
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూర్ణాహుతితో దసరా ఉత్సావాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉధృతి కారణంగా ఉత్సవమూర్తులకు నదీ విహారం రద్దు చేశారు.