యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు.
దీంతో శ్రీ స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటలు పడుతుండగా.. రూ. 150 టిక్కెటగ విఐపి దర్శనానికి 45 నిమిషాల మేర టైం పడుతున్నట్లు భక్తులు చెబుతున్నారు. భక్తులు అధికంగా శ్రీ స్వామివారి సుదర్శన నారసింహ హోమం, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటున్నారు. కొండపైనే ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment