదాయంగా వచి్చంది. అత్తగారు మా ప్రాంతంలో రెండు దశాబ్దాల పాటు అతిపెద్ద బతుకమ్మను పేర్చి ప్రత్యేక స్థానాన్ని చాటారు. ఇప్పుడు మేం తోటి కోడ ళ్లం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ పెద్ద బతుకమ్మలను పేరుస్తున్నాం. గత సంవత్సరం ఇక్కడ పూలు లభించక ఇతర రాష్ట్రాల నుంచి పూలు తెప్పించుకున్నాం. ఈసారి కూడా పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేస్తున్నాం. – గుండాల అర్చన, కూకట్పల్లి చదవండి: పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్ -
‘సెలవులు ఇవ్వకపోవడం దారుణం.. ఉద్యోగులు విధులు బహిష్కరించండి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు బతుకమ్మ పండుగ సెలవులు ఇవ్వకపోవడం దారుణం. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి. ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగకు సెలవు ఇవ్వకుండా కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. అంతటి విశిష్టమైన బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి?. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? వేరే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా?. ఉద్యోగులు, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. -
‘తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ’
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతకమ్మ పండగ. అలాంటి బతుకమ్మ పండుగను సభ్యులు ఘనంగా నిర్వహించారంటూ ఈ సందర్భంగా గాదరి కిషోర్ కుమార్ వారిని అభినందించారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్ల విషయంలో టీఆర్ఎస్ మలేషియా చూపిన చొరవపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి సందీప్ కుమార్ లగిశెట్టి, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, నవీన్ గౌడ్ పంజాల, హరీష్ గుడిపాటి, రవిందర్ రెడ్డి, శ్యామ్, సంపత్ రెడ్డి, పూర్ణ చందర్ రావు, కిషోర్ పాల్గొన్నారు. -
యూఏఈలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
యూఏఈలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా బతుకమ్మ ఉత్సవాల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాది మహిళలు ప్రాంగణాన్ని బతుకమ్మ పాటలతో మారు మ్రోగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒక చోట చేరి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్లో సందడి చేశారు. ప్రముఖ కవి గాయకుడు,తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, వర్ధమాన గాయని వరంలు పాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈ భారత రాయబార కార్యాలయం కాన్సులర్ బాలాజీ, అతని కటుంబ సభ్యులతో పాటు ఐఎఫ్ఎస్ అధికారులు హాజరయ్యారు. అనంతరం బతుకమ్మ వేడకుల్లో పాల్గొన్న వారికి నిర్వాహులకు బహుమతులు అందజేశారు. ఏ ఎక్స్ ప్రాపర్టీస్, స్క్వేర్ యార్డ్స్ , ఎస్పాకో, ఆసమ్ సలోన్, ట్రై కలర్ ప్రాపర్టీస్, జి బి హాలిడేస్, అజంతా జ్యువెలర్స్, ఎల్ఐసి ఇంటర్నేషనల్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని గోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు నిర్వహించారు. -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో బతుకమ్మ అంబరాన్నంటాయి. స్థానిక సంబవాంగ్ పార్క్ లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు 4వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఏడాది బతుకమ్మ సంబురాలకు సమన్వయ కర్తలుగా గడప రమేశ్, సునీత రెడ్డి, రోజా రమణి, దీప నల్ల, రజిత రెడ్డి, నిర్మల రెడ్డి, అనుపురం శ్రీనివాస్ నంగునూరి సౌజన్య, పద్మజ నాయుడు వ్యవహరించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా టీసీఎస్ఎస్ ప్రత్యేకంగా నిర్మించిన సింగపూర్ బతుకమ్మ సింగారాల బతుకమ్మ నిలిచింది. ఈ సందర్బంగా అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ,కార్యవర్గ సభ్యులు, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ..బతుకమ్మ సంబురాలను విజయవంతం చేడయడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఐఎంఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
సాక్షి, కామారెడ్డి: తెలంగాణవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కామారెడ్డిలో జిల్లాలో ఇండియన్ మెడికల్ అసొసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మకు పూజలు చేశారు. ఆ తర్వాత సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. -
ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలు.. బీజేపీకి బుద్దివచ్చిందంటూ కవిత కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాగా, తొలిసారిగా దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కర్తవ్యపథ్‌లో తొలిసారి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువరు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే, ఈ వేడుకలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చాక ఎనిమిదేళ్లకు బీజేపీకి బుద్ది వచ్చింది. కేసీఆర్ దెబ్బకు గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద బతుకమ్మ ఆడుతున్నారు. తెలంగాణలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ పేరుతో విమోచనం అంటున్నారు. అదే గుజరాత్లో పటేల్ విగ్రహం పెట్టి స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ అంటున్నారు. విభజన కావాలా.. యూనిటీ కావాలా తేల్చుకోవాలి. ఈరోజు ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒక ప్రతీక. జాతీయ రాజకీయాలవైపు కేసీఆర్ చూస్తున్నారు కాబట్టే బీజేపీ నేతలు ఉలిక్కిపడ్డారు. అందులో భాగంగానే నేడు ఢిల్లీలో బీజేపీ నేతలు.. బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు’ అని అన్నారు. Proud moment... Telangana Bathukamma Celebrations at Karthavya Path infront of Historical India Gate. Union Minister for Culture @kishanreddybjp took initiative to make it. Once here human chain formed in the part of Telangana Agitation.@Mahatma_Kodiyar @pradeeepjourno pic.twitter.com/iAPk5iHRlb — 🇮🇳 Venkatesh Nagilla వెంకటేష్ నాగిళ్ల (@Venkatjourno) September 27, 2022 -
నేలంతా పూలాయె.. అంబరాన్ని అంటిన ఎంగిలి పూల బతుకమ్మ సంబురం
రంగురంగుల పూలతో.. అందంగా పేర్చిన బతుకమ్మలతో నేలంతా పూలవనాన్ని తలపించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆదివారం వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇళ్ల వద్ద బతుకమ్మలకు పూజలు చేసి.. సాయంత్రం ఆలయాల వద్ద ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఘనంగా నిమజ్జనం చేశారు. -
టీపాడ్ ఆధ్వర్యంలో మరింత ఘనంగా బతుకమ్మ, దసరా సంబురాలు
విదేశాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించి ప్రపంచవ్యాప్తంగా గల తెలుగువారి దృష్టిని ఆకర్షించిన అమెరికాలోని డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) తాజాగా బతుకమ్మ పండుగను మరింత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. అదే స్థాయిలో దసరా వేడుకలకూ సన్నాహకాలు ప్రారంభించింది. గతంలో దాదాపు పన్నెండు వేల మందితో బతుకమ్మ పండుగను నిర్వహించగా ఈసారి సుమారు 16వేల మందితో మరింత ఘనంగా, మహా సంబరంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నది. డాలస్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేపట్టాలని నిశ్చయించింది. అక్టోబర్ 1న కొమెరికా ఈవెంట్ సెంటర్ (డాక్టర్ పెప్పర్ ఎరెనా) వేదికగా నిర్వహించే ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నది. పొరుగు రాష్ట్రాలైన ఓక్లహామా, కాన్సాస్, అర్కన్సాస్‌లో ఉంటున్న తెలుగువారు కూడా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు ఈ సందర్భంగా టీపాడ్ ప్రతినిధులు తెలిపారు. ఫ్రిస్కో పట్టణంలోని శుభమ్ ఈవెంట్ సెంటర్లో ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అధ్యక్షుడు రమణ లష్కర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాణి పంచెర్పుల, ఉపాధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, పాండు పాల్వాయి పాల్గొన్నారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్న హెల్త్‌కేర్ మొఘల్ డాక్టర్ ప్రేమ్‌రెడ్డి.. పెద్దఎత్తున నిర్వహించబోయే ఈ వేడుకలకు తన మద్దతు ప్రకటించారు. నాటా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి కొర్సపాటి తమవంతు సహాయసహకారాలందిస్తామని ప్రకటించారు. స్థానిక నాయకులు, వ్యాపారులు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములమవుతామని తెలిపారు. కాగా, ఇటీవలే టీపాడ్ డాలస్‌లో తిరుమల వెంకటేశ్వరస్వామి కల్యాణాన్ని టీటీడీ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. -
రిలయన్స్ ట్రెండ్స్ బతుకమ్మ సెల్ఫీ పోటీ
హైదరాబాద్: భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో శుభప్రదమైన బతుకమ్మ పండగ సమయంలో వినియోగదారులకు దగ్గర కావడం కోసం చిన్న పట్టణాల్లో ఒక పోటీ నిర్వహిస్తుంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడుచులు వివిధ రకాల పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు. ట్రెండ్స్ బతుకమ్మ సెల్ఫీ పోటీ ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. రిలయెన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం బతుకమ్మ ఇతివృత్తంతో ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది. ఈ పోటీలో భాగంగా గౌరీ దేవిని ఇళ్లల్లో పూజించే సమయంలో బతుకమ్మతో కలిసి మీరు తీసుకున్న సెల్ఫీని ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ కు ఎంట్రీ కోసం పంపించాల్సి ఉంది.(చదవండి: భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!) 'ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మ'గా నిర్ణయించిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ.1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతి కింద రూ.1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ అందించనున్నారు. అంతే కాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారికి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. ఈ కూపన్ మీ దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో ట్రెండ్స్ స్టోర్ నుంచి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది. మరిన్ని వివరాలు కోసం మీ పట్టణంలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ సంప్రదించండి. -
రాజ్‌భవన్‌లో.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో ‘బతుకమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు. -
కాలిఫోర్నియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కాలిఫోర్నియా : మహిళల కొరకు ఉత్తర అమెరికాలో తెలుగు మహిళల స్త్రీ ప్రగతి, అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)బతుకమ్మ, విజయ దశమి సందర్బంగా సమావేశమై సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్నికాలిఫోర్నియాలోని సాన్ హోసే నగరంలో నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో శనివారం జరిగాయి. మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి వారి కళలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని ఝాన్సీ రెడ్డి గారు మరొకసారి గుర్తు చేసారు. ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్ చైర్, ప్రెసిడెంట్ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ "శైలజ కల్లూరి" మాట్లాడుతూ ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో తక్కువ మంది తో, సామజిక దూరాన్ని పాటిస్తూ , మాస్కులు ధరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటూ ఈ వేడుక జరుపుకొంటున్నామన్నారు. బతుకమ్మ , దసరా పండుగలు మన సంస్కృతికి చిహ్నంగా జరుపుకొంటున్నామన్నారు. సంస్కృతి సంప్రదాయాలను మనం ఇప్పటి తరం యువతీ యువకులకు, పిల్లలకు నేర్పించినట్లయితేనే మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లగలమని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ముఖ్య సభ్యులు సుగుణరెడ్డి,అనురాధ ఎలిశెట్టి, హైమ అనుమాండ్ల, లక్షి అనుమాండ్ల, పూజ లక్కడి, చిన్మయి ఎరుకల, యశస్వినీ రెడ్డి, జ్యోతి పెంటపర్తి, ప్రశాంతి కూచిబొట్ల కూడా పాల్గొన్నారు.