చికాగొ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో చికాగొలోని పచావటిలోని బాలాజీ టెంపుల్‌లో అక్టోబర్ 5న బతుకమ్మ, దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు 500 మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహిళలు రంగు రంగుల చీరలు కట్టుకొని రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. తర్వాత గౌరీ పూజను నిర్వహించి బతుకమ్మ ఆడుతూ తమ ఆటపాటలతో అలరించారు. కాగా బతుకమ్మ బాగా ఆడిన మహిళలను ఎంపిక చేసి చీరలను బహుకరించారు. అంతేగాక శ్రీకృష్ణా జువెల్లర్స్ వారి గోల్డ్ కాయిన్స్, జోయాలుక్కాస్ వారి ముత్యాల హారాలను గెలిచిన మహిళలకు బహుమతులుగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment