రుద్రూర్(వర్ని), న్యూస్‌లైన్ : మండలంలోని రుద్రూర్‌లో పోలింగ్ కేంద్రం వద్దకు వికలాంగులను తెస్తున్న ఆటోడ్రైవర్ రాజాగౌడ్‌ను ఇద్దరు పోలీసులు చితకబాదారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అరగంటపాటు ఆందోళనకు దిగారు. నడవలేని వారిని కేంద్రానికి తెస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. అకారణంగా ఆటోడ్రైవర్‌ను చితకబాదిన పోలీసుల పేర్లు, బ్యాచ్ నంబర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకుని ఇక్కడి నుంచి తీసేయాలని పట్టుబట్టారు. దీంతో అరగంటపాటు పోలింగ్ నిలిచింది. విషయం తెల్సుకున్న ఎస్సై సుఖేందర్ రెడ్డి వచ్చి పోలీసులిద్దరిని స్టేషన్‌కు పంపించారు. బాధితులను సముదాయించడంతో పోలింగ్ సాగింది. శ్రీనగర్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు నలుగురి అదుపులోకి తీసుకున్నారు. మోస్రాలో ఓ పార్టీ వారు పొలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరువర్గాల గుంపును పోలీసులు చెదరగొట్టారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల ఘర్షణ
కామారెడ్డిటౌన్ : పట్టణంలోని అశోక్‌నగర్‌కాలనీ 221 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓ పార్టీకి చెందిన నాయకులు ఇతర గ్రామాల నుంచి ఓటర్లను తరలిస్తున్నారని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు వాగ్వాదం చేసుకుని ఘర్షణ పడ్డారు. రెండు పార్టీలకు చెందిన ముగ్గురి కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు.
నాయకుల మధ్య వాగ్వాదం
బాన్సువాడ టౌన్ : కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వా దం నెలకొంది. ఎన్నికల సరిళిని పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి తన కార్యకర్తలతో మండల పరిషత్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్ కేంద్రానికి వచ్చారు. ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు ఎమ్మె ల్యే కొద్ది సేపు అక్కడే ఉండటంతో అప్పుడే అక్కడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి బద్యానాయక్, కాంగ్రెస్ నాయకులు గురువినయ్ ఎన్నికల అధికారులకు ఎమ్మెల్యేపై ఫిర్యా దు చేశారు. దీంతో నాయకుల మధ్య మాటమా ట పెరిగింది. నువ్వేంత అంటే అనువ్వేంత అనే స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేవు పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెల కొనడంతో ఓటర్లు భయాందళనకు గురయ్యారు. టీడీపీ కార్యకర్త టీఆర్‌ఎస్ నాయకులపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆంధ్రనగర్‌లో స్వల్ప ఉద్రిక్తత
నందిపేట : మండలంలోని ఆంధ్రనగర్‌లో బుధవారం ఎన్నికలలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. వంద మీటర్లలోపు వ్యాపార దుకాణాలను మూసేయాలని పోలీసులు వ్యాపారస్తులకు హెచ్చరించారు. పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో ఓ హోటల్ తెరచి ఉంది. దీంతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ హోటల్ యజమానిని గద్దించాడు. దీంతో కోపొద్రిక్తుడైన హోటల్ యజమాని నన్ను బూతులు తిడతావా అంటూ విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. కేంద్రానికి వంద మీటర్లలోపు ఎవ్వరు ఉండకూడదని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. తాము ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకోమని గ్రామస్తులు భీస్మీంచుకోవడంతో నందిపేట ఎస్సై సైదయ్య సంఘటన స్థలానికి వచ్చి స్థానికులకు సముదాయించారు. దీంతో ఓటింగ్ యథావిధిగా సజావుగా సాగింది.
వాదనలు.. ప్రతివాదనలు
Published Thu, May 1 2014 3:23 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement