అమెరికాలో వరుస హత్యలు, రోడ్డు ప్రమాదాలు, అదృశ్యం, అనూహ్యమరణాలు కలవరం పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో అదృశ్యం కావడం ఆందోళన రేపింది. ఎన్నో కలలతో ఉన్నత చదువులకోసం అమెరికా పయనం కాబోతున్న భారతీయ యువతకు, అందులోనూ తెలుగు విద్యార్థులకు, తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
హైదరాబాద్‌కు చెందిన కందుల నితిషా (23) మే 28 నుంచి కనిపించకుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీలోని శాన్ బెర్నార్డినోకు చెందిన విద్యార్థిని నితిషా కనిపించడం లేదన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కందుల నితిషా కాలిఫోర్నియాలోని లాసె ఏంజెల్స్ నుంచి కనిపించ కుండా పోయిందని, ఆమె ఆచూకీ లభిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటించారు. కాలిఫోర్నియా లైసెన్స్ ప్లేట్‌తో 2021 టయోటా కరోలాకారులో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని CSUSB చీఫ్ ఆఫ్ పోలీస్ జాన్ గుట్టీరెజ్ ఆదివారం ఎక్స్ వేదికగా ప్రకటన జారీ చేశారు.ఆచూకీ తెలిసినవారు (909) 537-5165 నంబరుకు సమాచారం అందించాలని కోరారు.
కాగా ఇటీవల క్లీవ్ ల్యాండ్ నగరంలో అదృశ్యమైన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ (25) తర్వాత శవమై కనిపించాడు. అలాగే చికాగోలో తెలంగాణకు చెందిన విద్యార్థి రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం లాంటి అనేక ఘటనలు అమెరికాలో మన విద్యార్థుల భద్రతపై ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment