
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరు వులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆట పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు.
విజయాలనందించే విజయ దశమిని స్వాగ తిస్తూ ముగిసే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు.
చదవండి: బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం
Comments
Please login to add a commentAdd a comment