
సిడ్నీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆస్ట్రేలియన్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్(ఏటీఎస్‌ఏ) ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోనే అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో 1500 మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు.
నార్త్ మీడ్ హైస్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు కోలాటం, బతుకమ్మ ఆటా, పాటలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. అనంతరం అక్కడికి కిలో మీటరు దూరంలో ఉన్న పరమట్టా నది దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించి, మరోసారి బతుకమ్మ ఆడి నిమజ్జం చేశారు.



