
రాయికల్: లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరం, దుబాయ్‌లో తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం, డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆదివారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి, తెలంగాణ రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు హాజరయ్యారు.
సుమారు 2 వేల మంది మహిళలు సంబరాల్లో పాల్గొనగా.. వారితో ఎమ్మెల్యే కొండా సురేఖ బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఫోరం వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్ గౌడ్, గౌరవ చైర్మన్ ప్రమోద్ పాల్గొన్నారు. దుబాయ్‌లోని తెలంగాణ గల్ఫ్ సంక్షేమ సంఘం, డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకులు, డెన్మార్క్‌లో తెలంగాణ జాగృతి నిర్వాహకులు క్రాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.