బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట | Dussehra 2024 Bathukamma celebrations in Mumbai | Sakshi
Sakshi News home page

బంగరు నవ్వుల ఆట.. వాకిలయ్యే పువ్వుల తోట

Published Mon, Oct 7 2024 4:33 PM | Last Updated on Mon, Oct 7 2024 4:33 PM

Dussehra 2024 Bathukamma celebrations in Mumbai

సాక్షి,ముంబై: ముంబైలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వర్లీ, లోవర్‌పరెల్, బాంద్రా, అంధేరి, బోరివలి తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పాటలతో సందడి నెలకొంది. ఒక్కేసి పువ్వేసి ఆడవే చెల్లి బతుకమ్మ పాట అంటూ మహిళలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఓ వైపు బతుకమ్మ పాటలతోపాటు తెలుగు ప్రజలు కూడా దసరా నవరాత్రి ఉత్సవాల్లో దేవీమాతను అలంకరించే చీరల రంగుల ప్రకారమే చీరలు ధరించి బతుకమ్మలు ఆడుతూ కన్పిస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రతీరోజు ఒకే రంగు చీరలతో బతుకమ్మ ఆడుతూ సంబురాలు చేస్తున్నారు. 

తిరంగ వెల్ఫేర్‌ కమిటీ... 
బాంద్రాలోని తిరంగా వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. తూర్పు బాంద్రా జ్ఞానేశ్వర్‌నగర్‌లో ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు ప్రతీ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలందరూ ఒకే రంగుల చీరలు ధరించి తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెబుతున్నారు.  

తెలుగు రజక సంఘం... 
తెలుగు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు జరిగాయి. అంటప్‌హిల్‌ సీజిఎస్‌ కాలనీలోని గహ కల్యాణ్‌ కేంద్రహాల్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబురాలకు ముఖ్యఅతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కెపె్టన్‌ తమిళ సెల్వన్, స్థానిక కార్పొరేటర్‌ కృష్ణవేణిరెడ్డి, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎం.కొండారెడ్డి తోపాటు బీజేపీ ముంబై సౌత్‌ సెంట్రల్‌ ఉపాధ్యక్షుడు అనీల్‌ కనోజియాలు హాజరయ్యారు. ముఖ్యంగా కృష్ణవేణిరెడ్డి మహిళల బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బతుకమ్మ పాటలతో పరిసరాలన్నీ మార్మోగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ముంబై ఆంధ్ర ఎడ్యుకేషన్‌ హై స్కూల్‌ కాలేజీ పదాధికారి పురుషోత్తంరెడ్డి, ముంబై రజక సంఘం ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎలిజాల శ్రీనివాస్, ముంబై ప్రజాగాయకుడు గాజుల నర్సారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులందరినీ సంఘం పదాధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు నడిగోటి వెంకటేశ్, ఉపాధ్యక్షుడు మర్రిపల్లి మల్లేశ్, ప్రధాన కార్యదర్శి అవనిగంటి రామలింగయ్య, కోశాధికారి భూమ చిన్న నరసింహ, ఉపకోశాధికారి భూమ యాదయ్య, కమిటీ సలహాదారులు భూమ పెద్దనర్సింహ, చెరుకు కృష్ణ, తాందారి వెంకటేశ్, బసవాడ కృష్ణ, భూమ సురేశ్, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ఎల్లయ్య, అక్కనపల్లి నరసింహ, బసాని ఉపేందర్, ఐతరాజు మల్లయ్య, భూమ వెంకటేశ్, భూమ శంకర, పున్న సోమయ్య, బొడ్డుపల్లి రాజుతోపాటు తదితరులతోపాటు విజయనగర్, మోతిలాల్‌నెహ్రూనగర్, వాడాలా, సైన్‌కు చెందిన మహిళలు కూడా పాల్గొన్నారు.  

పద్మశాలి యువక సంఘం...
తూర్పు దాదర్‌ నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. సంఘం హాల్‌లో శనివారం రాత్రి జరిగిన ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని దాండి యా, కోలాటాలు ఆడి సందడి చేశారు. ముఖ్యంగా దసరా నవరాత్రులతోపాటు బతుకమ్మ సంబురాల నేపథ్యంలో ప్రతి ఏటా పద్మశాలి యువక సంఘం మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా నవరాత్రి ఉత్స వాల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడారు. అనంతరం స్థానిక సంప్రదాయాలమేరకు యువత దాండియా కోలాటాలు ఆడారు. ఇక అక్టోబరు 10వ తేదీన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు కూడా నిర్వహించనున్నారు. ముఖ్యంగా దాండియా, కోలాటాలు మంచిగా ఆడి విజేతలుగా నిలిచిన వారికి అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ పండుగ రోజున బహమతులు అందించనున్నారని సంఘం అధ్యక్షుడు గంజి సీతారాములు వెల్లడించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ రోజు అందంగా పేర్చిన బతుకమ్మలకు, బతుకమ్మలు బాగా ఆడినవారికి కూడా బహమతులు అందించనున్నారన్నారు. మరోవైపు శనివారం ఆడిన దాండియా, కోలాటాల పోటీలకు అతిథిగా హాజరైన తిలక్‌నగర్‌ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యురాలు పారెపెల్లి లత, మహారాష్ట్ర తెలుగు మహిళ సంస్థ కార్యదర్శి గాజెంగి హారికలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో అతిథులను న్యాయనిర్ణేతలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సంఘం మహిళ మండలి ఉపాధ్యక్షురాలు జిల్లా శారద, కార్యదర్శి చెరిపెల్లి పరమేశ్వరి, సహ కార్యదర్శి బిట్ల సోని, కోశాధికారి పేర్ల గీతాంజలి, సభ్యులు అడ్డగట్ల ఐశ్వర్య, చెడుదుపు పద్మ, దొంత ప్రభావతి, ఇడం పద్మ, గుజ్జరి జాహ్నవీ, కైరంకొండ లక్షి్మ, కండ్లపెల్లి కవిత, మహేశ్వరం సాక్షి, పగుడాల రోహిణి, సీతారేఖ, ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోడి చంద్రమౌళి, అనబత్తుల ప్రమోద్, పొన్న శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్సెట్టి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం చంద్రశేఖర్, కోశాధికారి దోర్నాల బాలరాజు, దుస్స అమరేంద్ర, దోమల శంకర్, కస్తూరి గణేశ్, పుట్ట గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  

సిరిసిల్ల పద్మశాలి సంఘం... 
సిరిసిల్ల పద్మశాలి సంఘం ముంబై శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వర్లీ బీడీడీ చాల్స్‌లోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు ప్రతిఫలించేలా ఆడపడచులు బతుకమ్మ పాటలు ఆలపిస్తూ పూలతో పేర్చిన బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమానికి సిరిసిల్ల సంఘం మహిళలే కాకుండా స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో పాల్గొన్న వివాహిత మహిళలకు లక్కీడిప్‌ ద్వారా 15 మందిని ఎంపికచేసి చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ఉపాధ్యక్షుడు కొక్కుల రమేశ్, ప్రధాన కార్యదర్శి యేముల లక్ష్మీనారాయణ, సంయుక్త కోశాధికారి దూస మురళీధర్, కోశాధికారి సుంక ప్రభాకర్, సంయుక్త కోశాధికారులు ఆడెపు చంద్రశేఖర్, అడ్డగట్ల ముఖేశ్‌ సాంస్కృతిక అధికారి మార్గం శ్రీనివాస్, సోషల్‌ మీడియా అడ్మిన్‌ అడెపు అశోక్, కమిటీ సభ్యులు కోడం మనోహర్, ముదిగంటి అంజనేయులు, జిందం దశరథ్, జిందం నాగేశ్, కోడం గంగాధర్, వాసం నారాయణ, గాజుల సురేశ్, వాసా ల గంగాధర్, కట్టెకోల అశోక్, యంజాల్‌ భూమేశ్వర్, గాలిపెల్లి లక్ష్మణ్, వాసం అనిల్‌ కుమార్, రాపెల్లి సతీశ్, సలహాదారులు దూస నారాయణ, అడ్డగట్ల సుదర్శన్, ఆడెపు హనుమంతు పాల్గొన్నారు. 

తెలంగాణ భాషా సాంస్కృతిక, టూరిజం శాఖ, ఎఫ్‌–టామ్‌ సంయుక్త ఆధ్వర్యంలో..

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, టూరిజం శాఖ, ఎఫ్‌–టామ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని థానేలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచి్చన మహిళలు తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెబుతూ బతుకమ్మ వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. బతు కమ్మ వేడుకలకు హాజరైన మహిళలు గోదావరి, కావేరి, గంగ వంటి దేశంలోని వివిధ నదుల పేర్లతో గ్రూపులుగా విడిపోయి ఈ పోటీల్లో పాల్గొన్నారు. 

ఈ పోటీల్లో గోదావరి మహిళా బృందానికి మొదటి బహుమతి రాగా, గంగా నది మహిళా గ్రూపునకు రెండవ బహుమతి, కావేరి నది మహిళా గ్రూపునకు మూడో బహుమతి లభించాయి. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అంజలి మచ్చ ఆధ్వర్యంలో స్నేహ అంబ్‌రె, రమేశ్‌ అంబ్‌రె, ఎఫ్‌–టామ్‌ సంస్థ అధ్యక్షుడు గంజి జగన్‌ బాబు చేతులమీదుగా చీరలు అందజేశారు. కార్యక్రమంలో రాఘవరావు, కిరణ్మయి, సునీల్‌ బైరి, వాణి వేముల, విజయ, స్నేహ వంగ, స్నేహ బొమ్మకంటి, మహేశ్‌ గుజ్జ, రాధిక, రమేశ్, పద్మాకర్, అర్జున్, సుభాష్, మహేంద్ర, హరితరావు, సత్యనారాయణ కంచెర్ల పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement