చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25 వ తేదీన ఉత్తర చార్లెట్ లో ఉన్న జే ఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన దక్షిణ షార్లెట్లో లో గల కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కొరకు తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా అందముస్తాబు చేశారు.
ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో చక్కగా ముస్తాబైన మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు,ఇతర వ్యాపార పరిచయ వేదికలు అక్కడివారిని ఆకర్షించాయి. అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ ఆట పాటలుతో, గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు.
తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో విడిచిపెట్టారు, తరువాత ముత్తయిదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణా సంఘం వరుసా పదమూడో సంవత్సరం జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చార్లెట్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment