
యాదాద్రి భువనగిరి జిల్లా: మహారాష్ట్రలోని షిరిడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో నలుగురు దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్న ప్రాంతంలో ఈ విషాద ఘటన(Accident) చోటు చేసుకుంది. ప్రమాదంలో నలుగురు అక్కడకక్కడే మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
మృతుల్లో ఆరు నెలల చిన్నారి ఉంది. ఈ ఘటనలో మృతిచెందిన వారంత యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప(Konda gadapa) వాస్తవ్యులుగా గుర్తించారు.
వీరంతా రెండు రోజుల క్రితం షిరిడి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. మృతలంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ప్రేమలత(59, వైద్విక్ నందన్(6 నెలలు), అక్షిత(20), ప్రసన్న లక్ష్మీ(45)లు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment