
సాక్షి, హైదరాబాద్: ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు బుధవారం నాటి సద్దుల బతుకమ్మతో ముగుస్తాయని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ మహా ఊరేగింపు కార్యక్రమం బుధవారం సాయంత్రం 4 గంటలకు ట్యాంక్‌బండ్ నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్, లేజర్ షో ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి మంది తెలం గాణ జానపద కళాకారులు, 100 మంది విదేశీ కళాకారులతో సాంస్కృతిక యాత్రతో పాటు బతుకమ్మల ప్రత్యేక ఊరేగింపు ఉంటుందన్నా రు. ఈ నెల 18న సాయంత్రం 6 గంటలకు గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment