విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం..
మొదట గుర్తొచ్చేది ఆవిడే..
అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట.
శభాష్ అనిపించుకున్న విజయశాంతి
లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది.
రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్..
శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.
మహా కనక దుర్గగా రమ్యకృష్ణ
రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది.
అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా
అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది.
భక్తురాలిగా సావిత్రి
జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది.
‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’
Comments
Please login to add a commentAdd a comment