హైదరాబాద్: భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రిలయన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో శుభప్రదమైన బతుకమ్మ పండగ సమయంలో వినియోగదారులకు దగ్గర కావడం కోసం చిన్న పట్టణాల్లో ఒక పోటీ నిర్వహిస్తుంది. పూలతో దేవుడిని కొలిచే దేశంలో.. ఆ పూలనే దేవతగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. ఆడపడుచులు వివిధ రకాల పూలతో, రకరకాల పిండి వంటలతో గౌరీదేవిని పూజిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను బతుకమ్మగా పేర్చి, ఆటపాటలతో పూజించి దగ్గరలోని చెరువుల్లో నిమజ్ఞనం చేస్తారు.
ట్రెండ్స్ బతుకమ్మ సెల్ఫీ పోటీ
ఈ పండగ తెలంగాణాలోని చిన్న పట్టణాలలో మరింత ప్రత్యేకతని సంతరించుకుంది. రిలయెన్స్ ట్రెండ్స్ తెలంగాణాలో చిన్న పట్టణాలలో వినియోగదారులు కోసం బతుకమ్మ ఇతివృత్తంతో ఒక ఆసక్తికరమైన పోటీని ఏర్పాటు చేసింది. ఈ పోటీలో భాగంగా గౌరీ దేవిని ఇళ్లల్లో పూజించే సమయంలో బతుకమ్మతో కలిసి మీరు తీసుకున్న సెల్ఫీని ట్రెండ్స్ వారి ప్రత్యేకమైన వాట్సాప్ నంబర్ కు ఎంట్రీ కోసం పంపించాల్సి ఉంది.(చదవండి: భారత ఎకానమీపై ప్రపంచ బ్యాంకు కీలక వ్యాఖ్యలు..!)
'ఉత్తమంగా అలంకరించబడిన బతుకమ్మ'గా నిర్ణయించిన సెల్ఫీ/ఫోటోకు మొదటి బహుమతిగా రూ.1500 విలువ గల గిఫ్ట్ కార్డ్, 2వ బహుమతి కింద రూ.1000 విలువ గల గిఫ్ట్ కార్డ్ అందించనున్నారు. అంతే కాదు, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ట్రెండ్స్ వారికి డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది. ఈ కూపన్ మీ దగ్గరలో ఉన్న చిన్న పట్టణంలో ట్రెండ్స్ స్టోర్ నుంచి తీసుకోవాలి. ఈ పోటీ 2021 అక్టోబర్ 14న ముగుస్తుంది. మరిన్ని వివరాలు కోసం మీ పట్టణంలో ఉన్న ట్రెండ్స్ స్టోర్ సంప్రదించండి.
Comments
Please login to add a commentAdd a comment