sukhendar reddy
-
ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక్కసారిగా..
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిచెందాడు. దీంతో అతని స్వగ్రామం కరీంనగర్ మండలంలోని మొగ్ధుంపూర్‌లో విషాదం నెలకొంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మొగ్ధుంపూర్‌కు చెందిన సీహెచ్.రాజిరెడ్డి–ఊర్మిళ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. రాజిరెడ్డి ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. ఇద్దరు కూతుళ్లకు వివాహాలు కాగా కుమారుడు సఖేందర్‌రెడ్డి(26) హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వనస్థలిపురంలోని తన సోదరి సంయుక్త ఇంట్లో ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 5.30 గంటలకు బైక్‌పై పని నిమిత్తం బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి అడ్డుగా రావడంతో అతన్ని తప్పించే క్రమంలో కిందపడి, తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చేతికి అందివచ్చిన కొడుకు ప్రమాదంలో మృతిచెందడంతో అతని తల్లిదండ్రులు, అక్కలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అది చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. -
నీటిని సద్వినియోగం చేసుకోవాలి
మిర్యాలగూడ : ఖరీఫ్‌లో సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో ఎన్ఎస్పీ అధికారులు నీటి విడుదల, వినియోగంపై రైతులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల కృష్ణానది ఎగువ భాగంలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ వాటాలో 30 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు గాను ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నీటి విడుదలపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో నిర్వహించే సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నీటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాల్వకు నిరంతరాయంగా 25 రోజుల పాటు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని కోరారు. కాగా ఎన్ఎస్పీ సీఈ సునిల్, ఎస్ఈ అంజయ్య మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువకు ప్రజాప్రతినిధుల, రైతుల అభిప్రాయం మేరకు 15 రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని, ఆ తర్వాత వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయడానికి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, వేనేపల్లి చందర్రావు, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, టీఆర్ఎస్ నాయకులు సాములు శివారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, చిట్టిబాబునాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, ప్రజాప్రతినిధులు, డీసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
వాదనలు.. ప్రతివాదనలు
రుద్రూర్(వర్ని), న్యూస్‌లైన్ : మండలంలోని రుద్రూర్లో పోలింగ్ కేంద్రం వద్దకు వికలాంగులను తెస్తున్న ఆటోడ్రైవర్ రాజాగౌడ్‌ను ఇద్దరు పోలీసులు చితకబాదారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు అరగంటపాటు ఆందోళనకు దిగారు. నడవలేని వారిని కేంద్రానికి తెస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. అకారణంగా ఆటోడ్రైవర్‌ను చితకబాదిన పోలీసుల పేర్లు, బ్యాచ్ నంబర్ చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకుని ఇక్కడి నుంచి తీసేయాలని పట్టుబట్టారు. దీంతో అరగంటపాటు పోలింగ్ నిలిచింది. విషయం తెల్సుకున్న ఎస్సై సుఖేందర్ రెడ్డి వచ్చి పోలీసులిద్దరిని స్టేషన్‌కు పంపించారు. బాధితులను సముదాయించడంతో పోలింగ్ సాగింది. శ్రీనగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు నలుగురి అదుపులోకి తీసుకున్నారు. మోస్రాలో ఓ పార్టీ వారు పొలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరువర్గాల గుంపును పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ కామారెడ్డిటౌన్ : పట్టణంలోని అశోక్నగర్కాలనీ 221 పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓ పార్టీకి చెందిన నాయకులు ఇతర గ్రామాల నుంచి ఓటర్లను తరలిస్తున్నారని మరో పార్టీకి చెందిన కార్యకర్తలు వాగ్వాదం చేసుకుని ఘర్షణ పడ్డారు. రెండు పార్టీలకు చెందిన ముగ్గురి కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. నాయకుల మధ్య వాగ్వాదం బాన్సువాడ టౌన్ : కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వా దం నెలకొంది. ఎన్నికల సరిళిని పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి తన కార్యకర్తలతో మండల పరిషత్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్ కేంద్రానికి వచ్చారు. ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు ఎమ్మె ల్యే కొద్ది సేపు అక్కడే ఉండటంతో అప్పుడే అక్కడికి వచ్చిన టీడీపీ అభ్యర్థి బద్యానాయక్, కాంగ్రెస్ నాయకులు గురువినయ్ ఎన్నికల అధికారులకు ఎమ్మెల్యేపై ఫిర్యా దు చేశారు. దీంతో నాయకుల మధ్య మాటమా ట పెరిగింది. నువ్వేంత అంటే అనువ్వేంత అనే స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. కొద్దిసేవు పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కొద్ది సేపు ఉద్రిక్తత పరిస్థితి నెల కొనడంతో ఓటర్లు భయాందళనకు గురయ్యారు. టీడీపీ కార్యకర్త టీఆర్ఎస్ నాయకులపై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆంధ్రనగర్‌లో స్వల్ప ఉద్రిక్తత నందిపేట : మండలంలోని ఆంధ్రనగర్‌లో బుధవారం ఎన్నికలలో భాగంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులకు, గ్రామస్తులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. వంద మీటర్లలోపు వ్యాపార దుకాణాలను మూసేయాలని పోలీసులు వ్యాపారస్తులకు హెచ్చరించారు. పోలింగ్ స్టేషన్‌కు సమీపంలో ఓ హోటల్ తెరచి ఉంది. దీంతో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సురేష్ హోటల్ యజమానిని గద్దించాడు. దీంతో కోపొద్రిక్తుడైన హోటల్ యజమాని నన్ను బూతులు తిడతావా అంటూ విధులు నిర్వహిస్తున్న సురేష్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. కేంద్రానికి వంద మీటర్లలోపు ఎవ్వరు ఉండకూడదని గ్రామస్తులను పోలీసులు హెచ్చరించారు. తాము ఎన్నికలకు ఓటు హక్కును వినియోగించుకోమని గ్రామస్తులు భీస్మీంచుకోవడంతో నందిపేట ఎస్సై సైదయ్య సంఘటన స్థలానికి వచ్చి స్థానికులకు సముదాయించారు. దీంతో ఓటింగ్ యథావిధిగా సజావుగా సాగింది.