మెదక్: ఓటమి భయంతోనే కేసీఆర్ మహబూబ్‌నగర్ నుంచి మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చారని మెదక్ అసెంబ్లీ అభ్యర్థి, ఎంపీ విజయశాంతి విమర్శించారు. బుధవారం మెదక్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసిన అనంతరం పట్టణంలోని జీకేఆర్ గార్డెన్ వరకు భారీ ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. టీఆర్‌ఎస్ దోపిడీ దొంగ ల పార్టీ, మోసం చేయడం వారినైజం, కేసీఆర్ మాటల మరాఠి, ఆయనకు అధికారం అప్పగిస్తే కుటుంబ పాలనే కొనసాగిస్తారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టా రు. టీఆర్‌ఎస్‌లో జరుగుతున్న విషయాలు బయట పెడితే ఇక్కడి ప్రజలు వారిని తరిమి కొడతారని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది మంత్రి పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చి నానా గడ్డి తింటున్నారని, తాను మాత్రం తెలంగాణ వచ్చే వరకు మంత్రి పదవి ఆశించలేదని పేర్కొన్నారు.
తన జీవితం ప్రజలకోసమే అంకితం చేస్తున్నానని ప్రకటించారు. ఈ నియోజకవర్గ ప్రజలే నా కుటుంబీకులని చెప్పారు. రాములమ్మ అంటే టీఆర్‌ఎస్‌కు భయమని పేర్కొన్నారు. ఐదేళ్లు టీఆర్‌ఎస్‌లో నరకం చూపారని, అయినా ప్రజల కో సం అన్ని అవమానాలు భరించానన్నా రు. కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణకు పరిశ్రమలు రావన్నారు. బీజేపీ మోడి పేరుతో ప్రజలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణలో సైకిల్ పంక్షరైందని విమర్శించారు. తాను మెదక్ పట్టణంలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ కార్యదర్శి సుప్రభాత్‌రావు, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ లు కొండన్ సావిత్రి సురెందర్ గౌడ్, కృష్ణ, హఫీజొద్దీన్, ఏఎంసీ మాజీ చైర్మన్‌లు మధుసూదన్‌రావు, రాజు, పవన్‌శ్రీకర్, డీసీసీ కార్యదర్శి మల్లన్న, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు శంకర్, పట్టణ పార్టీ మహిళ అధ్యక్షురాలు హరిణి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కిష్టాగౌడ్, రాంచంద్రాగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అలుపెరగని పోరాటం చేశా
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేశానని మెదక్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. బుధవారం ఆమె మండల పరిధిలోని రాయినిచెర్వు శివారులో ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయగా పలుపార్టీల నాయకులు విజయశాంతి సమక్షంలో కాంగ్రెస్‌లో తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులు దుష్టశక్తులు అని, రాములమ్మ ఎప్పుడు చస్తుందా అంటు చూస్తున్నారంటూ ఆరోపించారు. ప్రజల నుండి తనను విడదీయాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
కోనాయిపల్లిలో పూజలు
సిద్దిపేట జోన్: మెదక్ శాసనసభ కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి బుధవారం నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8.10గంటలకు సిద్దిపేట కాంగ్రెస్ అభ్యర్థి తాడూరి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆలయానికి చేరుకున్న రాములమ్మ నామినేషన్ పత్రాలను స్వామి వారి చేంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరుగా మెదక్‌లో నామినేషన్ ధాఖాలు చేయడానికి బయలుదేరారు. ఆమె వెంట నంగునూరు సర్పంచ్ దేవులపల్లి యాదగిరి, నాయకులు సత్యనారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి, స్వామి తదిరతరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌కు ఓటమి భయం
Published Thu, Apr 10 2014 12:05 AM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
Advertisement