యూకేలోని రీడింగ్‌లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. రీడింగ్ జాతర బృందం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకలకు సుమారు వెయ్యి మంది హాజరైనట్లు అధ్యక్షులు విశ్వేశ్వర మంథని, ఉపాధ్యక్షులు ప్రసాద్ అవధానుల తెలిపారు. ఈ వేడుకను రంజిత్, రమేష్, రఘు, చైతన్య, నటరాజ్, చందు, ప్రవీణ్, రామ్రెడ్డి, శ్రీనివాస్ నేతృత్వంలోని కోర్ టీమ్ ఎంతో శ్రద్ధగా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆడిన బతుకమ్మ, దాండియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
అందరూ భక్తిశ్రద్ధలతో అష్టలక్ష్మీ పూజలు చేసుకున్నారు. ఈ వేడుకలో ప్రముఖ గాయని కారుణ్య సంప్రదాయ బతుకమ్మ పాటలతో మరింత ఉత్సాహాన్ని నింపి అలరించారు ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి వలంటీర్లు తెలంగాణ ప్రత్యేక వంటకాలు వడ్డించారు, విందులో మామిడి లస్సీ కూడా అందజేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ వేడుకలు ప్రవాసులకు వారి జన్మస్థలంలోని సంప్రదాయాలను గుర్తుచేయడమే గాక సాంస్కృతిక ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో పాల్గొన్నవారు 360 ఫోటో బూత్‌ను ఉపయోగించి బతుకమ్మతో ఫోటోలు దిగి ఆనందాన్ని పంచుకున్నారు. తర్వాత దుర్గా దేవికి ఆరతితో కార్యక్రమం ముగుస్తుంది. సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుకలో ఉన్నతమైన సాంస్కృతిక వైభవం, భక్తి మరియు ఆనందాన్ని ప్రతిబింబించింది.
(చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ పండగ సంబరాలు)
Comments
Please login to add a commentAdd a comment