కేసీఆర్ మాట తప్పారు: విజయశాంతి | vijayasanthi slams KCR for swallowing 'Dalit CM' promise | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మాట తప్పారు: విజయశాంతి

Published Mon, Apr 14 2014 11:05 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

కేసీఆర్ మాట తప్పారు: విజయశాంతి - Sakshi

కేసీఆర్ మాట తప్పారు: విజయశాంతి

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మెదక్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి, విజయశాంతి విరుచుకుపడ్డారు.

మెదక్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై మెదక్ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి, విజయశాంతి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్కు అధికారమిస్తే దోచుకు తింటుందని ఆమె సోమవారమిక్కడ విమర్శించారు. టీఆర్ఎస్ దొరల పార్టీ అని బడుగు, బలహీన వర్గాలకు ఆపార్టీ వ్యతిరేకమన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని విజయశాంతి విమర్శించారు.

 

ఓటమి భయంతోనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారని ఆమె అన్నారు. టీఆర్‌ఎస్ దోపిడీ దొంగల పార్టీ, మోసం చేయడం వారినైజం, కేసీఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలనే కొనసాగిస్తారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement