
కాలిఫోర్నియా : మహిళల కొరకు ఉత్తర అమెరికాలో తెలుగు మహిళల స్త్రీ ప్రగతి, అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA)బతుకమ్మ, విజయ దశమి సందర్బంగా సమావేశమై సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్నికాలిఫోర్నియాలోని సాన్ హోసే నగరంలో నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలు ఆటపాటలతో శనివారం జరిగాయి.
మహిళకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి వారి కళలను సాకారం చేసూకోవడానికి ఈ సంస్థ తోడ్పడుతుందని ఝాన్సీ రెడ్డి గారు మరొకసారి గుర్తు చేసారు. ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్ చైర్, ప్రెసిడెంట్ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు.
ప్రెసిడెంట్ ఎలెక్ట్ "శైలజ కల్లూరి" మాట్లాడుతూ ఈ ఏడాది కరోనా ప్రత్యేక పరిస్థితి నేపథ్యంలో తక్కువ మంది తో, సామజిక దూరాన్ని పాటిస్తూ , మాస్కులు ధరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొంటూ ఈ వేడుక జరుపుకొంటున్నామన్నారు. బతుకమ్మ , దసరా పండుగలు మన సంస్కృతికి చిహ్నంగా జరుపుకొంటున్నామన్నారు. సంస్కృతి సంప్రదాయాలను మనం ఇప్పటి తరం యువతీ యువకులకు, పిల్లలకు నేర్పించినట్లయితేనే మన సంప్రదాయాలను ముందుకు తీసుకు వెళ్లగలమని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో ప్రవాస తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ ముఖ్య సభ్యులు సుగుణరెడ్డి,అనురాధ ఎలిశెట్టి, హైమ అనుమాండ్ల, లక్షి అనుమాండ్ల, పూజ లక్కడి, చిన్మయి ఎరుకల, యశస్వినీ రెడ్డి, జ్యోతి పెంటపర్తి, ప్రశాంతి కూచిబొట్ల కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment