vijayashanthi
-
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్లో విజయశాంతి కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్‌తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
సరిలేరు నీకెవ్వరు తర్వాత సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరోసారి తెరపై కనిపించలేదు. ఆ సినిమా తర్వాత పలువురు దర్శకులు తమ సినిమాల్లో నటించమని కోరినా..విజయశాంతి ఒప్పుకోలేదు. అంతేకాదు మళ్లీ తెరపై కనించబోదనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ ఈ సీనియర్ నటి మరోసారి తెరపై తన నటనతో ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నేడు ఎన్టీఆర్ జయంతి(మే 28). ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ తన కొత్త సినిమా అప్డేట్ ఇస్తూ ఓ చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. టైటిల్‌తో పాటు కల్యాణ్ రామ్ గెటప్‌ని రివీల్ చేయకుండా ఈ గ్లింప్స్‌ని కట్ చేశారు. అయితే ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అనే క్యాప్షన్ ఇచ్చి ఇదొక మాస్ యాక్షన్ సినిమా అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలన్‌గా సోహైల్ ఖాన్ నటించగా.. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కల్యాణ్ రామ్‌కు తల్లిగా నటించబోతున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. -
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన విజయశాంతి?
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ పెయిర్లో చిరంజీవి-విజయశాంతి జంట ఒకటి. స్వయంకృషి, అత్తకు యముడు అమ్మయికి మొగుడు, కొండవీటి దొంగ, గ్యాంగ్ లీడర్.. ఇలా దాదాపు 19 సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. పలు సినిమాల్లోనూ పోటాపోటిగా అన్నట్లుగా స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం మెకానిక్ అల్లుడు(1994). ఇది బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత హిట్ పెయిర్‌కి మళ్లీ కలిసి నటించే అవకాశం రాలేదు. ఇద్దరు రాజకీయాల్లో బిజీ కావడంతో.. ఇండస్ట్రీకే గ్యాప్ ఇచ్చారు. చాలా ఏళ్లవరకు వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవు.ఇద్దరి పార్టీలు వేరు వేరు కావడంతో అభిప్రాయ భేదాలు ఏర్పడి.. ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో మాత్రం ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. స్టేజ్‌పై పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరు కలుసుకున్న దాఖలాలు లేవు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరిపై ఓ క్రేజీ రూమర్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. చిరంజీవి నడిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’లో విజయశాంతి కీలక పాత్ర పోషించబోతుందని ఆ వార్త సారాంశం. జస్ట్ రూమరేనా?విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని టీమ్ సంప్రదించిన మాట వాస్తమేనట. కానీ రాములమ్మ మాత్రం ఆ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎన్నో సినిమాల్లో మెగాస్టార్‌కి జోడిగా నటించిన తాను.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే వేరే పాత్రలో కనిపించడం ఇష్టం లేదని చెప్పిందట. తమ జంటపై ప్రేక్షకుల మదిలో పడిన ముద్రను చెడగొట్టొదని.. అది అలానే ఉండాలనే ఈ పాత్ర చేయడం లేదని విజయశాంతి చెప్పారట. విజయశాంతి నటించడం కష్టమేవిజయశాంతి మళ్లీ సినిమాల్లో నటించడం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ఆమెకు కూడా నటించాలనే ఇంట్రెస్ట్ లేదు. పాత్ర నచ్చడంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించింది. అదే సమయంలో మళ్లీ తాను తిరిగి సినిమాల్లో నటించనని కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయశాంతి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పొలిటికల్‌గా మరింత ఎదగడానికి ఆమెకు ఇదే మంచి సమయం. ఇలాంటి టైంలో మళ్లీ సినిమాల్లో నటించడం కష్టమే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జోస్యం తెల్వని సిలుక పీకే పై విజయశాంతి ఫైర్
-
విజయశాంతికి ధన్యవాదాలు
-
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై విజయశాంతి కామెంట్స్
-
వరల్డ్ కప్ ఫైనల్లో ఆ విధానం ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది: విజయశాంతి ఆసక్తికర ట్వీట్!
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై సినీనటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పది మ్యాచ్‌లు గెలిచిన భారత్ ఓడిపోవడం బాధ కలిగించే విషయమని అన్నారు. అంత మాత్రాన భారత ఆటగాళ్లను ట్రోలింగ్ సరైంది కాదని హితవు పలికారు. ఈ మేరకు విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి తన ట్వీట్లో రాస్తూ..' లీగ్ గేమ్స్, సెమీస్‌లో భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. 10 మ్యాచ్‌ల విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అలాంటిది వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురి చెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు వచ్చిన భారత్ ముందు ఆస్ట్రేలియా గెల్చిన మ్యాచ్‌లు ఎన్ని? అయితే మిగతా కొన్ని క్రీడల పోటీల మాదిరే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కూడా బెస్ట్ ఆఫ్ -3 అనే విధానం ప్రకారం నడిస్తే, నిజమైన ప్రతిభ ప్రజలకు మరింత తెలియవచ్చు.' అని పోస్ట్ చేశారు. కాగా.. ఇటీవలే భాజపాకు రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది 10 ఆటలుగా.. ఎన్నో విజయాల తర్వాత కూడా ఎక్కడో ఒక్క వైఫల్యం బాధ కలిగిస్తది ఎవరికైనా.. అట్లాంటిది, వెంటనే భారత్ క్రికెట్ టీం, ప్లేయర్స్‌ని ట్రోలింగ్కి గురిచెయ్యడం, మాటలు అనడం సరికాదు. నిజానికి, 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు… pic.twitter.com/Z7it3d7oKc — VIJAYASHANTHI (@vijayashanthi_m) November 20, 2023 -
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న విజయశాంతి
-
బండి సంజయ్ మార్పుతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమైందన్నారు. కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి. వారు తెర ముందు విమర్శలు.. తెర వెనుక ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మళ్లీ కాంగ్రెస్‌లోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించవద్దని తాము కోరినట్లు తెలిపారు. అయితే బండి సంజయ్‌ను మార్చిన తరువాత బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. కేసీఆర్ నాటిన విత్తనం బీజేపీలో సంజయ్‌ను మార్చేసిందని విమర్శలు గుప్పించారు. బీజేపీలో ఉన్న నేత అసైన్డ్ భూములు ఏమయ్యాయి, కేసు ఏమైందని ప్రశ్నించారు, సీఎం కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని బీజేపీ చెబితే ఆ పార్టీలోకి వెళ్లానన్న విజయశాంతి.. ఏళ్లు గడచినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. మేడిగడ్డ కూలిపోతుంటే బీజేపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆధారాలు ఉండి కూడా కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. చదవండి: కేసీఆర్‌ను కాదని పనిచేసే సత్తా హరీష్‌రావుకు ఉందా?: ఈటల -
కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి
-
బీజేపీకి రాజీనామా !..కాంగ్రెస్ లోకి విజయశాంతి..?
-
కాంగ్రెస్‌లోకి విజయశాంతి!.. ముహూర్తం ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పొలిటికల్ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల ప్రక్రియ, ఉప సంహరణ అన్నీ ముగిసిపోయినప్పటికీ జంపింగ్‌లు మాత్రం ఆగడం లేదు. నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతూనే ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌లోకి కొందరు నేతలు క్యూ కట్టగా.. సీనియర్ నేత విజయశాంతి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వివరాల ప్రకారం.. బీజేపీ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె.. హస్తం పార్టీలో చేరుతున్నట్టు సమాచారం. ఇక, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్లికార్జున ఖర్గే.. రేపు(శుక్రవారం) హైదరాబాద్‌కు రానున్నారు. కాంగ్రెస్ తలపెట్టిన కుత్బుల్లాపూర్ సభలో ఖర్గే పాల్గొంటారు. ఈ సభలోనే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి రాములమ్మ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు. గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై విజయశాంతి తీవ్ర విమర్శలు చేశారు. పలు సమయాల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై అభిమానం కూడా చూపించిన విషయం తెలిసిందే. -
25 ఏళ్లకు చేరుకున్న విజయశాంతి రాజకీయ ప్రస్థానం
-
దేవి పాత్రలలో జేజేలు అందుకున్న హీరోయిన్స్
విజయ దశమి అంటే...కొత్త బట్టలు, పిండివంటలు, బంధు మిత్రుల కోలాహలం గుర్తుకు వస్తుంది. చిన్నా పెద్ద దసరాను సంబరంగా జరుపుకుంటారు. నవరాత్రులలో దుర్గామాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోటానికి పూజాలు చేస్తారు. ఇక ఈ దేవి రూపంలో టాలీవుడ్ వెండితెర మీద కొందరు హీరోయిన్స్ కనిపించడమే కాకుండా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్నారు. వారెవరో ఈ కథనంలో చూసేద్దాం.. మొదట గుర్తొచ్చేది ఆవిడే.. అప్పట్లో వెండితెర మీద దేవత పాత్రలు వేసిన నటీమణులలో కె.ఆర్ విజయ పేరు మొదటి వరసలో ఉంటుంది.ఎన్టీఆర్ పేరు చెబితే కృష్ణుడు, రాముడు లాంటి వారు గుర్తుకు వస్తారు. ఇక దేవతల క్యారెక్టర్ల గురించి మాట్లాడితే.. కె ఆర్ విజయ పేరు మనసులో మెదలుతుంది. అమ్మ వారి పాత్ర వేసినప్పుడు ఎంతో నిష్టగా ఉండేవారట. శాఖాహారం మాత్రమే తీసుకునేవారట. శభాష్ అనిపించుకున్న విజయశాంతి లేడి సూపర్ స్టార్‌గా విజయ శాంతి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు నేషనల్ అవార్డు సైతం కొల్లగొట్టింది. ఈ సీనియర్ తార కూడా మహా చండి అవతారంలో విశ్వరూపం చూపించింది. దేవత పాత్రలో కనిపించి శభాష్ అనిపించుకుంది. రోమాలు నిక్కబొడుచుకునే అమ్మోరు సీన్.. శరదృతువు ఆరంభంలో వచ్చే పండగ కనక నవరాత్రి, శరన్నవరాత్రి అనే పేరు వచ్చింది. పండగ మొదటి మూడు రోజులు పార్వతి దేవికి, ఆ తరువాత మూడు రోజులు లక్ష్మీ దేవికి.. ఆ తరువాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఇక అమ్మోరు తల్లి గ్రామంలో వెలిసి.. దుష్ట శక్తులను పారదోలుతుంది. ఈమె విశ్వరూపం చూసే భాగ్యం అందరికీ దక్కదు. అలాంటి అవకాశం దక్కే సీన్ అమ్మోరు సినిమాలో చూపించారు. వెండితెర మీద ఈ సన్నివేశాన్ని చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మహా కనక దుర్గగా రమ్యకృష్ణ రమ్య కృష్ణ అమ్మోరు సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో దేవతగా కనిపించి వెండితెర మీద కనికట్టు చేసింది. దేవుళ్లు సినిమాలో భక్తితో వేడుకుంటే ఆ మహా కనక దుర్గ కూడా కదిలి వస్తుంది అనే సన్నివేశాలలో మానవరూపం దాల్చిన దేవతగా కనిపించింది. నిండు మనసుతో అమ్మ ఉందని నమ్మిన వారికి కళ్లముందు కనిపించే దైవం అవుతుంది.లేదనుకునే అల్పులకీ కళ్లు తెరిపిస్తుంది. అమ్మోరు తల్లిగా, భక్తురాలిగా రోజా అమ్మోరు తల్లిగా కనిపించిన వారి లిస్ట్‌లో మరో సీనియర్ తార రోజా కూడా ఉంది. భక్తురాలిగా, అమ్మోరు తల్లిగా రెండు పాత్రలలో అమ్మోరు తల్లి సినిమాలో మెప్పించింది. శ్రీవెంకటేశునికి చెల్లెలివమ్మా, చిట్టి చెల్లిలి వయ్యా అని ఈ దేవతను పొగుడుతూ భక్తు రాలిగా పాట పాడి మెప్పించింది. భక్తురాలిగా సావిత్రి జననీ శివ కామిని దరి చేరితే భయాలు తొలుగిపోతాయి. అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మ దయ దొరికితే జయాలు కలుగుతాయి. ఎన్టీఆర్, సావిత్రి నటించిన నర్తన శాల మూవీలో అమ్మ దయ కోసం...సావిత్రి జననీ శివ కామినీ అనే పాట పాడి ఆకట్టుకుంది. ‘‘ఇక్కడ క్లిక్ చేసి సాక్షి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
విజయశాంతి 45 ఏళ్ల ప్రస్థానం.. ఆమె జీవితంలో మలుపు తిప్పిన సినిమా
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించి అనేక విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించి వారికి ఏ మాత్రం తాను తక్కువ కాదని నిరూపించుకుని లేడీ అమితాబ్‌గా గుర్తింపు పొందారు. తన సినిమాలకు స్టార్స్ అక్కర్లేదని నిరూపించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ విజయశాంతి. సినిమా రంగంలో ఎన్నో విజయాలను అందుకున్న విజయశాంతో ఈ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తి అయింది. అంతేకాకుండా 1983 అక్టోబర్ 15న తన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేటి భారతం చిత్రం విడుదలయి నేటికి 40 ఏళ్లు పూర్తి అయింది. ఇలా ఈరోజు ఆమెకు మరెంతో ప్రత్యేకం. ఇదే విషయాన్ని విజయశాంతి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఏడేళ్లకే బాలనటిగా ఎంట్రీ జూన్ 24, 1966న వరంగల్‌లో జన్మించి, మద్రాసులో పెరిగింది విజయశాంతి. తన పిన్నిగారు అయిన విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుంచి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు సమాచారం ఉంది. కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయం చేసింది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కథానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబరులో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణతో ఆమె నటించింది. ఈ చిత్రానికి దర్శకురాలు విజయనిర్మల. మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితం విజయశాంతి కథానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు గ్లామర్ పాత్రలు పోషించింది. వాటిలో చెప్పుకోతగినవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో ఎన్టీయార్, ఏయెన్నార్‌ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా చెప్పుకోతగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983లో నిర్మించిన 'నేటి భారతం'. ఇలా క్రమంగా కథానాయికగా ఒక్కో సినిమాలో నటిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో మరో తార ఉద్భవించింది 1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం విజయశాంతి తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కథానాయిక పాత్రలో విజయశాంతి జీవించిందని చెప్పవచ్చు. దీంతో నేటి భారతం సినిమా ఘన విజయానికి విజయశాంతి ప్రధాన కారణమైంది . అలా అప్పటికే తెలుగు తెరపై జయసుధ, జయప్రద,శ్రీదేవి, మాధవి వంటి వారు అప్పటికే తెలుగు పరిశ్రమలో పాతుకుపోయారు. వారందరినీ సవాలు చేస్తూ విజయశాంతి రూపంలో మరో తార వెండితెరపై ఉద్భవించింది. అక్కడి నుంచి ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని ఒక నటిగా ఎదిగింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును కూడా గెలుచుకుంది. రెండుపడవల ప్రయాణం ఆ తరువాత రెండేళ్లపాటు రెండుపడవల ప్రయాణంలా సాగింది విజయశాంతి సినీ పయనం. ఒక వైపు నేటి భారతంతో వచ్చిన ఉత్తమ నటి పేరును నిలిపే పాత్రలు, మరో వైపు సగటు సినీ వీక్షకులనలరించే గ్లామర్ అద్దిన మసాలా పాత్రలు అలవోకగా పోషిస్తూ 1986నాటికి తెలుగు వెండితెరపై వెలిగే తారామణుల్లో ఒకటి నుంచి పది వరకూ అన్ని స్థానాలు తనవే అనే స్థాయికి చేరిపోయింది. అప్పట్లో ఆమె తరువాతి స్థానాల్లో రాధ, సుహాసిని, రజని, రాధిక వంటి వారుండేవారు. జయశాంతి విశ్వరూపం 1985 నటిగా విజయశాంతి విశ్వరూపం ప్రదర్శంచిన సంవత్సరం. ఆ ఏడాది వందేమాతరం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, ప్రతిఘటన వంటి ప్రగతిశీల చిత్రాల్లో రెబల్ ఛాయలున్న కథానాయిక పాత్రల్లోనూ, అగ్ని పర్వతం, పట్టాభిషేకం, చిరంజీవి, దర్జా దొంగ, ఊరికి సోగ్గాడు, శ్రీవారు వంటి చిత్రాల్లో చలాకీగా హీరోతో ఆడి పాడే కథానాయికగా నటించి తను రెండువిధాలుగానూ ప్రేక్షకులను మెప్పించగలనని ఋజువుచేసింది. పైన పేర్కొన్న పది చిత్రాల్లో ఒక్క చిరంజీవి తప్ప మిగిలినవన్నీ విజయవంతం కావటం విశేషం. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనకు గాను రెండవసారి ఉత్తమ నటిగా నంది అవార్డును గెలుచుకోవటమే కాకుండా ప్రేక్షకులలో ఆమెకంటూ ప్రత్యేకమయిన అభిమాన వర్గాన్ని సంపాదించుకుంది. జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం 1990 జూన్ నెలలో వచ్చిన కర్తవ్యం విజయశాంతి నట జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఐ.పీ.ఎస్. అధికారిణి కిరణ్ బేడీ స్ఫూర్తితో, మోహన గాంధీ దర్శకత్వంలో తను కథానాయిక పాత్ర పోషిస్తూ తన సొంత ప్రొడక్షన్ సూర్యా మూవీస్ పతాకంపై విజయశాంతి నిర్మించిన ఈ చిత్రం అపూర్వ విజయం సాధించడమే కాకుండా ఆమెకు 1990వ సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉత్తమ జాతీయ నటి అవార్డులను సంపాదించిపెట్టింది. ఈ చిత్రంలో సంఘంలోని చీడపురుగులను ఏరి పార వేసే ఐ.పీ.ఎస్. అధికారిణి వైజయంతి పాత్రలో ఆమె చూపిన అద్భుత అభినయం, రిస్క్ కు వెరవకుండా వీరోచితంగా చేసిన పోరాటాలు ఆమెకు లేడీ అమితాబ్, యాంగ్రీ యంగ్ ఉమన్, ఫైర్ బ్రాండ్ లాంటి బిరుదులు కూడా వచ్చాయి. ఒక్క సారిగా తెలుగు సినిమా పరిశ్రమలో టాప్‌లోకి ఆమె ఇమేజ్ చేరింది. మొదటి సారిగా తెలుగు సినిమా పత్రికలు ఒక కథానాయికను సూపర్ స్టార్ అనే బిరుదుతో సంబోధించసాగాయి. ఏడాది పాటు ఒక్క సినిమా కూడా లేదు 1993 లో వచ్చిన పోలీస్ లాకప్ తరువాత వరుసగా రెండేళ్లపాటు ఆమెకు సిల్వర్ జూబ్లీ సినిమాలు కరువయ్యాయి. దానితో ఆమె 1996 లో ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. ఏడాది పాటు విజయశాంతి సినిమా అనేది థియేటర్లలో కనిపించలేదు. అలా అభిమానుల బాధను మరపిస్తూ 1997 మార్చి 7 న విడుదలయింది 'ఒసేయ్ రాములమ్మా'. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలయిన మొదటి రోజు నుంచి అన్ని అంచనాలనూ మించిపోతూ తెలుగు చిత్ర సీమలో నాటి వరకూ ఉన్న ఎన్నో రికార్డులను అలవోకగా బద్దలు కొట్టిందీ చిత్రం. అదే ఏడాది విడుదలై విజయవంతమయిన హిట్లర్, అన్నమయ్య, తొలిప్రేమ, ప్రేమించుకుందాం.. రా వంటి చిత్రాలకంటే మిన్నగా వసూళ్లు సాధించి పెట్టింది. అప్పటికి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నా బాక్సాఫీసు వద్ద విజయశాంతి హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిందా చిత్రం. నాలుగోసారి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ నటిగా నంది అవార్డును ఆమెకి అందించింది. అప్పటి నుంచి ప్రేక్షక జనం ఆమెను అభిమానంతో రాములమ్మగా పిలవడం ప్రారంభించారు. ఆ చిత్రం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ధియేటర్ల వద్ద రేపుతున్న సంచలనం సద్దుమణగక ముందే, 1997 జూన్ నెలలో ఆమె ఎవరూ ఊహించని విధంగా అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్. కె. అద్వానీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి మరో సంచలనం సృష్టించింది. ఒసేయ్ రాములమ్మా తరువాత విజయశాంతిని ఘన విజయాలు పలకరించటం మానేశాయి. తర్వాత కొన్ని సినిమాలు తీసిన అవి అంతగా మెప్పించలేదు. అలా సుమారు 13 ఏళ్లు బ్రేక్ తీసుకుని మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఆమె సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 45 ఏళ్లు పూర్తి అయినా నేటికి ఆమెకున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. విజయశాంతి జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ► ఆమె 1987లో మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అతను ఎన్టీఆర్ పెద్దల్లుడు.. గణేష్ రావుకు స్వయాన మేనల్లుడు. దగ్గుబాటి పురందరేశ్వరి భర్త తరుపు నుంచి కూడా ఆయనకు బంధుత్వం ఉంది. ► చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్‌తో 7 చిత్రాలలో నటించించారు. ► తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కథానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేరు. ► కర్తవ్యం సినిమాలో నటించిన నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► విజయశాంతి నాలుగు నంది పురస్కారాలను దక్కించుకున్నారు. ►1987లో ఆమె చిరంజీవితో కలసి నటించిన స్వయంకృషి చిత్రం మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లోనూ, హాలీవుడ్ నటుడు థామస్ జనెతో నటించిన పడమటి సంధ్యారాగం సినిమా లూస్వెల్లీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడినాయి. ► హీరోలతో సమానంగా పారితోషకం డిమాండ్ చేసిన ఏకైక నటిగా గుర్తింపు పొందారు. ఆమె నటించిన కర్తవ్యం సినిమాలో రెమ్యూనిరేషన్ ఒక కోటి రూపాయలు. ఆ కాలంలో అదే టాప్. ► ఆమె ఏడుసార్లు దక్షిణాది ఫిలిం ఫేర్ పురస్కారాలను, ఆరు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్నారు. ► 2003లో దక్షిణ భారతదేశ ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్‌మెంటు పురస్కారాన్ని పొందారు. ► విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె మొదట భారతీయ జనతా పార్టీలో చేరారు. ► తెలంగాణ రాష్ట్ర సాధన లక్షంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేసి.. అనంతరం ఆ పార్టీని 2009లో తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేసి టీఆర్ఎస్లో చేరారు. ► ఆమె 2009లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు ► విజయశాంతిని 2013లో పార్టీవ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటుందని ఆమెను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ► 07 డిసెంబర్ 2020న భారతీయ జనతా పార్టీలో చేరి.. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. సాక్షి, వెబ్ డెస్క్ ప్రత్యేకం -
సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న క్రమంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంటే తనను అభిమానం, గౌరవమని అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం అంటూ మండిపడ్డారు రాములమ్మ. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని విషయం కూడా అంటూ చురకలు అంటించారు. ఎంఐఎం, బీఆరెస్ ఒక్కటే అని, సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో నేను నిరంతరం చెబుతున్న మాటని ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా బహిరంగ సభలో చెప్పడం ఎంతైనా సమంజసం. అయితే, మిగతా ఎక్కడో రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నదనే వ్యాఖ్యానం పూర్తిగా అయోమయ అంశం, అర్థం కాని… pic.twitter.com/TdySxpX4dJ — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 17, 2023 ఇదే సమయంలో ‘అంటే దేశంలోని అనేక రాష్ట్రాలలో ఎంఐఎం ప్రేరేపిత ఓట్లు కాంగ్రెస్‌కు రాకపోవడం వల్లనే బీజేపీ గెలుస్తున్నదా? కాంగ్రెస్ ఓడిపోతున్నదా? అని నిలదీశారు. ఆ విధంగా కాంగ్రెస్ దేశంలోని అనేక రాష్ట్రాలలో గెలవలేని పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి, ఎంఐఎం లేకుండా దేశంలో ఎక్కడా కూడా గెలవడం సాధ్యం కాదేమో అని కాంగ్రెస్ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఒక్క మాటలో, దేశమంతటా ప్రోద్బలిత వర్గాలను కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఎంఐఎం మరింత ప్రభావితం చెయ్యగలుగుతున్నదా? అని పేర్కొన్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం తప్పక అభిమానంతోనే చూస్తాం, రాజకీయాలకు అతీతంగా గౌరవిస్తాం’ అని ఆమె కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: వచ్చే నెలలో తెలంగాణకు ప్రధాని మోదీ? -
ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు మరోసారి అందుకున్న బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల సానుభూతి ప్రకటించారు విజయశాంతి. ఒక ఆడబిడ్డకు కష్టం రావొద్దు. ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా కోరుకుంటాను అంటూ పేర్కొన్నారామె. అయితే.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత పేర్కొనడాన్ని విజయశాంతి తప్పుబట్టారు. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు.. ఆ ఆవశ్యకత కూడా లేదు అంటూ వివరణ ఇచ్చారు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే.. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అనే భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ, జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు అని పేర్కొన్నారామె. ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే...… pic.twitter.com/osR7evW3M5 — VIJAYASHANTHI (@vijayashanthi_m) September 14, 2023 గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు.. బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నదంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారామె. ఇదిలా ఉంటే.. హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్‌రామచంద్ర పిళ్లై మళ్లీ అప్రూవర్‌గా మారడం.. న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడం.. ఆ వెంటనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపడం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ వ్యవహారం అంతా ఏడాది కాలంగా.. ఏదో టీవీ సీరియల్లాగా సాగుతోందని.. ఇవి ఈడీ నోటీసులు కావు మోదీ నోటీసులు అని, కేవలం తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల నేపథ్యంతోనే మరోసారి రాజకీయం కోసం నోటీసులు పంపారంటూ కవిత స్పందించారు. తన లీగల్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నోటీసుల వ్యవహారంపై పూర్తిస్థాయి స్పందన తెలియజేస్తానని ఆమె అన్నారు. వాస్తవం కాదు: పిళ్లై లాయర్లు ఇదిలా ఉంటే.. మరోవైపు తాను అప్రూవర్‌గా మారలేదంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై తన న్యాయవాదుల నుంచి ఒక ప్రకటన విడుదల చేయించడం గమనార్హం. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద పిళ్లై ఎలాంటి వాంగ్మూలం న్యాయమూర్తి ఎదుట ఇవ్వలేదని, తప్పుడు, నిరాధారమైన వార్తలను ప్రచురిస్తున్నారని, సదరు సంస్థలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పిళ్లై తరపు న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. -
విజయశాంతి కుటుంబం గురించి మీకు తెలియని నిజాలు..!
-
తన కోరికను బయటపెట్టిన విజయశాంతి..!
-
టాలీవుడ్ హీరోల గురించి విజయశాంతి ఏమన్నారంటే..!
-
టాలీవుడ్ హీరోల గురించి విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
-
విజయశాంతి నిజ జీవిత కథ బయటపెట్టింది
-
కేసీఆర్ Vs రాములమ్మ.. తెలంగాణలో పొలిటికల్ వార్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పోటీకి తాను రెడీగా ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే, వచ్చే ఎన్నికల్లో గెలుపోటముల అంశాన్ని పక్కనపెట్టి బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై పోటీ చేయాలని విజయశాంతి సూచనప్రాయ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థిగా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తాను సిద్ధమని సంకేతాలిస్తూ ట్వీట్ చేశారు. ఆ అవకాశం తనకే కల్పించాలని పార్టీ అధిష్టానానికి విజయశాంతి విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక, ట్విట్టర్ వేదికగా విజయశాంతి.. కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు. కామారెడ్డి అసెంబ్లీ పై నా పోటీ విషయం మా పార్టీ నిర్ణయిస్తది. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే.. బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం... ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్… pic.twitter.com/2TplIvgykR — VIJAYASHANTHI (@vijayashanthi_m) August 23, 2023 ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి, గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం ఇవ్వలేదు. నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్సాపూర్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఇది కూడా చదవండి: కార్యాచరణపై రేపు మైనంపల్లి భేటీ -
కమలంలో ఆగని లుకలుకలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలోని అసంతృప్త స్వరాలు ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా జరిగిన సభలో వేదికపై కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు, ఆ తర్వాత ట్వీట్ల ద్వారా స్పందించిన వైఖరిపై పార్టీలో చర్చ జరుగుతోంది. తన విషయంలో వ్యవహరించినట్టుగా కాకుండా కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని, ఢిల్లీకి వెళ్లి లేనిపోని ఫిర్యాదులు, రిపోర్టులు ఇవ్వొద్దని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొనడంపై బీజేపీ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఒరవడి శుక్రవారం అర్ధ్థరాత్రి దాకా సాగిన రాష్ట్ర పార్టీ కోర్‌కమిటీ సమావేశంలోనూ కొనసాగినట్టు పార్టీవర్గాల సమాచారం. తెలంగాణకు కిరణ్‌కు సంబంధమేమిటి? తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమానికి ఎలా పిలుస్తారని విజయశాంతి ప్రశ్నించినట్లు తెలిసింది. ఇది తెలంగాణ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే ప్రమాదం ఉందని ఆమె అసహనం వ్యక్తం చేశారని అంటున్నారు. ఈ విషయంలో జాతీయ, రాష్ట్ర నేతలను హెచ్చరించి, ఆమె తన నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. అలా ఎలా సంజయ్? కిషన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బండి సంజయ్ మాట్లాడిన తీరు బాగా లేదని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాష్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బండి వ్యాఖ్యలు పార్టీకేడర్‌ను గందరగోళంలో పడేసే విధంగా ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ఏవైనా ఇలాంటి అభిప్రాయాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడాలే తప్ప, బహిరంగంగా మాట్లాడడం ఏమిటని సంజయ్ తీరును తప్పు పట్టినట్లు సమాచారం. ఈ మేరకు కోర్ కమిటీ మీటింగ్‌లో వారు సంజయ్‌కి క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గతం నుంచే బండి సంజయ్, ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావుల మధ్య కొంత గ్యాప్ ఉండడంతో ఈ సమావేశంలోనూ అది బయట పడినట్టు తెలిసింది. దీంతో ఆయన సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఉద్యమ కార్యాచరణ... శుక్రవారం రాత్రి పొద్దుపోయే దాకా సాగిన రాష్ట్ర కోర్ కమిటీ సమావేశంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాసమస్యలపై ఉధృతంగా ఉద్యమించాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతి, అక్రమాలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలు, హామీల అమల్లో వైఫల్యంపై ప్రధానంగా కార్యాచరణను రూపొందించుకోవాలని భావించారు. తొలిసారిగా కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కోర్ కమిటీ భేటీలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అలాగే ముఖ్యనేతలు ఎవరొచ్చినా.. దళితవాడల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. బీఆర్ఎస్ సర్కారు వారికి చేసిన మోసాన్ని తెలియ జేసేలా చైతన్యం తీసుకురావాలని తీర్మానించారు. బీజేపీ మాత్రమే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించగల దనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉందని.. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మరిన్ని ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు.