
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై స్టేట్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు బతుకమ్మ పండుగ సెలవులు ఇవ్వకపోవడం దారుణం. అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించాలి. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలి.
ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే పండుగకు సెలవు ఇవ్వకుండా కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నాడు. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. అంతటి విశిష్టమైన బతుకమ్మ పండుగకు సెలవు ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి?. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? వేరే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారా?. ఉద్యోగులు, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment