యూఏఈలో ఘనంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. యూఏఈ రాజధాని అబుదాబిలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదికగా బతుకమ్మ ఉత్సవాల్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వందలాది మహిళలు ప్రాంగణాన్ని బతుకమ్మ పాటలతో మారు మ్రోగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఒక చోట చేరి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్‌లో సందడి చేశారు. ప్రముఖ కవి గాయకుడు,తెలంగాణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, వర్ధమాన గాయని వరంలు పాటలతో అలరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా యుఏఈ భారత రాయబార కార్యాలయం కాన్సులర్ బాలాజీ, అతని కటుంబ సభ్యులతో పాటు ఐఎఫ్‌ఎస్ అధికారులు హాజరయ్యారు. అనంతరం బతుకమ్మ వేడకుల్లో పాల్గొన్న వారికి నిర్వాహులకు బహుమతులు అందజేశారు. ఏ ఎక్స్ ప్రాపర్టీస్, స్క్వేర్ యార్డ్స్ , ఎస్పాకో, ఆసమ్ సలోన్, ట్రై కలర్ ప్రాపర్టీస్, జి బి హాలిడేస్, అజంతా జ్యువెలర్స్, ఎల్ఐసి ఇంటర్నేషనల్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు. చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మను నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమాన్ని గోపాల్, వంశీ, కమలాకర్, శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్, రాజశ్రీనివాస రావు, అశోక్ , శ్రీనివాస్ రెడ్డి, పావని, అర్చన, వనిత, మంజు, సౌజన్య , లక్ష్మి, సుధ తదితరులు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment