vijayadasami
-
శమీ వృక్షానికీ, దసరా పండుగకు సంబంధం ఏంటి?
శమీ వృక్షానికీ, విజయదశమి పండుగకూ సన్నిహిత సంబంధం. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ‘శమీ’ అంటే అగ్ని అని కూడా అర్థం. అగ్ని అదృశ్యంగా శమీవృక్షంలో నిక్షిప్తమై ఉంటుందని శాస్త్రాలు చెప్తాయి. యజ్ఞాల లాంటి పవిత్ర కార్యాలలో జమ్మి కర్రలు మథించి, అగ్ని పుట్టించి, హోమాలు చేస్తారు. శమీవృక్షం ప్రస్తావన రుగ్వేదంలో, అధర్వ వేదంలో కనిపిస్తుంది. ఇక పురాణ ఇతిహాసాలలో సరేసరి. అంటే, అతి ప్రాచీన కాలం నుంచి భారతీయులు శమీవృక్షాన్ని పవిత్రమైన వృక్షాలలో ఒకటిగా భావిస్తూ వస్తున్నారు.ఇక, ‘విజయ’ అంటే శ్రవణా నక్షత్రంలో కలిసివచ్చే దశమి తిథి. ఇలా కలవటం ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షంలో జరుగుతుంది. ఆ ‘విజయ’ దశమి రోజు సర్వదా శుభదినం. అంటే, మీనమేషాలూ, గోచార, గ్రహచారాలతో నిమిత్తం లేకుండా, ఎలాంటి శుభకార్యాలకైనా విజయదశమి మంచి రోజే!విజయదశమి దసరా నవరాత్రులలో ఆఖరి రోజు. చండముండులూ, మహిషాసురుడూ వంటి రాక్షసులందరినీ 9 రోజుల భీషణ యుద్ధంలో సంహరించిన దుర్గాదేవి, విజయదశమి నాడు విజయిగా, అపరాజితగా నిలిచింది. ఈ అపరాజిత రాజాధి రాజులను కూడా శాసించే శ్రీమహారాజ్ఞి కనుక, విజయదశమినాడు దుర్గాదేవిని రాజరాజేశ్వరిగా అలంకరించడం ఆనవాయితీ. విజయ దశమినాడు అపరాజితా పూజ చేయడం ఇక్ష్వాకుల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. శ్రీరాముడు జమ్మి చెట్టును అపరాజితా దేవి ప్రత్యక్ష స్వరూపంగా భావించి, శమీపూజ ద్వారా దేవి అనుగ్రహం పొంది రావణ సంహారం చేశాడని దేవీ భాగవతం చెబుతోంది. రాజులకు యుద్ధ జయమూ, ఇతరులకు కార్య విజయమూ ఇవ్వగలదు గనక జమ్మి చెట్టు ‘విజయద–శమీ’ వృక్షం. అందుకే ఆబాలగోపాలం విజయదశమి నాడు శమీ పూజ చేసే ఆచారం కొనసాగుతూ వస్తున్నది.చదవండి: దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?పూజ తరవాత అపరాజితా ప్రసాదంగా జమ్మి ఆకులను కోసి తెచ్చుకొని, వాటిని ‘బంగారం’లా దాచుకోవటం, కొన్ని ఆకులను పెద్దల చేతిలో ఉంచి, నమస్కరించి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం, దసరా పూజల సందడిలో భాగం. పనిలో పనిగా, ఆ పరిసరాలలోనే ఎగురుతుండే పాలపిట్టను చూసి, దాని నిసర్గ సౌందర్యాన్ని మెచ్చుకోవటం కూడా శుభకరం అని ఆస్తికుల నమ్మకం. విజయదశమి సందర్భంగా అపరాజితా దేవి ఆశీస్సులు అందరికీ అంది, ఆనందం కలిగించాలని ఆకాంక్షలు!!– ఎం. మారుతి శాస్త్రి -
దసరా పండుగ విశిష్టత ఇదీ!
ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా.దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం.తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము.జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది.మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు.యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా !నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!!పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు.అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది.జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం.విజయదశమి జరుపుకోవటంలోఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం.ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం.‘శమీ శమయతే పాపంశమీ శత్రు వినాశినీ!అర్జునస్య ధనుర్ధారీరామస్య ప్రియ దర్శిని’అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు.ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం.‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం.మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము.మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది.విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.(గతంలో డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు సాక్షి కోసం రాసిన ప్రత్యేక వ్యాసమిది -
ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. ఈ సందర్భంగా దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్రమైన ఈ పండుగ ప్రతికూల శక్తులను అంతం చేయడంతో పాటు మనం జీవితంలో మంచిని అలవరచుకోవాలనే సందేశాన్ని అందిస్తుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దసరా సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ శ్రేయస్సుతో పాటు సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం, ముఖ్యంగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. దేశంలోని తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో మహిషాసురునిపై దుర్గాదేవి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారన్నారు. దేశంలోని ఉత్తర, పశ్చిమ రాష్ట్రాల్లో ఈ పండుగను రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है। Wishing you all a Happy Vijaya Dashami! — Narendra Modi (@narendramodi) October 24, 2023 -
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..
సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు. -
దసరా రోజున.. ఈ మూడు రకాల పక్షులను చూసారో.. ఇకపై విజయాలే!
సాక్షి, కరీంనగర్: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధనవమి వరకు తొమ్మిదిరోజులు దేవీ నవరాత్రులు జరుపుకుని పదోరోజు విజయదశమిని ఘనంగా నిర్వహించుకుంటారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ ఇది. చెడుపై మంచి విజయానికి సూచికగా నిర్వహించుకునే వేడుకే విజయదశమి. దసరా రోజున చేపట్టిన ప్రతీపనిలో విజయం లభిస్తుందని నమ్మకం. అందుకే శక్తి స్వరూపం ఆశీస్సులతో ప్రతిపని చేస్తుంటారు. దసరా అంటే పది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది. రాముడు రావణుడిపై గెలిచిన రోజుగానే గాకుండా పాండవులు వనవాసం వీడుతూ.. జమ్మిచెట్టుపై ఉన్న తమ ఆయుధాలు తిరిగితీసిన రోజు అని కూడా చర్రిత చెబుతోంది. అందుకే దసరా రోజు రావణవధ, జమ్మి ఆకు పూజ చేస్తుంటారు. దుర్గాదేవి మహిషాసురడనే రాక్షసునితో నవరాత్రులు యుద్ధం చేసి విజయం సాధించిన రోజును విజయదశమిగా కూడా చెబుతుంటారు. 'పాల పిట్టల దర్శనం..' దసరా రోజు సాయంత్రం పాలపిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాలపిట్టను చూస్తే పాపాలు, కర్రెపిట్టను చూసే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూసే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. శమీ పూజ విశేషం.. దసరా రోజున శమీ పూజ ప్రత్యేకం. శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విజయదశమి రోజున పూజలు చేసిన జమ్మిచెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో, నగదుపెట్టెలో ఉంచుతారు. దీంతో ధనవృద్ధి జరుగుతుందని ప్రతీతి. శ్రీరాముడి వనవాస సమయంలో కుటీరం జమ్మిచెట్టు చెక్కలతో నిర్మించారని చెబుతారు. శమీ అంటే పాపాల్ని, శత్రువులను నశింపచేసేదిగా, అందుకే జమ్మి చెట్టుకు అంత ప్రాముఖ్యం. ఆయుధ పూజ మహిషాసురుడిని వధించడానికి దుర్గదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలు తమ ఆయుధాలను అందించడంతో ఆదిశక్తి మహావిరాట్ రూపాన్ని సంతరించుకుంది. హిమవంతుడు ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుడిని వధించి వి జయవిలాసిగా మూర్తిమత్వాన్ని చాటుకుంది. అందువల్లే పూర్వం రాజులు ఆయుధాలను పూజించేవారు. ఆ ఆచారంతోనే దసరా రోజు యంత్రం, వా హన, పనిముట్లకు పూజలు చేయడం ఆనవాయితీ. బంగారం ఇచ్చి ఆశీర్వాదం! పెద్ద, చిన్న తేడా లేకుండా అందరూ కలిసి జమ్మిచెట్టు ఆకులను కుంకుమ కలిపిన బియ్యంలో కలుపుతారు. పూజ చేసిన జమ్మి, ఆకులు, బియ్యాన్ని ప్రతి ఒక్కరు తీసుకవెళ్తారు. దీనిని బంగారం అని పిలుస్తారు. ఈ బంగారం తీసుకెళ్లి తల్లిదండ్రులకు, పెద్దలకు చేతిలో పెట్టి ఆశీర్వాదం పొందడం అనవాయితీ. ఒకరికి ఒకరు ఇచ్చుకుని అలయ్‌బలయ్ చేసుకుంటారు. -
Dussehra 2023: విజయ దశమి విశిష్టత ఏంటంటే.?
ముక్తి కోసం సాధన చేసేందుకు ఉపకరించే దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఆసేతు హిమాచలం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగలలో ఒకటైన ఈ దసరా గురించి... దసరా అంటే పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పోగొట్టేది అనే అర్థం కూడా వ్యాప్తిలో ఉంది. ఈ పది రోజుల పండుగని ‘నవరాత్ర వ్రతం‘ అనీ, ‘దేవీ నవరాత్రులు‘, ‘శరన్నవరాత్రులు‘ అని వ్యవహరిస్తాం. తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్ర వ్రతం. తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించటమంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. తొమ్మిది రోజుల దీక్ష వలన పదవరోజు విజయం లభిస్తుంది. అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది. కనుక పదవ రోజును ‘విజయదశమి‘ పేరిట పండుగ జరుపుకుంటాము. జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదనాన్ని, మహిమను గురించి, దేవీ భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు వివరిస్తాయి, త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గ, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమా, శివదూతి, స్వాహా, స్వధా, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి ఇటువంటి అనేకమైన నామాలతో ఆరాధనలందుకుంటోంది. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృత పరిచే, దైవ అనుగ్రహంతో, మంత్ర శక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృత పరిచే ఒక వ్రతం ఈ నవరాత్ర వ్రతం. అందుకే దసరా నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా, గాయత్రీ మాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మి దేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా, సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసుర మర్దినిగా, దశమినాడు జయా విజయా సహిత అపరాజితా దేవిగా – రాజరాజేశ్వరీ దేవిగా ఆరాధిస్తాం. తొమ్మిది రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ, నామ మంత్ర జపం, నామ పారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ దశమినాడు చక్కగా జగన్మాతను షోడశోపచారాలతో పూజించి, అనేక విధాలైన పిండివంటలు తయారు చేసి, నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ పెట్టి, ఆరగిస్తాం. ఆదిపరాశక్తిని లక్ష్మీ, గాయత్రీ, సరస్వతీ, రాధ, దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు. యా దేవీ సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థితా ! నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః!! పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ జరుగుతున్నాయి. ఆదిపరాశక్తి ప్రకృతి అయితే, పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి యేర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం. ఈశ్వరుడని కొలిచినా, విష్ణువు అని కొలిచినా, జగన్మాత అంబిక అని కొలిచినా ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఉపనిషత్తులు బోధిస్తున్నాయి. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్ఛక్తినే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధిస్తున్నాము. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దునుమాడిన వైనాన్ని కీర్తించారు. అమ్మవారు దేవతలకు – ఎప్పుడు దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా, తాను అవతరించి, దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. జగన్మాత, యోగ నిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును జాగృత పరిచి, మధు కైటభులనే రాక్షసులను సంహరింపజేసింది. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా, దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు, రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాలను గురించి చెప్పారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి, వెలుగు రూపంలో బయటకొచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటికి వచ్చి, ఆ సమష్టి తేజస్సు ఒక మహాద్భుత రూపం దాల్చి, అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా, ఆదిపరాశక్తి ్తగా భాసించింది. ఈ తల్లిని దేవతలు ‘అమ్మా! నీవే సర్వకారణభూతురాలివి, కార్య కారణ రూపిణివి, క్రియా రూపిణివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు. కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే, చలనం, స్పందన ఉండదు అని జగద్గురువు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించి మహిషాసురమర్దినిగా కీర్తించబడింది. జగన్మాతే ధూమ్రాక్షుడిని, రక్తబీజుడిని, చండ, ముండులను, శుంభ, నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు. కానీ స్త్రీ అంటే చులకన. ఆడవారు మననేం చేస్తారులే! అనే చులకన భావన స్త్రీల మీద! కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మీ , వైష్ణవి, మహేశ్వరి, కౌమారి, ఐంద్రీ, వారాహి, నారసింహీ, చాముండా, శ్యామలా, కాళీ మొదలైన దేవతాగణాలను ఉద్భవింపజేసి, వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి, దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రులలో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనం కీర్తిస్తాం, ఆరాధిస్తాం. విజయదశమి నాడు, జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుంటాం. విజయదశమి జరుపుకోవటంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు కానీ హైందవులందరూ ఈ పండుగ జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపబడుతున్నది. మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి.ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి. కాలంలో వచ్చే మార్పులను బట్టి దైవ శక్తిని ఆరాధించటం ఒక భావన అయితే, మనలోని దైవ శక్తిని వృద్ధిపరచుకోవటం, సమాజం లో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది మరొక అంశం. ఈ విజయదశమినాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో కౌరవుల మీద విజయం సాధించి విజయుడు అయ్యాడు. శమీ వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాండీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని పూజిస్తాం. ‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ! అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శిని’ అని చెప్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాం. ఈ విజయదశమి పండగనాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను – శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు. పెద్దలు వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు. ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించినందున, విజయదశమి రోజున ‘రామలీల‘ను ప్రదర్శిస్తారు. రావణ దహనం చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అధివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తూ ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్లుగా.. ఆమె పాలనలో మనందరం క్షేమంగా.. సుఖంగా ఉన్నట్లు భావించుకుందాం. పూజించుకుందాం. ‘‘అఖిలాండేశ్వరీ... చాముండేశ్వరీ.. పాలయమాం గౌరీ... పరిపాలయమాం గౌరీ...’’ అని ప్రార్థిస్తూ... మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం. మహిషం అంటే దున్నపోతు, జంతువు. మహిషాసురుడు అంటే జంతు తత్వం కలిగినటువంటి వాడు. రాజస తామస గుణాలకు ప్రతీకలు రాక్షసులు. మహిషాసురుడిని, చండ ముండులను, శుంభ, నిశుంభులను జగన్మాతసంహరించింది అంటే, మనలోనే ఉన్న కామ క్రోధాది అరిషడ్వర్గాలను, లోభ మోహాలను, అహంకారాన్ని నశింప చేసుకోవాలి అని గ్రహించాలి. చండ ముండాది రాక్షసులు దుర్మార్గమైన, ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతీకలు. కనుక అటువంటి బలహీనతలను జయించాలి. మనలోని రజోగుణాలను, తమో గుణాలను అరికట్టి, సత్వగుణాన్ని వృద్ధి పరచుకుని, శుద్ధ సత్వ గుణాన్ని పొందడానికి సాధన చేయాలి. అది ఈ జగన్మాతను నవరాత్రులలో ఆరాధించడం వలన సాధ్యపడుతుంది. శుద్ధ సత్వ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించగలుగుతాము, పొందగలుగుతాము. మథు, కైటభులు అనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతీకలు. నేను, నాది అనే భావాలకు ప్రతీకలు. మధువు అంటే తేనె. అన్నింటి కంటే మనకు ఇష్టమైనది, తీయనైనది ఎవరికి వారే! ఒక్క నేను అనేది ఉంటే, అనేకమైన నావి, నా వారు, నా బంధువులు, నా అధికారం, నా పదవులు వంటి అనేకమైనవి బయలుదేరతాయి. ఒక్క తేనె చుక్క ఉంటే, అనేకమైన కీటకాలు చుట్టూ చేరినట్లుగా, ఒక్క నేనుకి, అనేకమైన – నావి అనేవి బయలుదేరతాయి. ఈ నేను, నాది అనే అహంకార, మమకార భావాలను సంహరించటమే మధుకైటభములను సంహరించటం. ధూమ్రాక్షుడు లేక ధూమ్రలోచనుడు అంటే పొగ బారిన, మసకబారిన కన్నులు కలవాడు, అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అని అర్థం. కళ్ళు మసకబారినప్పుడు యదార్థం కనిపించదు. అలాగే అజ్ఞానం వలన జ్ఞానం బహిర్గతం కాదు. వివేక జ్ఞానం ఉదయించదు. కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి. రక్తం అంటే రాగం, మోహం. రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం ఆనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి, ఆ రక్తబీజుని శరీరం నుంచి కారే రక్తబిందువులను మింగేసి, ఇంక మళ్ళీ రక్తబీజులు పుట్టే అవకాశం లేకుండా చేసింది. అప్పుడు జగన్మాత వాడిని సంహరించింది. అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో, అప్పుడు జగన్మాత దర్శనం మనకు ప్రాప్తిస్తుంది. విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండగ. ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ, మానవులలోనే దైవీ గుణాలుంటాయి, ఆసురీ గుణాలు ఉంటాయి. మనలోని ఆసురీ గుణాలను పోగొట్టుకుని, దైవీ గుణాలను వృద్ధి పరచుకోవాలి. – డా. తంగిరాల విశాలాక్షి, విశ్రాంత ఆచార్యులు -
విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన: సీఎం జగన్
-
సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పండుగ బతుకమ్మ ఆఖరి రోజు.. సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిండిన చెరు వులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆట పాటలతో, పల్లెలు పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావరణాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. విజయాలనందించే విజయ దశమిని స్వాగ తిస్తూ ముగిసే 9 రోజుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు విజయవంతమయ్యాయని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా సుఖ శాంతులతో జీవించేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. చదవండి: బతుకమ్మ బంగారం.. విదేశీ పూల సింగారం -
పాన్ ఇండియా పార్టీ.. దసరాకు విడుదల!
సాక్షి, హైదరాబాద్: జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దసరాను ముహూర్తంగా ఎంచుకున్నారు. విజయదశమి రోజున హైదరాబాద్ వేదికగా జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ పార్టీ పేరు, పతాకం, ఎజెండా తదితరాలపై ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించేలా పార్టీ ప్రకటన ఉండాలని భావిస్తున్నారు. పార్టీ ప్రారంభానికి జాతీయస్థాయిలో భావ సారూప్యత కలిగిన పార్టీలు, ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులను ఆహ్వానించేందుకు మంతనాలు జరుగుతున్నాయి. కొత్త జాతీయ పార్టీ ప్రకటనను స్వాగతిస్తూ తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరిగేలా సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. పార్టీ ప్రకటన తర్వాత సుమారు రెండు నెలల పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తృతస్థాయిలో పర్యటించేలా షెడ్యూల్ కూడా రూపొందిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. గులాబీ జెండా.. భారతదేశ చిత్రపటం? వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమాతోపాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమ్మేళనంగా కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండా ఉంటుందని అంచనా. రైతులు, దళితులు, సైనికులు, యువత తదితర వర్గాలకు పార్టీ ఎజెండాలో పెద్దపీట వేయనున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ జెండా తరహాలోనే జాతీయ పార్టీ జెండా కూడా గులాబీ రంగులో భారతదేశ చిత్రపటంతో ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీకి ‘భారతీయ రాష్ట్ర్ర సమితి’గా పేరు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషం దాకా పేరుపై సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. జిల్లాల్లో పార్టీ నేతల తీర్మానాలు సుమారు ఏడాదిన్నరగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్న సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీ, పార్టీ సమావేశాలు, బహిరంగ సభల్లో కొత్త పార్టీ ఏర్పాటుకు ఆమోదం కోరుతూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇదే తరహాలో పార్టీ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ నేతలు కూడా ప్రకటన చేయనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ప్రసంగాల్లో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించే అవకాశం ఉందని తెలిసింది. ఇక కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ జిల్లా, మండల స్థాయిలోనూ టీఆర్ఎస్ నేతలు తీర్మానాలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కీలక టీమ్‌లో వినోద్, కవిత? కొత్త జాతీయ పార్టీ విస్తరణకు అవసరమైన టీమ్‌ను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. వీరితోపాటు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ తదితరుల సేవలను కూడా కొత్త జాతీయ పార్టీలో కేసీఆర్ ఉపయోగించుకుంటారని సమాచారం. రేపు రాష్ట్రానికి జేడీఎస్ నేత కుమారస్వామి ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పలువురు బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలు, ముఖ్య నేతలతో కేసీఆర్ వరుసగా భేటీలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా కేసీఆర్ ఆహ్వానం మేరకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో చిన్నా, చితకా ప్రాంతీయ పార్టీలు, దేశవ్యాప్తంగా పేరొందిన కొందరు ప్రముఖ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆయా పార్టీల విలీనం, చేరికలకు సంబంధించి ఇప్పటికే మంతనాలు పూర్తయినట్టు సమాచారం. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన తర్వాత.. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే దేశవ్యాప్త పర్యటనల ద్వారా కొత్త పార్టీ విస్తరణ, బలోపేతం దిశగా కృషి చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ఎన్నికలే టార్గెట్‌గా ఇన్‌చార్జ్‌ల నియామకం.. బీజేపీ మాస్టర్ ప్లాన్స్! -
శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూర్ణాహుతితో దసరా ఉత్సావాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉధృతి కారణంగా ఉత్సవమూర్తులకు నదీ విహారం రద్దు చేశారు. చదవండి: Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాంకాంక్షలు. #HappyDussehra — YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021 -
బెల్లం మార్కెట్‌కు దసరా జోష్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్ దసరా జోష్‌తో కళకళలాడింది. ప్రతి ఏటా ప్రధానమైన పండగలకు బెల్లంతో తయారు చేసే పిండి వంటలను దేశంలోని పలు ప్రాంతాల వారు వండుతారు. ఈ క్రమంలోనే బెల్లానికి గిరాకీ పెరుగుతోంది. సహజంగా క్వింటాలుకు రూ.3500 పలికే అనకాపల్లి బెల్లం మార్కెట్లో క్వింటాలు బెల్లం ధర అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రకం బెల్లం గరిష్టంగా రూ.4,720 పలకడంతో మార్కెట్వర్గాల్లో జోష్ కనిపించింది. మే నెలాఖరు నాటికి దాదాపు బెల్లం తయారీ పూర్తవుతుంది. ఆ తర్వాత రైతులు తయారు చేసిన బెల్లాన్ని వర్తకులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతారు. ఈ బెల్లం అంతా రోజు వారీ కార్యకలాపాలతో పాటు ఉత్సవాలకు అవసరమైనప్పుడు దశలవారీగా కోల్డ్ స్టోరేజీ నుంచి బెల్లాన్ని తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటారు. దసరా వచ్చిన వెంటనే బెల్లం తయారీకి రైతులు పూనుకున్నప్పటికీ మొదట్లో తయారు చేసిన బెల్లాన్ని దేవునికి సమర్పిస్తారు. ఈ కారణంగా కొత్త బెల్లం అధికంగా దసరా తర్వాత నుంచి మార్కెట్‌కు వస్తుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ మార్కెట్లోనూ బెల్లానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం ధర అనూహ్యంగా పుంజుకుంది. అనకాపల్లి మార్కెట్ నుంచి బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తారు. అక్కడి వర్తకులు ఈ బెల్లాన్ని కొనుగోలు చేసుకుని పండగ సమయంలో విక్రయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి బెల్లానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ చంద్రన్న కానుక కోసం అవసరమైన బెల్లాన్ని సరఫరా చేసే టెండర్‌ను గుజరాత్ వర్తకులకు అప్పగించారు. అప్పుడు కనీస టర్నోవర్ నిబంధనను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో పేరొందిన అనకాపల్లి బెల్లానికి డిమాండ్ లేకుండా చేశారు. ఈ ఏడాది దసరా ముందురోజైన సోమవారం అనకాపల్లి మార్కెట్‌కు 1504 దిమ్మలు రాగా మొదటి రకం క్వింటాలుకు గరిష్టంగా రూ.4720, మూడో రకం కనిష్టంగా రూ.2850 పలికింది. బెల్లం ధర అధికంగా పలకడంతో చెరకు రైతులు దసరా తర్వాత నుంచి బెల్లం తయారీపై మరింత మక్కువ చూపే అవకాశముంది. -
సుస్వనతో విజయదశమి
-
కిటకిటలాడుతున్న దేవాలయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. వినాయక ఆలయం నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనం నిలిపివేశారు. అలాగే 100, 300 రూపాయల టికెట్ల విక్రయం రద్దు చేశారు. భక్తులను సాధారణ క్యూలైన్లతో పాటు ముఖ మండప దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దసరా సందర్భంగా కొండగట్టుపై భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులకు అంజన్న దర్శనమిచ్చారు. దసరా సందర్భంగా తమ వాహనాలకు పూజలు చేయించడానకి వాహనదారులంతా కొండగట్టుకు క్యూ కట్టారు. పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అదేవిధంగా నిజరూప అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే పోలీసుల ట్రాఫిక్ అంక్షలు విధించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా శతచండీయాగం జరిగింది. సిద్దిరాత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. బలిహరణ, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం శమీపూజకు యోగా, ఉగ్ర వెంకటేశ్వర స్వామి రానున్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వెంకటేశ్వరస్వామి శేషవాహనసేవను నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు శమీపూజ, 6.30కు తుంగభద్ర నదీ హారతి ఉండనుంది. రాత్రి 7 గంటలకు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి వాళ్లకు తెప్పోత్సవం జరగనుంది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిద్దిదా(మహాలక్ష్మీ) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం పూర్ణాహుతితో నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి. బాసరలో మహర్నవమి సందర్భంగా సరస్వతీ యాగం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి మహాభిషేకం, అలంకరణ చేశారు. దసర సందర్భంగా అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మహా మంగళ హారతి నివేదన ఉండనుంది. సాయంత్రం 4 గంటల నుంచి పురవీధుల్లో అమ్మవారి రథోత్సవం, సాయంత్రం 6.30 కు ఆలయం ముందు శమీ పూజ ఉండనుంది. -
రెండు అవతారాల్లో దర్శనమివ్వనున్న దుర్గమ్మ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఆఖరి రోజుకు చేరాయి. మహర్నవమి, విజయదశమి ఒకే రోజు రావడంతో అమ్మవారు రెండు అవతారాలలో దర్శనమివ్వనున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మహిషాసురమర్ధని అవతారంలో, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వరీ దేవీ అవతారంలో కనిపించనున్నారు. మధ్యాహ్నాం 1.30 గంటలకు యాగశాలలో పూర్ణాహుతితో దసరా ఉత్సవాల ముగింపు ఉంటుంది. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారి అంతరాలయ దర్శనం, ఆశీర్వచనాలు నిలిపేశారు. ఆలయంలో భక్తులకు లఘు దర్శనానికి మాత్రం అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్లకు హంస వాహనంపై ఊరేగించనున్నారు. విజయదశమి సందర్భంగా ఇంద్రకీలాద్రిని భారీ సంఖ్యలో భవానీ దీక్ష చేసే వారు దర్శించుకుంటున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం కొండ కింద దీక్షలు విరమిస్తున్నారు. భవానీల కోసం ప్రత్యేకంగా హోమ గుండాలు ఏర్పాటు చేశారు. ఐదు రాష్ట్రాల నుంచి భవానీలు వస్తున్నట్లు సమాచారం. -
భక్తులను అనుగ్రహించే భ్రమరాంబా దేవి
శ్రీశైలం భూమండలానికి కేంద్రస్థానం. ఇది జ్యోతిర్లింగక్షేత్రమే కాదు, అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరవది కూడా. ఇక్కడ సతీదేవి శరీరభాగాల్లో కంఠభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి. మల్లికార్జున స్వామివార్కి పశ్చిమభాగంలో అమ్మవారు కొలువై ఉంది. ఈ విషయాన్ని స్కాందపురాణాంతర్గతమైన శ్రీశైలఖండం కూడా చెప్పింది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు తనకు సకల దేవ, యక్ష, గంధర్వ, పురుష, స్త్రీ, మృగ, జంతు జాలంతో మరణం కలుగరాదని బ్రహ్మతో వరం పొందాడు. వరగర్వంతో సకల లోకాలవారినీ హింసించసాగాడు. దీంతో అందరూ అమ్మవారిని శరణు వేడుకున్నారు. అప్పుడు అమ్మవారు భ్రమరరూపం ధరించి అరుణాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడింది. అరుణాసురసంహారం తరువాత భక్తుల విన్నపంతో శ్రీగిరిపై స్థిరంగా వెలిసింది. అమ్మవారి మూలమూర్తి స్థితరూపంలో నిలుచుని ఎనిమిది చేతులతో కుడివైపు చేతులలో త్రిశూలం, చురకత్తి, గద, ఖడ్గం వంటి ఆయుధాలు, ఎడమవైపు మహిషముఖాన్ని బంధించి, డాలు, రక్తపాత్ర, అమృతఫలం ధరించి ఎడమకాలిని మహిషం (దున్నపోతు) వీపుపై అదిమిపెట్టి త్రిశూలంతో కంఠభాగంలో పొడుస్తూ మహిషాసురమర్ధిని వలె కనిపిస్తుంది. అయితే అమ్మవారి ఈ ఉగ్రరూపాన్ని భక్తులు తట్టుకోవడం కష్టం కనుక సౌమ్యరూప అలంకరణతో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపాన్ని విజయదశమి నాడు ఉత్సవమూర్తికి అలంకరించి భక్తులకు దర్శించుకునే వీలు కల్పిస్తారు. ఈ అమ్మవారిని తెలుగు ప్రాంతాలనుండే గాక కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుండి దర్శించడానికి వస్తారు. కన్నడ ప్రజలు భ్రమరాంబాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా, మల్లికార్జున స్వామిని అల్లుడుగా భావించి అమ్మవారికి చీర, సారె, పండ్లు, పూలు సాంగెం పెట్టే సంప్రదాయం నేటికీ ఉంది – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
-
బాలయ్య ఎన్టీఆర్‌కు పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’
హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంపై వివాదస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఎవరు ఏమన్నా.. సినిమా తెరకెక్కించి తీరుతానని తేల్చిచెప్పారు రాం గోపాల్ వర్మ. తాజాగా విజయ దశమి రోజు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను ప్రారంభించనున్నట్టు వర్మ ప్రకటించారు. కొత్త ఏడాది జనవరి చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. లక్ష్మి పార్వతి తన జీవితంలో ప్రవేశించడాని కంటే ముందే ఎన్టీఆర్ మరణించే వారని, కానీ ఆమె ఆయన జీవితంలోకి వచ్చాక, లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవితం ప్రారంభమైందని తెలిపారు. తిరుపతిలో అక్టోబర్ 19న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముంబైకు చెందిన వ్యాపారవేత్త బాల గిరితో పాటు మరికొంతమంది అతిథులు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా, తండ్రి ఎన్టీఆర్ జీవితం కథలోనే తాను ప్రధాన పాత్ర పోషిస్తూ బాలకృష్ణ.. ఎన్టీఆర్ సినిమాను చేస్తున్నారు. ఆ సినిమాకు డైరెక్టర్ క్రిష్. బాలకృష్ణ, ఎన్టీఆర్‌గా చేస్తున్న ఆ సినిమాకు సంబంధించిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పడికప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్లను పోస్టు చేస్తూ.. చిత్ర బృందం ఆ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా వర్మ ప్రకటించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్‌కు పోటీగా వస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో కోణాన్ని వర్మ స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది. -
కన్నులపండువగా తెప్పోత్సవం..
-
కన్నులపండువగా తెప్పోత్సవం..
-
కన్నులపండువగా తెప్పోత్సవం..
విజయవాడ (వన్‌టౌన్) : త్రిశక్తి స్వరూపిణి.. త్రైలోక్య సంచారిణి.. అమ్మలగన్నయమ్మ.. ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై స్వయంభువై భక్తులను అనుగ్రహిస్తున్న జగన్మాత కనకదుర్గమ్మ. విజయదశమి పర్వదినాన కృష్ణమ్మ ఒడిలో జలవిహారం కన్నులపండువగా జరిగింది. ఆ మహత్తర వేడుకను కనులారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఏటా తండోపతండాలుగా తరలివచ్చారు. తెప్పోత్సవంగా పిలిచే ఈ హంస వాహనసేవ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది. సర్వలోకాలను హింసిస్తున్న దుష్ట రాక్షస గణాలను దుర్గమ్మ వివిధ అవతారాల్లో సంహరించింది. అమ్మవారి విజయానికి సూచికగా విజయదశమి పర్వదినాన్ని జరుపుకొంటారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే దసరా ఉత్సవాల్లో తొలుత గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లను హంసవాహనం అధిష్టింపజేస్తారు. తెప్పోత్సవంగా పేర్కొనే ఈ ఉత్సవంలో వేద పండితుల చతుర్వేద స్వస్తి, అర్చకుల మంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాలు మార్మోగుతుండగా, బాణాసంచా వెలుగుల్లో భక్తుల జయజయధ్వానాల మధ్య హంసవాహనం ముమ్మార్లు కృష్ణమ్మ ఒడిలో విహరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హంస వాహనమే ఎందుకు? దుర్గమ్మ త్రిశక్తి స్వరూపిణి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమే కనకదుర్గమ్మ. ఆ ముగురమ్మలలో మూలానక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారానికి దసరా ఉత్సవాల్లో అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆ అమ్మ వాహనమే హంస. అయితే, ముగురమ్మల వాహనాల సమ్మిళితమే హంస వాహనంగా పేర్కొంటారు. అందుకే ఏటా దసరా ఉత్సవాల్లో చివరి రోజున హంసవాహనంపై దుర్గమ్మను జలవిహారానికి తీసుకువెళ్తారు. త్రిలోక సంచారానికి గుర్తుగా కృష్ణమ్మ ఒడిలో మూడుసార్లు హంసవాహనం తిరుగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా.. 1980వ సంవత్సరానికి ముందు తెప్పోత్సవం నిర్వహించేవారు కాదు. దసరా ఉత్సవాల్లో విజయదశమి రోజున హంసవాహనంపై నదీవిహారం చేయించడం ద్వారా అమ్మ సంతసిస్తుందని చెప్పడంతో ఈవో ఎం.నరసింహారావు సానుకూలంగా స్పందించారు. అప్పట్లో భద్రాచలం శ్రీరామచంద్రమూర్తికి ఈ ఉత్సవాన్ని నిర్వహించేవారు. అప్పటి నుంచి కొద్ది సంవత్సరాలు భద్రాచలం నుంచి హంసవాహనాన్ని తీసుకొచ్చి తెప్పోత్సవం నిర్వహించేవారు. అయితే, రవాణా తలకుమించిన భారంగా మారింది. దీంతో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానమే హంసవాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించింది. నీటిపారుదల శాఖకు చెందిన పంటుపై హంసవాహనాన్ని ఏర్పాటుచేసి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. -
ముగింపు దశకు నవరాత్రి ఉత్సవాలు
-
తెలుగు రాష్ట్రాల సఖ్యతకు దోహదం
విజయదశమి రోజున ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు తెలంగాణ సీఎం కే.చంద్రశేఖర్‌రావు కూడా హాజరు కావడం రెండు రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా హర్షించదగ్గ విషయం. తాను తీసుకువచ్చిన పార్లమెంట్ మట్టిని, యమునానది నీటిని వేదిక మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించడం ద్వారా ప్రధాని రాష్ట్రానికి తన వంతు సహకారం ఉంటుందని సూచించారు. కానీ దాన్ని కేవలం మాటల్లో కాకుండా అక్కడి కక్కడే ప్రకటించి ఉంటే బాగుండేది. అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ హాజరుపై ఏపీ ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ.. రెండింటిలో దేన్నీ ప్రధాని ప్రకటించకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అలాగే ప్రధాని తమ ప్రసంగంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయానికి స్వయంగా వెళ్లి సాదరంగా ఆహ్వానించిన విషయం తనకు ఎంతో సంతోషం కలిగించిందని చెప్పడం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆనందం కలిగించింది. పైగా ఆకార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం ప్రత్యేక అతిథిగా భావించడమేగాక తన వెన్నంటే ఉండేలా చూసి సరైన గుర్తింపు, గౌరవాన్ని కల్పించారు. తెలంగాణ సీఎం తక్కువ సేపు మాట్లాడినా అమరావతి రాజధాని అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని చెప్పడం ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యతకు ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పవచ్చు. ప్రజలు కోరుకునేది ఒకటే.. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలి. తెలుగు ప్రజలందరూ కలిసి మెలిసి జీవించాలి. - కామిడి సతీష్‌రెడ్డి,పరకాల వరంగల్ జిల్లా. -
విజయదశమి
ప్రాచీన కాలం భారతీ యులకు ప్రకృతి పట్ల భయ భక్తులూ, ప్రేమాదరాలూ ఎక్కువ. ప్రకృతి మాతకు కృతజ్ఞతలు ప్రకటించడం ధర్మంగా పూర్వులు భావించేవారు. రుతుచక్ర గతిలో తమ చుట్టూ ఉన్న జగత్తు ఎప్పటికప్పుడు కొత్త అందాలతో కనిపిస్తుంటే స్పందించకుండా ఉండ లేకపోయేవారు. వానలు వెనుకబట్టి నదులూ, చెరువులూ, కుంటలూ మళ్లీ జల సంపదతో కళకళలాడుతుంటే; ఆకాశం నిర్మలమై, మళ్లీ పగళ్లు ఎప్పుడూ లేనంత ఆహ్లా దకరంగా కనిపిస్తుంటే పిండారబోసినట్టు ఒప్పే పండు వెన్నెలలతో శారదరాత్రులు మెరిసిపోతుంటే ఆ ఆనం దంలో అప్రయత్నంగా ‘అమ్మ’వారు గుర్తుకొచ్చేది. దానికి తోడు ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాల వల్ల కూడా ఆశ్వయుజ శుక్లపక్షాన్ని పర్వదినాలుగా జరుపు కునే ఆనవాయితీ ఏర్పడింది. శరత్కాలం కనిపించగానే పులకింతతో భారతీయులు తొమ్మిదిరోజులు సుదీర్ఘమైన నవరాత్రి ఉత్సవం జరుపుకుంటారు. అమ్మలగన్న అమ్మను, అన్ని రకాల అలంకారాలతో ఉపచారాలతో ఆరాధించి ఆనందిస్తారు. అమ్మవారిని ఆరాధించే ఆనవాయితీ శ్రీరామ చంద్రుడి సమయం నుంచి ఉన్నదే. ‘శరదృతువు మొదల యింది. ఆశ్వయుజం ఆరంభమైంది. ఇప్పుడు నువ్వు నవరాత్రి వ్రతం శ్రద్ధగా నిర్వర్తించు. కష్టాలలో ఉన్నప్పుడు ఈ వ్రతం చేస్తే శుభం కలుగుతుంది. రావణ వధ కోసం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చేయాలి. నేనే ఆధ్వర్యం వహించి నీ చేత వ్రతం చేయిస్తాను!’ అని నారదుడు శ్రీరాముడి చేత జగదంబికను ప్రతిష్టింపచేసి ఉపవా సాలూ, నిత్యార్చనలూ, జపాలూ, హోమాలూ యథా విధిగా చేయించగా, అష్టమి నాటి రాత్రి అమ్మవారు ప్రత్య క్షమై ఆశీర్వదించి వెళ్లిందట. దశమి నాడు విజయదశమి పూజ చేసి శ్రీరా ముడు యుద్ధయాత్ర ఆరంభించి దిగ్వి జయం సాధించాడు. వరాల బలంతో అహంకరించి, అన్ని రకాల దుష్కృత్యాలకు ఒడిగడుతూ త్రిమూర్తులను కూడా ధిక్కరించి గెలిచి నిలిచిన మహిషాసురుడిని సకల దేవతా తేజో స్వరూ పిణిగా అవతరించిన జగన్మాత మట్టుపెట్టిన మంచిరోజు విజయదశమి. సాధు రక్షణ కోసం, ‘అజన్మ’ అయిన జగ న్మాత జన్మనెత్తడం,‘అరూప’ అయిన తల్లి మహిషా సుర మర్దని రూపం దాల్చ డం మహాద్భుత లీల. దేవీనవరాత్రులను వంగదేశీయులు వైభవంగా జరుపుకుం టారు. తమ ఇంటి ఆడ పడుచు దుర్గాదేవి ఏడాదంతా రాతి గుండె భర్తతో అష్టకష్టాల కాపురంచేసి నాలుగు రోజులు ఉండి వెళ్లడానికి పుట్టిం టికి వస్తుందని వారు భావిస్తారు. షష్ఠీ, సప్తమీ, అష్టమీ, నవమీ వారితో గడిపి, విజయదశమికి మెట్టినింటికి వెళ్లి పోతుంది. ఆడ పడుచు ఉన్న నాలుగు రోజులూ గొప్ప సంబరం. విజయ దశమినాడు కన్నీరు కారుస్తూ ఆమెకు వీడ్కోలు చెబుతారు. అక్షయ తృతీయలాగా విజయదశమి కూడా అన్ని శుభకార్యాల ఆరంభానికి (ప్రధానంగా అక్ష రాభ్యా సానికి) అనువైన పెట్టని ముహూర్తం. యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా నమః తస్యై, నమః తస్యై, నమః తస్యై, నమో నమః! - ఎం. మారుతిశాస్త్రి -
అలయ్ ‘భలే’య్!
లంబాడ నృత్యాలు.. గంగిరెద్దుల ఆటలు.. బతుకమ్మ పాటలతో జోష్ నోరూరించిన మక్క గారెలు.. సర్వపిండి.. శనగ గుడాలు ఇరు రాష్ట్రాల సీఎంలతోపాటు రాజకీయాలకతీతంగా ప్రముఖులు హాజరు రెండు రాష్ట్రాలూ ప్రేమతో కలిసి ఉండాలన్న గవర్నర్ కళాకారులతో కదం కలిపిన దత్తన్న ఆటపాటలతో అలరించిన గోరటి వెంకన్న హైదరాబాద్: లంబాడ నృత్యాలు, చిందు బాగోతాలు.. గంగిరెద్దుల ఆటలు, బతుకమ్మ పాటలు.. బుర్ర కథలు, హరిదాసు కీర్తనలు.. ఒగ్గు కథలు, దున్నపోతు ఆటలు.. మొత్తంగా అలయ్ బలయ్ అదిరిపోయింది! జొన్న రొట్టెలు.. మక్క గారెలు.. సకినాలు.. యాట కూర.. కోడి పులుసు.. పొట్టు రొయ్యలు.. సర్వపిండి.. పచ్చి పులుసు.. చింత తొక్కు.. శనగ గుడాలతో తెలంగాణ రుచుల కమ్మదనానికి వేదికైంది. విజయ దశమి సందర్భంగా సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ జోరుగా సాగింది. దత్తాత్రేయ స్వయంగా కుటుంబ సభ్యులు, కళాకారులతో కలిసి ఆటలాడి అలరించారు. రాజకీయాలకు అతీతంగా అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పదేళ్లు పూర్తి చేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది అలయ్ బలయ్. ఇన్నాళ్లూ తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా, ఉద్యమకారుల ఆవేదనలు, ఆలోచనలు పంచుకోవడానికి వేదికగా ఉన్న అలయ్ బలయ్... ఈసారి తెలంగాణ రావడంతో ఉత్సాహంగా సాగింది. గవర్నర్‌తోపాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో అధికారిక కార్యక్రమంగా మారిపోయింది. తెలంగా ణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత బతుకమ్మ పాటలు, గోరటి వెంక న్న ఆటపాటలు ఆహుతులను ఆక ట్టుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ స్పీకర్ మధుసూదనచారి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు కె.కేశవరావు, బి.వినోద్‌కుమార్, జితేందర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. నాయకులు సిరిసిల్ల రాజయ్య, రామచంద్రు నాయక్, మల్రెడ్డి రంగారెడ్డి, మురళీధర్‌రావు,ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎవరేమన్నారంటే.. బంధు దత్తాత్రేయ అని పేరు పెట్టాలి: గవర్నర్ రాజకీయాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయకు బంధు దత్తాత్రేయ అని పేరు పెట్టాలని గవర్నర్ నరసింహన్ అన్నారు. పదేళ్లుగా అందరిలో బంధుత్వాన్ని నింపుతున్నారని కొనియాడారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రేమతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. అలయ్ బలయ్‌కి ఐకాన్ దత్తన్న: సీఎం కేసీఆర్ అలయ్ బలయ్ కార్యక్రమం అంటేనే దత్తన్న అని, దానికి ఆయనే ఐకాన్ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమం జరిగే సమయంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరినీ ఇక్కడికి పిలిచేవారని, తెలంగాణ సాధన ప్రణాళికకు ఇది వేదికగా ఉండేదన్నారు. తాను పార్టీ కార్యక్రమంతో ఆదివారం బిజీ అయినప్పటికీ దత్తన్న పిలిచారు కాబట్టి కచ్చితంగా రావాల్సిందేనని, అందుకే వచ్చానని చెప్పారు. ఐకమత్యం లేకనే ఇబ్బందులు: చంద్రబాబు ప్రపంచంలో ఇబ్బందులు రావడానికి కారణం ఐకమత్యం లేకపోవడమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఐకమత్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించడంలో దత్తాత్రేయ సఫలం అయ్యారని, రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలు వేరుగానే ఉన్నా అంతా కలిసి ఉండాలన్నారు. భౌగోళికంగా విడిపోయినా మానసికంగా తెలుగువారంతా కలిసే ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జై ఆంధ్రప్రదేశ్-జై తెలంగాణ-జై తెలుగుదేశం అంటూ నినాదం చేశారు. తెలంగాణ రుచుల కమ్మదనం: స్పీకర్ తెలంగాణ రుచుల కమ్మదనానికి ఈ కార్యక్రమం ఏటా వేదిక అవుతోందని అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఇది ప్రపంచానికి తెలంగాణ రుచుల గొప్పదనం చూపించే కార్యక్రమమని చెప్పారు. కలిసి ఉండాలన్నదే ఉద్దేశం: వెంకయ్యనాయుడు రాయకీయాలు వేరైనా, పార్టీలు వేరైనా, విమర్శలు చేసుకున్నా.. మనం అంతా భారతీయులమని, అంతా కలిసి ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయడు అన్నారు. అలయ్ బలయ్ లక్ష్యం కూడా అదేనని చెప్పారు. టీవీ, సినిమాల వల్ల పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నారని, మన సంస్కృతి సంప్రదాయాలను, యాస, భాషలను కాపాడుకోవాలని..రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఇద్దరు సీఎంలు ప్రేమతో మెలగాలి: దత్తాత్రేయ రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు సీఎంలు ప్రేమ, ఆత్మీయతతో మెలగాలని ఎంపీ బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ కలిసి ముందుకు సాగాలన్నారు. -
కొత్త కార్యాలయంలో బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయదశమి (శుక్రవారం) రోజున సచివాలయం ఎల్ బ్లాక్‌లోని కొత్త కార్యాలయంలోకి ప్రవేశించారు. వేద పండితుల మంత్రాలు, ఆశీర్వచనాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటలకు కొత్త చాంబర్లోకి అడుగు పెట్టారు. వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పూజలు చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఏడు మిషన్లలో ఒకటైన ప్రాథమిక రంగ మిషన్‌పై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లంకల దీపక్‌రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కార్యాలయం, సచివాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ తదితరులు కూడా చంద్రబాబును అభినందించారు. ద్వితీయ విఘ్నం కలగకుండా చంద్రబాబు రెండో రోజు శనివారం తన కార్యాలయానికి వచ్చారు. 6న ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రం ప్రాథమిక రంగ మిషన్‌పై విధానపత్రాన్ని 6వ తేదీన అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చంద్రబాబు విడుదల చేయనున్నారు. -
అందరినీ ఒక్కటి చేసిన రావణదహనం
విజయదశమి సందర్భంగా నిర్వహించే రావణ దహనం కార్యక్రమం అందరినీ ఒక్కటి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ఇలా పలు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులంతా ఒక్క వేదికపై చాలా కాలం తర్వాత కనిపించారు. అలాగే, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు చెందినవారు కూడా ఈ ఉత్సవానికి హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ప్రతి యేటా సుభాష్ మైదాన్‌లో భారీ ఎత్తున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ఈ వేడుకలకు హాజరయ్యారు. దాంతో ఆయనతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏఐసీసీ నాయకురాలు సోనియా గాంధీ తదితరులు కూడా వచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమం నిర్వహించడం పరిపాటి. -
ఫెస్టివల్ దసరా..
హైదరాబాద్ .. గంగాజమునా తెహ్జీబ్కి హంబుల్ విట్నెస్! ఈ సంగమానికి పండుగలను మించిన సందర్భాల్లేవ్! దసరా కూడా అలాంటి ఓ అద్భుత సందర్భమే! భాగ్యనగరంలో ఉన్న దక్షిణ భారతీయులు సరే.. గుజరాతీ, మార్వాడీ, బెంగాలీ, సిక్కులాంటి ఉత్తర భారతీయులను భాగం చేసి సంస్కృతుల సమ్మేళన భాగ్యాన్ని కల్పించింది. విజయదశమి దేశంలోని హిందువులకు ఆనందం పంచే ఉత్సవమే అయినా జరుపుకోవడంలోనే ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. గుజరాతీలు.. మార్వాడీలు.. సిక్కులు వాళ్ల రివాజుల్లోని కొన్నిటిని ఇక్కడి తెలుగువాళ్లకు ఇచ్చి.. ఇక్కడి పద్ధతులను కొన్ని వాళ్లు స్వీకరించారు. దేవీ పూజ మొదలు నివేదన వరకు.. కట్టుబొట్టులోని వైవిధ్యాలు మనకిచ్చారు.. ప్రాంతాచారాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించారు. ఆ భిన్నత్వంలోని ఏకత్వాన్ని కొందరు ఇలా వివరించారు. మీ.. మా.. మన ‘గుజరాతీలకు దసరా అంటే దాండియా.. దాండియా అంటే దసరా! ఈ దాండియా.. హైదరాబాద్ కల్చర్‌లో ఎంత మమేకమైందో వేరే చెప్పక్కర్లేదు. తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మకు.. గుజరాతీల సంప్రదాయ సోయగం దాండియాకు దగ్గరి పోలికలు ఉన్నాయి. తెలంగాణీయులు పూలను పేర్చి గౌరమ్మగా కొలిస్తే.. మేం కుండలో దీపం పెట్టి దుర్గాదేవిగా భావిస్తాం. రెండు సందళ్లూ వృత్తాకార వరుసలో చేరి చేసుకునే పండుగలే. వృత్తాలకు ప్రారంభం ఉండదు.. చివరా ఉండదు. అమ్మవారి శక్తి అంతే.. అది ఆద్యంత రహితం.. అనంతం. వంటకాల్లోనూ ఇక్కడి రుచులను మేం ఆస్వాదిస్తున్నాం. సాధారణంగా గుజరాతీలు అంతగా కారం తినరు. కానీ ఇక్కడున్న మా వాళ్లు మాత్రం కారం ఎక్కువే తింటారు. హైదరాబాదీల మమకారం వల్లే మా వంటల్లో కారం పాళ్లు పెరిగాయి. డ్రెసింగ్ సెన్స్‌లో తేడా కనిపిస్తుంది. మేం సీదా పల్లు అలవాటు చేసుకుంటుంటే.. పండుగలకు ఇక్కడి వాళ్లు గుజరాతీ పల్లును వేసుకుంటున్నారు. ఇక్కడి లంగాఓణీ మా గాగ్రా చోళీ. మీ అలవాట్లు, మా పద్ధతులు.. కలగలసి మన అనే ఫీలింగ్ వచ్చింద’ని అంటారు గుజరాతీ వనిత ప్రముఖ సైకాలజిస్ట్ వందన. చండీపాఠ్.. ‘ఇక్కడి దసరా మాకు చండీపాఠ్ను కొత్తగా నేర్పింది. నవరాత్రుల్లో మేం గురుద్వారాలో చండీపాఠ్ చేస్తాం. ఇక్కడి వాళ్ల దేవీ పారాయణంలా అన్నమాట. ఇది పంజాబ్‌లో ఉండే సిక్కులకు ఉండదు. ఆడవాళ్లమంతా బతుకమ్మ ఆడతాం. దసరా రోజు రావణ దహనంలో పాల్గొంటాం. మేమూ ఆయుధ పూజ చేస్తాం. వంటల విషయానికి వస్తే.. తెలుగింటి రుచులు.. గుజరాతీ ఘుమఘుమలు.. మార్వాడీ మెనూ.. అన్నీ మా వంటింట్లోకి వచ్చేశాయి. హైదరాబాద్ మాకు నేర్పిన కలివిడితనం ఇది’ అని వివరించింది సిక్కు స్త్రీ.. టీచర్‌గా పనిచేస్తున్న అమిత్ కౌర్. త్రిపుర కుమారి... ‘నవరాత్రిలో తెలుగువాళ్లకు మాకు ఉన్న పోలిక.. ఉపవాసం. పూజావిధానంలో కూడా పోలికలున్నాయి. ఇక్కడుండే ఆంధ్రులు నవరాత్రుల్లో కన్నెపిల్లను బాలాత్రిపుర సుందరిగా కొలుస్తారు. ఆ పద్ధతి మాకూ ఉంది. దాన్ని మేము కన్యాకుమారి పూజ అంటాం. ఇక మెనూ విషయానికి వస్తే.. పేనీచెక్కి.. ఇది ఏ ప్రాంతానికి చెందినదో తెలియదు కానీ.., అటు మరాఠీ వాళ్లు.. మేము.. కొందరు తెలుగువాళ్లు కూడా ఈ స్వీట్ చేసుకుంటుంటారు. జమ్మిచెట్టుకు పూజచేసి ఆ ఆకులను ఇంట్లో పెద్దవాళ్లకు ఇచ్చి.. తర్వాత ఇరుగుపొరుగుకు, ఫ్రెండ్స్‌కి ఇవ్వడం ఇక్కడున్న అందరి ఆచారం’ అని చెప్పింది మార్వాడీ మహిళ వేణుదేవి ఠాకూర్. వంటలతోనే మొదలు.. ఏ ప్రాంతంలోనైనా కల్చరల్ ఎక్స్చేంజ్ వంటలతోనే మొదలవుతుంది. వంటకాలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతి.. మెల్లిగా ఆచార వ్యవహారాల్లోకి మారింది. సహజంగా హైదరాబాద్‌కు ఆ లక్షణం ఉంది. ఇది మొదట్నించి హిందూముస్లిం సమైక్యతను చాటిన గడ్డ. ఇక్కడికి ఎవరు వచ్చినా అదే ఒరవడిని కొనసాగించారు. అందుకే అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ హాయిగా మనగలుగుతున్నారు. ఒక్క దసరానే కాదు.. సిటీలో జరిగే ప్రతి పండుగ అన్ని సంస్కృతులను ప్రతిబింబిస్తూ కన్నులపండువగా సాగుతుంది’ అని విశ్లేషించింది ప్రముఖ చిత్రకారిణి అంజనీరెడ్డి. - సరస్వతి రమ -
తెలుగువారికి జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: దుర్గాష్టమి, విజయదశమి సందర్భంగా తెలుగు ప్రజలకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చెడు మీద మంచి సాధిం చిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండు గ తెలుగు ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపాలని బుధ వారం ఆయన ఒక ప్రకటనలో ఆకాంక్షించారు. లోకాన్ని రక్షించే దుర్గామాత ప్రజలందరికీ సుఖ శాంతులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. -
గవర్నర్ దసరా శుభాకాంక్షలు
హైదరాబాద్: విజయదశమి సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంతోషదాయకమైన దసరా పర్వదినాన మానవాళిపై దుర్గామాత తన చల్లని ఆశీర్వచనాలను కురిపించాలని ఆకాంక్షించారు. ఆనందాన్ని పంచాలి: సీఎం కిరణ్ రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాలలోని తెలుగువారందరికీ సీఎం కిరణ్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజలకు దసరా పండుగ ఆనందాన్ని పంచాలని ముఖ్యమంత్రి తన సందేశంలో అభిలషించారు. కొత్త వెలుగులు నింపాలి: జగన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. -
వైభవంగా అమ్మవారి శమీదర్శనం
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: జగములనేలే జగజ్జననీ జయంబునీకు అంటూ భక్తులు ఆదివారం విజయదశమి సందర్భంగా అమ్మవారిని స్తుతించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించి శరణువేడారు. మహానవమి, విజయదశమి వేడుకలను ఆదివారం పట్టణంలో వైభవంగా నిర్వహించారు. విజయదశమినాడు విజయానికి చిహ్నమైన శమీవృక్షాన్ని దర్శించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అందుకే శమీదర్శనానికి దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించే అన్ని ఆలయాల ఉత్సవ కమిటీవారు అమ్మవారికి శమీదర్శనం చేయించేందుకు ఊరేగింపుగా తీసుకువస్తారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీదేవి, శివాలయం, చెన్నకేశవస్వామి, సత్యనారాయణస్వామి, రతనాల వేంటకటశ్వరస్వామి, రాజరాజేశ్వరీదేవి, ఆత్మారామస్వామి ఆలయాల నిర్వాహకులు అమ్మవారిని, స్వామివారిని అత్యంత సుందరంగా అలంకరించి డప్పువాయిద్యాలు, మంగళవాయిద్యాలు, కళాబృందాలు, విద్యుత్‌దీపకాంతుల చెట్లు, బాణసంచా పేలుళ్ల మధ్య కొర్రపాడురోడ్డులోని మిల్లులోని శమీదర్శనం చేయించారు. భక్తులు పెద్ద ఎత్తున ఊరేగింపును తిలకించేందుకు రావడంతో ఆప్రాం తం కిటకిటలాడింది. గ్రామోత్సవంలో కేరళ మహిళా సింగారిమేళం, కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, నృత్య ప్రదర్శనలు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు, ప్రజలు మిద్దెలపైకి ఎక్కి తిలకించారు. కొర్రపాడు రోడ్డు, వివేకానంద క్లాత్ మార్కెట్, రాజీవ్ సర్కిల్, పుట్టపర్తి సర్కిల్ వరకు భక్తులు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.