telangana sangam
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో ఘనంతో బతుకమ్మ, దసరా వేడుకలు
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25 వ తేదీన ఉత్తర చార్లెట్ లో ఉన్న జే ఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన దక్షిణ షార్లెట్‌లో లో గల కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కొరకు తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా అందముస్తాబు చేశారు. ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో చక్కగా ముస్తాబైన మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు,ఇతర వ్యాపార పరిచయ వేదికలు అక్కడివారిని ఆకర్షించాయి. అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ ఆట పాటలుతో, గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో విడిచిపెట్టారు, తరువాత ముత్తయిదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణా సంఘం వరుసా పదమూడో సంవత్సరం జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చార్లెట్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
యూఏఈలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా యూఏఈలో నివసిస్తున్న తెలంగాణ వాసులు అబుదాబిలోని తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ మాసం కారణంగా యూఏఈలో వినోద కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఉండదు. దీంతో కళాకారులెవరూ లేకుండా స్ధానికంగా ఉండే తెలంగాణ వాసులే అవతరణ వేడుకలను జరుపుకున్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ సంఘ సభ్యుడి ప్రైవేటు భవనంలో ఈ వేడుకలను జరుపుకున్నట్లు చెప్పారు. దీప ప్రజ్వలన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి వందన సమర్పణతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మాస్టర్ కవీష్ పాడిన 'జై బోలో తెలంగాణా', 'తెలంగాణా నినాదమే మా నర నరాన' అనే గీతంతో ఒక్కసారిగా కార్యక్రమ వాతావరణం వేడెక్కింది. తదనంతరం ముప్పై ఒక్క జిల్లాల ప్రాశస్త్యం చెప్పే గీతం, మరెన్నో తెలంగాణ గీతాలను చిన్నారులు పాడారు. పల్లె పాటల పై చిన్నారులు చేసిన నృత్యాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. సంఘ సభ్యులందరూ కలిసి జై తెలంగాణా అని రాసి ఉన్న కేక్ కట్ చేసి తెలంగాణా గీతం పాడి కార్యక్రమానికి ముగింపు పలికారు. చివరగా సంఘ ప్రతినిధులు రాజా శ్రీనివాస్, పృథ్వి రాజ్, సదానంద్, వంశీ, గంగా రెడ్డి, పావని, అర్చన, రోజా, భాస్కర్ తదితరులు మాట్లాడుతూ బంగారు తెలంగాణా నిర్మాణంలో గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణీయుల పాత్ర ఎంతగానో ఉందని సభకు తెలియజేస్తూ, ఆ దిశలో సంఘ తరుఫున చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. ఆట పాటలతో ప్రేక్షకులందరిని అలరించిన చిన్నారులకు బహుమతులు ప్రధానం చేశారు.