అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. యూఏఈలోని వందలాది మంది తెలంగాణ మహిళలు చిన్నారులు తెలంగాణ నుంచి తీసుకువచ్చిన పువ్వులతో బతుకమ్మను తయారుచేసి అందులో గౌరీదేవిని ప్రతిష్టించి పూజలు చేశారు.
బతుకమ్మను కోలాటాల మధ్య ఆడిటోరియం కు తీసుకువచ్చి బతుకమ్మ ఆటలాడారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్నాథ్ అశోక ను. కౌన్సిలర్ ఆర్ బాలాజీ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజా శ్రీనివాస్ గోపాల్ వంశీ కమలాకర్ శ్రీనివాస్ సాగర్ గంగన్న సంతోష్ జగదీష్ శ్రీనివాస్ రెడ్డి పావని అర్చన పద్మజ లక్ష్మీ సుధా పాల్గొన్నారు.
(చదవండి: జర్మనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు)
Comments
Please login to add a commentAdd a comment