ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు | Celebrated Bathukamma 2024 festival in Dublin Ireland | Sakshi
Sakshi News home page

ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Published Sun, Oct 13 2024 5:17 PM | Last Updated on Sun, Oct 13 2024 5:17 PM

Celebrated Bathukamma 2024 festival in Dublin Ireland

ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను  గణంగా  నిర్వహించారు . డబ్లిన్‌ నగరంలో  30 మంది వాలంటీర్స్ కలిసి ఈ  బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహించారు. గత 12  సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలని వాలంటీర్లు మరియు దాతల సహాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు మరియు నలభై మంది దాతలు ముందుకొచ్చి  బతుకమ్మ వేడుకలు జరుపుటకు ప్రతి సంవత్సరం  సహాయ సహకారాలు అందిస్తున్నారు.


ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు  900 మంది హాజరయ్యారు. ఈ వేడుకలో అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం,  దాండియా  ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ మరియు  దాండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి.  

మన సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి  పిల్లలకి తెలియచేయాలని లక్ష్యంతో  Telanganites Of Ireland వారు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలకు మేజిక్ షో ఏర్పాటు చేశారు. బతుకమ్మను  పేర్చి తీసుకువచ్చిన  ఆడపడుచులకు బహుమతి ప్రధానం చేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, సాయంత్రం తేనీరు, స్నాక్స్, రాత్రి రుచికరమైన  వంటలు వడ్డించారు. ఈ బతుకమ్మ సంబరాలు జరుపుటకు మాకు సహకరించిన వాలంటీర్లు, దాతలు సిల్వెని  శ్రీనివాస్, ప్రభోద్ మేకల, కోలన్ కమలాకర్ రెడ్డి, జగన్ మేకల, సాగర్ సిద్ధం, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి యాలుక, షరీష్ బెల్లంకొండ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్  అల్లే, వెంకట్ తిరుకోవలురు, సుమంత్  చావా, ప్రవీణ్లాల్, రామకృష్ణ  కాటేపల్లి, రాజా  రెడ్డి, బాచి  రెడ్డి, నగేష్ పొల్లూరు, శశిధర్  మర్రి, శ్రీధర్ రాపర్తి, రవి  కిరణ్ కుంచనపల్లి, బలరాం  కొక్కుల, సునీల్  పాక, శంకర్  బెల్లంకొండ, వెంకట్ జూలూరి, శ్రీనివాస్  కార్ఫె, శ్రీనివాస్  అల్లంపల్లి, పటేల్ శ్రీనివాస్, శ్రీనివాస్  వెచ్చ,  దయాకర్  కొమురెల్లి, సంతోష్  పల్లె, శ్రీధర్  యమసాని, నరేందర్  గూడ, సంపత్ రాజ్, భాను సామ, భాను ప్రకాష్ నడుకుడ, భాను బొబ్బల, కృష్ణ మోహన్ రెడ్డి, గోపి కల్లూరి, అరవింద్ కరింగుల, ఓం ప్రకాష్, రామ బొల్లగొని, రాకేష్ ఆకుల, విజేయేందర్ సంతపూరు, మధు పోలం, మహేష్ అలిమెల్ల, కళ్యాణ్ కుసుమ, వినోద్ నీలం, శంకర్ కురుగుంట్ల, లింగమూర్తి, ప్రకాష్ గుండవేని, అరుణ్ కథేరీ, సంతోష్ పారేపల్లి, శ్రీధర్ మేడిశెట్టి, వెంకట్ మంచుకొండ, సాయినాథ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కొసనం, వెంకట్ రామిడి, సురేష్ వసుకుల, విద్యనాథ్ మాదారపు, ఉపేందర్ గార్లపాటి, అనిల్ దుగ్యాల, వీరకుమార్ తిక్క, ప్రకాష్ గందె, రవికాంత్ దూలం, త్రినేష్ అందుర్తి, భువనేశ్వర్ రెడ్డి, సంకీర్త్ రెడ్డి   .

(చదవండి: యూకేలో రీడింగ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనం)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement