సాక్షి,ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి. నగరంతోపాటు వర్లీ, బాంద్రా, అంధేరి, గోరేగావ్, బోరివలి, థాణే, భివండీ, సోలాపూర్‌లలో నివసించే తెలుగు ప్రజలు బుధవారం ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో దసరా వేడుకలకు స్వాగతం పలికారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు ‘ఎంగిలిపూల బతుకమ్మ’ను పూజించిన తెలంగాణ మహిళలు బతుకమ్మ పాటలు, కోలాటాలతో ఉల్లాసంగా గడిపారు. ఉత్సవాల నేపథ్యంలో ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల తెలుగువారు అధికంగా నివసించే ప్రాంతాల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోంది. మరోవైపు శరన్నవరాత్రుల సందర్భంగా బెంగాలీలు దుర్గాదేవి విగ్రహాలను నెలకొల్పి ప్రత్యేక పూజలు చేస్తుండగా, గుజరాతీలు పూజా కార్యక్రమాలతో పాటు ‘గర్భా’, దాండియాల్లోనూ ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.
సద్దుల బతుకమ్మతో ముగింపు...
తెలుగువారు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేవుళ్లకు పువ్వులతో పూజలు చేయడం సహజం కానీ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో విడదీయలేని భాగమైన బతుకమ్మ పండుగ సందర్భంగా రకరకాల, రంగురంగుల పూలను ఒద్దికగా పేర్చి వాటికే పూజలు నిర్వహించడం విశేషం. ఇలా తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించిన మహిళలు చివరి రోజున భారీ ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుని బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు.
రద్దీగా దేవీ ఆలయాలు...
దసరా సందర్భంగా ముంబైతోపాటు రాష్ట్రంలోని మహాలక్ష్మి, మహాకాళి, దుర్గాదేవి, లక్షి్మదేవి తదితర అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవరాత్రులను పురస్కరించుకుని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాభవానీ, కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి, మావూర్‌లోని రేణుకా మాత, నాసిక్ జిల్లాలోని సప్తశృంగి దేవి ఆలయాలతో పాటు అదే విధంగా ముంబైలోని మహాలక్షి్మ, ముంబాదేవి, ఠాణే జిల్లాలోని వజ్రేశ్వరీ, విరార్‌లోని జీవ్‌దనీ మాతా, ముంబ్రాలోని కొండపై ఉన్న ముంబ్రా దేవి మందిరాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. కాగా శరన్నవరాత్రుల తొలిరోజునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యం కోసం భద్రతా ఏర్పాట్లతోపాటు తాగు నీరు, ఇతర సదుపాయాలను కల్పించడంలో ఆలయ కమిటీలు నిమగ్నమయ్యాయి.
నాయిగావ్ పద్మశాలీ యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో...
దాదర్ నాయిగావ్‌లోని పద్మశాలీ యువక సంఘానికి చెందిన మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక తెలుగు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి భక్తిశ్రద్ధలతో పూజించారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా అక్టోబరు 5నకోలాటం, దాండియా, అక్టోబరు 10నసద్దుల బతుకమ్మ సంబరాలను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు తెలిపారు. ఈసంబరాల్లో ఉత్తమ బతుకమ్మను పేర్చిన, చూడచక్కని బతుకమ్మ అడిన మహిళలకు, బాల బాలికలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు గంజి సీతారాములు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, సంఘం మహిళా మండలి ఉపాధ్యక్షురాలు జిల్ల శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులుఅడ్డగట్ల ఐశ్వర్య, గుజ్జరి జానవి, కస్తూరి సావిత్ర, మహేశ్వరం సాక్షి, సీత రేఖలతో పాటు స్థానిక మహిళలు, బాలికలుపెద్దఎత్తున పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో...
పశి్చమ గోరెగావ్, హనుమాన్ నగర్‌లోని తెలంగాణ ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులందరూ తీరొక్క పూలను అందంగా పేర్చి బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘం కమిటీ అధ్యక్షుడు మల్లేష్ ప్రధాన కార్యదర్శి స్వామి లెంకలపల్లి, ఉపాధ్యక్షుడు శేఖర్ వంటిపాక, నరసింహా బినమోని, కోశాధికారి గణేష్ మచ్చ, నరసింహ నాయక్, శ్రీనివాస్ రెడ్డి మన్నే. సహాయ కార్యదర్శులు బద్దం శంకర్, లక్ష్మణ్ ఎర్ర, మల్లేష్ సురి్వ, సలహాదారులు పరమేష్ నర్సిరెడ్డి, మన్నే జనార్దన్, మల్లేష్ గాదె, కృష్ణ కురుపాటి, శ్రీను కిష్టం, జాని స్వామి, వెంకటేష్ .వి, రాములు, నర్సింహ్మ ఎర్ర, శంకర్ బాబు, శంకర్ .డి, బిక్షం యాదయ్య, ఎ స్వామి, రంగనాధం,లింగయ్య జి, సుధాకర్ రెడ్డిలతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో...
దహిసర్ నవగాం, హనుమాన్ టేకిడి ప్రాంతంలోని శ్రీ బాలాజీ రజక మిత్ర మండల్ ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా ముస్తాబై రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఉల్లాసంగా గడిపారు. అనంతరం ఒకరికొకరు వాయనాలు, ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకున్నారు.
ముంబై అంటాప్ హిల్ చర్చి సమీపంలోని మరియమ్మ మందిరంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ సంబరాల్లో స్థానిక ఎమ్మెల్యే కెప్టెన్ తమిళ్ సెల్వన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ...
బుధవారం నవీముంబైలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహాసభ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాదిరెడ్డి కొండారెడ్డిని తెలుగు కళా సమితి అధ్యక్షుడు బండి నారాయణ రెడ్డి. ఉపాధ్యక్షుడు బి. సుబ్రమణ్యం. కే. వరలక్ష్మి, వహీదా షేక్ ఘనంగా సన్మానించారు.
చిరాగ్ నగర్ పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో...
ఘాట్కోపర్,చిరాగ్‌నగర్‌లోని పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మఆడుకున్నారు.
శివాజీ నగర్, గీతాంజలి గార్డెన్‌లో...
దహిసర్ ప్రాంతంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన తెలుగువారు తీరొక్క పూలతో ఎంగిలి పూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. శివాజీ నగర్ ప్రాంతంలోని గీతాంజలి గార్డెన్‌లో బతుకమ్మ పండుగ సంబరాలు తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పానుగుళ్ల వసుమతి, తేజస్విని కుకడపు, కవిత నందిపాటి, దీపిక పానుగుళ్ల, శిరీష జాల, మమత చినాల, లావణ్య కుకడపు, రేణుక గోగు, రేణుక, బాల కందే తదితరులు పాల్గొన్నారు.
తూర్పు డోంబివలిలో...
తూర్పు డోంబివలి, పలావా ఫేజ్ 2లోని తెలుగు సమాజం ఆధ్వర్యంలో బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరిగింది. మొట్టమొదటిసారి జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సాకినాకాలో...
సాకినాకాలోని పోచమ్మ గుడి వద్ద తెలుగు ప్రజలు ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలుగు సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ వేడుకలుఘనంగా ‘ఎంగిలి పూల బతుకమ్మ’ సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment