అట్లాంటా దద్దరిల్లేలా జీటీఏ బతుకమ్మ సంబరాలు! | GTA Atlanta Chapter Conducts Bathukamma Celebrations | Sakshi
Sakshi News home page

అట్లాంటా దద్దరిల్లేలా గ్లోబల్‌ తెలంగాణ అసోసీయేషన్‌ బతుకమ్మ సంబరాలు!

Oct 31 2023 2:41 PM | Updated on Oct 31 2023 2:46 PM

GTA Atlanta Chapter Conducts Bathukamma Celebrations - Sakshi

అట్లాంటా దద్దరిల్లేలా, అమెరికా మారుమ్రోగేలా, తెలంగాణ గర్వపడేలా గ్లోబల్‌ తెలంగాణ అసోసీయేషన్‌(జీటీఏ) బతుకమ్మ సంబరాలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 5 వేలకు పైగా విచ్చేసిన అతిథులతో డెన్‌మార్క్‌ హైస్కూల్‌ కిటకిటలాడింది. తొలి అడుగులోనే బతుకమ్మ సంబరాల చరిత్రలో నూతన అధ్యాయం సృష్ఠిస్తూ గ్లోబల్ తెలంగాణ అసోసీషియేషన్ తమ ఉత్సాహాన్ని, నిర్వహణా సామర్థ్యాన్ని చాటుకున్నారు. జీటీఏ ప్రతిపాదన మేరకు బతుకమ్మ పండుగను గుర్తిస్తూ జార్జియా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్ కెంపు ప్రతినిధుల అధికారిక ప్రకటన ఈ సంబరాల్లో విశిష్ఠ అంశంగా నిలిచింది.  పలు స్వచ్ఛంద సేవా కార్య్రమాలలో అత్యద్భుత సహకారం అందిస్తున్న వీటీ సేవ సంస్థకు సహకరిస్తూ నిర్వహించనున్న పలు సేవా కార్యక్రమాలను ప్రకటించింది.

విశిష్ఠ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన వి. ప్రకాష్ గారు జీటీఏ కార్య నిర్వహణా సామర్ధ్య పటిమను కొనియాడారు. స్టేట్‌ ఆఫ్‌ జార్జియా, సిటీ ఆఫ్‌ జాన్స్‌ క్రీక్‌ ప్రముఖులు విచ్చేయగా ఈ వేదికపై "Meditation" అనే పుస్తకాన్ని విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముస్తాబయిన ఎత్తైన కళాత్మక బతుకమ్మలు అందరినీ అబ్బుర పరుచగా, పరికినీలు పట్టు పంచెలు, పట్టు చీరలు, పలుకరింపుల కోలాహలంతో బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన ఆత్మీయ అతిథులతో కన్నుల పండుగలా అలరించింది జీటీఏ బతుకమ్మ సంబరం. ఆకట్టుకునేలా విభిన్న విక్రయదారుల కోలాహలం, ఘుమఘుమలాడే విందు, సాంస్కృతిక వినోదం, అనురాగ పూరిత ఆతిథ్యం, పిల్లల కేరింతలు, నారీమణుల ఉత్తేజ భరిత బతుకమ్మ ఆటల వాతావరణంతో అందరినీ మంత్రముగ్ధుల్ని గావించింది.

నిర్విరామంగా సుమారు 8 గంటలకు పైగా జీటీఏ బతుకమ్మ సంబరం సాగింది. బతుకమ్మ పాటలకు పరవశించి ఆడిపాడి, బతుకమ్మలను సగౌరవంగా నిమర్జనంగావించగా, యువత అందించిన అద్వితీయ సేవా సహకారాలకు హృదయ పూర్వకంగా అభినందనలు తెలియజేశారు.  అత్యుత్సాహంగా బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ఆడపడుచులకి , గ్లోబల్‌ తెలంగాణ అసోసీయేషన్‌ కోర్‌ టీం సభ్యులకు, అతిథులకు, సహాయ సహకారకులకు, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఇతర సంస్థల కార్యవర్గ బృందానికి, స్పాన్సర్లకు హృదయ పూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంది జీటీఏ సంస్థ. రానున్న కాలంలో మరిన్ని అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియచేయడమే గాక అందుకుగాను అమెరికా తెలుగు ప్రజల ఆదరణాభిమానాలను మద్దతు ఉండాలని కోరింది జీటీఏ అట్లాంటా కార్యవర్గ బృందం.

(చదవండి: లండన్‌లో వైభవంగా చేనేత బతుకమ్మ, దసరా సంబరాలు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement