బల్కంపేటలో బతుకమ్మ ఆడిన కవిత.. యాదాద్రిలో ఘనంగా వేడుకలు | Grand Batukamma Celebrations Across Telangana | Sakshi
Sakshi News home page

బల్కంపేటలో బతుకమ్మ ఆడిన కవిత.. యాదాద్రిలో ఘనంగా వేడుకలు

Oct 3 2022 9:22 AM | Updated on Oct 3 2022 2:55 PM

Grand Batukamma Celebrations Across Telangana - Sakshi

సీఎం సతీమణి శోభ వెళ్లిపోగా.. కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సతీమణి స్వర్ణ, మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలోని తూర్పు రాజగోపురం ముందు తిరువీధిలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానిక మహిళలు పెద్దఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ ఆడారు. కూచిపూడి కళాకారుల  నృత్యాలు వేడుకల్లో ఆకర్షణగా నిలిచాయి.  

బల్కంపేట ఎల్లమ్మ వద్ద..
సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కూతురు ఎమ్మెల్సీ కవిత ఆదివారం బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి సాదర స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం సతీమణి శోభ వెళ్లిపోగా.. కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సతీమణి స్వర్ణ, మహిళా పోలీసులతో కలిసి బతుకమ్మ ఆడారు. 

అబుదాబిలో బతుకమ్మ సంబరాలు
రాయికల్‌ (జగిత్యాల):  అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం  బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉంటున్న తెలంగాణవాసులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. మహిళలు  గౌరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా భారత రాయబారి కార్యా లయ కౌన్సిల్‌ ఆర్‌.బాలాజీ హాజరయ్యారు.
చదవండి: భారీ బతుకమ్మల కోసం విదేశాల నుంచి పూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement