- వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పట్టిన ఓటర్లు
- 12 నియోజకవర్గాల్లోనూ విజయం తథ్యం
- బోగస్ ఓట్లు వేసినా టీడీపీకి ఫలితం శూన్యం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, సార్వత్రిక సమరం బుధవారం ముగిసింది. పోలింగ్ సరళి అంతా ఏకపక్షంగా సాగింది. ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మోగించిన ‘వైఎస్సార్ జనభేరి’కి జిల్లా వాసులు చైతన్యంతో పోలింగ్ బూత్‌ల వద్ద కదం తొక్కారు. ఉదయం ఆరు గంటలకే బూత్‌ల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి ఓటింగ్ తగ్గడంతో పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు బోగస్ ఓట్లు వేశారు.
ఒంగోలులోని పలు పోలింగ్ బూత్‌లలో రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అక్కడకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు వెనుదిరిగారు. నాలుగు వాహనాల్లో పోలీసులు చేరుకుని, అక్కడ ఉన్న గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు.జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉదయం 9.00 గంటలకే దాదాపు 20 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 50 శాతం పోలింగ్ పూర్తయ్యింది. తరువాత మందకొడిగా పోలింగ్ జరగ్గా, ఆ సమయంలో టీడీపీ నాయకులు బోగస్ ఓట్లు వేసుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ స్వయంగా పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకుని, మహిళలకు అక్కడికక్కడే డబ్బులు ఇవ్వడమే కాకుండా, దగ ్గరుండి ఓట్లు వేయించుకున్నారు.
- అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి సానుకూల పవనాలు వీచాయి. చీరాలలో త్రిముఖ పోటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి యడం బాలాజీకి అనుకూలంగా ఉందని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
- గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లో అనూహ్యంగా వైఎస్సార్ సీపీకి ఓటింగ్ శాతం పెరిగింది.
- ఒక వైపు ఎండలు మండుతున్నా లెక్కచేయని జనం 82.81 శాతం పోలింగ్ నమోదు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలలు జిల్లాలో రెండు విడత లుగా పర్యటించడంతో ఆ పార్టీకి మరింత జోష్ వచ్చింది. వీరిద్దరి పర్యటనలకు వచ్చిన ప్రజాస్పందన నేడు ఓటు రూపంలో బహిర్గతమైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు చూపించిన ఆదరణకు పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వాసులు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో ఆపార్టీకి ఓటు వేశారన్నారు. కొత్త రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా తీసుకెళ్లడానికి, జగన్ పట్ల ఆదరణ చూపించారని తెలిపారు. ఇదిలా ఉండగా, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి వందలాది మంది యువకులు మోటారు సైకిళ్లపై వచ్చి ముందస్తు అభినందనలు తెలిపారు
ప్రభం‘జనం’
Published Thu, May 8 2014 2:31 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement