ట్రైయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ (TTGA) ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలు అద్భుతంగా ముగిశాయి. సుమారు 7వేలమంది మంది పాల్గొన్న కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక వైభవం విశ్వవ్యాప్తంగా ప్రదర్శితమైంది.
25 అడుగుల ఎత్తైన కమల పీఠం బతుకమ్మల అందంతో అలరించింది. అష్టలక్ష్మి అలంకరణలు, 6 గంటలపాటు నిరాటంకంగా జరిగిన బతుకమ్మ నృత్యం కార్యక్రమం ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవానికి రెండు నెలల పాటు కఠోర సాధన చేసి మరీ బతుకమ్మను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో సెనేటర్ జే జె చౌదరి, మారిస్‌విల్ మేయర్ టిజే కౌలీ, మేయర్ ప్రో టెం సతీష్ గరిమెల్ల, కౌన్సిల్ సభ్యులు లిజ్ జాన్సన్, స్టీవ్ రావు, కేరీ టౌన్ కౌన్సిల్ సభ్యురాలు సరికా బన్సాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం స్థానికులను మాత్రమే కాకుండా ఉత్తర కరోలినా ,ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన భారతీయులను ఆకర్షించింది. స్థానిక డెల్టా కంపెనీ ఐటీ డైరెక్టర్ స్టెఫనీ షైన్ తోపాటు, ఇతర వ్యాపార ప్రతినిధులు, ఐటీ డైరెక్టర్లు, ఇతర ప్రముఖులు హాజరు కావడం విశేషం.
అతిథులకు భోజనవసతి, శాటిలైట్ పార్కింగ్ నుండి స్టేడియం వరకు రవాణా సౌకర్యం అందించారు. ఈ విజయవంతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి TTGA నాయుకత్వంలో రెండు నెలలు ప్రణాళికా సూత్రాలను అమలు చేశారు.
బతుకమ్మ కోసం ప్రత్యేక పాటను రూపొందించి మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమం TTGA అధ్యక్షుడు మహిపాల్ బిరెడ్డి, ఉపాధ్యక్షురాలు భారతి వెంకన్నగారి, ఈవెంట్ డైరెక్టర్ శశాంక్ ఉండీల, సాంస్కృతిక డైరెక్టర్ పూర్ణ అల్లె, యువత డైరెక్టర్ శ్రీకాంత్ మందగంటి, ఫెసిలిటీ డైరెక్టర్ రఘు యాదవ్, ఫుడ్ డైరెక్టర్ మహేష్ రెడ్డి, కోశాధికారి రవి ఎం, కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ స్వాతి గోలపల్లి, మెంబర్షిప్ డైరెక్టర్ ఉమేష్ పారేపల్లి, కమ్యూనికేషన్ డైరెక్టర్ మాధవి కజా నాయకత్వంలో విజయవంతంగా సాగింది.
ఈ బతుకమ్మ వేడుకలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటించడంతో పాటు, ఉత్తర కరోలినాలో భారత సాంస్కృతిక ఉత్సవాల పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక బంధాలను మరింత బలపరుస్తూ విజయవంతంగా ముందుకు సాగుతుందని TTGA ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment